For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019లో ఎక్కువ మంది చేసిన ట్వీట్లు.. ఏమోజీలు, హ్యాష్ ట్యాగులేంటో తెలుసా...

ముందుగా మేము భారతదేశంలోని గోల్డెన్ ట్వీట్ ప్రారంభించబోతున్నాము. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగగా, మన దేశంలోని ప్రధాన పార్టీలలో ఒకటైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండో సారి ఘన విజయాన్ని సాధించింది.

|

ఈ ప్రపంచంలో నిత్యం ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎవరెవరికి ఎన్ని లాభాలొస్తున్నాయి.. ఎన్ని నష్టాలొస్తున్నాయనే విశేషాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్విట్టర్ లో ఓ లుక్కేయండి. ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో తెలుసుకోండి.

ThisHappened

విశ్వవ్యాప్తంగా మానవుల అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునేందుకు ఎన్నో సామాజిక వేదికలు ఉన్నా ట్విట్టర్ మాత్రం అందులో ముందు వరుసలో నిలిచింది. ఇందులో పాలిటిక్స్, ఎంటర్ టైన్ మెంట్, మానవీయ కోణాలు, ఆసక్తికరమైన కథలు, క్రీడలు మరియు బ్రేకింగ్ న్యూస్ తో పాటు ఎలాంటి విషయాలనైనా మాట్లాడొచ్చు. ఇలా పెట్టిన పోస్టులు కొన్నిసార్లు తీవ్రమైన చర్చతో పాటు కొన్ని ఫన్నీ మరియు ఉత్సాహపరిచే పోస్టులను సైతం చేయొచ్చు. కొందరైతే ట్విట్టర్లో అదే పనిగా సెటైరికల్ జోకులు వేస్తుంటారు. కరెంట్ ఆఫైర్స్ పై కూడా చాలా కామెడీ చేస్తుంటారు. ఇంకొందరు తమ కోపం మరియు నిరాశను వ్యక్తం చేయడానికి ట్విట్టర్ ను ఉపయోగిస్తారు. ఇలా 2019 సంవత్సరంలో ఏయే విషయాలు హైలెట్ అయ్యాయో.. ఏయే విషయాలు ఫన్నీగా ఉన్నాయో.. ఏయే ఏమోజీలు,జోకులు అందరికీ నవ్వు తెప్పించాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూసేయండి...

అవెంజర్స్ నుండి ఆరంభం...

అవెంజర్స్ నుండి ఆరంభం...

2019 సంవత్సరానికి సంబంధించి మేము ఇప్పటిదాకా ట్విట్టర్లోల కొన్ని టాప్ ట్వీట్లను తీసుకొచ్చాము. అవెంజర్స్ ఎండ్ గేమ్ నుండి చంద్రయాన్-2 వరకు మరియు ఎక్కువ మంది షేర్ చేసుకున్న హ్యాష్ ట్యాగులను మీకుతెలియజేస్తాము. అవి అందరినీ చాలా బాగా ప్రేరేపిస్తాయి.

గోల్డెన్ ట్వీట్..

గోల్డెన్ ట్వీట్..

ముందుగా మేము భారతదేశంలోని గోల్డెన్ ట్వీట్ ప్రారంభించబోతున్నాము. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగగా, మన దేశంలోని ప్రధాన పార్టీలలో ఒకటైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండో సారి ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా నుండి ఓ ట్వీట్ వచ్చింది. అందులో మనమందరం ఐక్యంగా ఉండటం ద్వారా బలమైన మరియు సమగ్రమైన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యాన్ని ఎలా సాధించగలమనే దానిపై మాట్లాడారు. 2019లో మన దేశంలో ఎక్కువ మంది ఇష్టపడిన మరియు రీట్వీట్ చేసిన పోస్ట్ ఇది. అందుకే ఇది మన దేశంలో ఈ ఏడాది గోల్డెన్ ట్వీట్ అయ్యింది.

క్రికెట్ ట్వీట్..

క్రికెట్ ట్వీట్..

భారతదేశంలో రాజకీయాల తర్వాత క్రీడలకు ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ క్రికెట్ ఆటను కోట్లాది మంది అభిమానులు ఆరాధిస్తారు. ఈ ఏడాది ఇండియా టీమ్ కెప్టెన్ కింగ్ కోహ్లీ చేసిన ట్వీట్ ఎక్కువగా రీ ట్వీట్ చేయబడింది. ఈ ట్వీట్ లో ఏముందంటే విరాట్ కోహ్లీ, కూల్ కెప్టెన్ ధోనీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫొటోను ట్వీట్ చేశారు. ఇది క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

సినిమా ట్వీట్..

సినిమా ట్వీట్..

భారతదేశంలో పాలిటిక్స్, స్పోర్ట్స్ తర్వాత మూవీస్ ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఇక 2019లో సినిమాలకు సంబంధించిన ట్వీట్లలో తమిళ సినిమా పరిశ్రమ అందరినీ ఆకట్టుకుంది. అంతేాకాదు ట్విట్టర్ ట్రెండ్స్ చార్టులో కూడా ఏకపక్షంగా టాప్ ప్లేసులో నిలిచింది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే తమిళ నటుడు విజయ్ నటించిన బిగిల్ చిత్రానికి సంబంధించి పోస్టర్ ఉంది. దీనికి అధిక మంది రీట్వీట్ చేశారు. అందుకే ట్వీట్లలో దీనికి అత్యధిక సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి.

హయ్యెస్ట్ హ్యాష్ ట్యాగులు..

హయ్యెస్ట్ హ్యాష్ ట్యాగులు..

# loksabhaelection2019 : 2019లో లోక్ సభ ఎన్నికలు భారత దేశ భవిష్యత్తును మరియు ప్రజాస్వామ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రజలంతా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి మరియు వారి ఆలోచనలను మరియు అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి ట్విట్టర్ ను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. దీంతో # loksabhaelection2019ను అత్యధికంగా ట్వీట్ చేసిన హ్యాష్ ట్యాగ్ గా మారింది.

# చంద్రయాన్ - 2...

# చంద్రయాన్ - 2...

చంద్రయాన్-2 ఇస్రో యొక్క అత్యంత ప్రతిష్టాత్మక మిషన్లలో ఒకటి. దీని గురించి భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా చారిత్రక క్షణం కోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ఈ మిషన్ చివరి క్షణంలో విజయవంతమవుతుంది. కానీ ఇస్రో మరియు చంద్రయాన్-2 మిషన్ గురించి నాసా నుండి వచ్చిన ట్వీటును భారతీయులు రీట్వీట్లుగా చేసుకున్నారు. అందుకే # చంద్రయాన్ - 2 ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్ ట్యాగులలో ఒకటిగా నిలిచింది.

వరల్డ్ కప్ క్రికెట్...

వరల్డ్ కప్ క్రికెట్...

2019లో క్రికెట్ వరల్డ్ కప్ బాగా వైరల్ అయ్యింది. ఈ క్రీడ గురించి అనేక ఫన్నీ మీమ్స్ వచ్చాయి. ఇండియా టీమ్ గెలిచిన ప్రతిసారి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ ట్వీట్లను చేశారు. అయితే దురదృష్టవశాత్తు భారత్ న్యూజిలాండ్ చేతిలో పోరాడి ఓడిపోయినప్పటికీ, అభిమానులు దిగ్భ్రాంతికరమైన క్షణాలు, క్యాచులు మరియు క్రికెట్ వరల్డ్ కప్ కు సంబంధించి వివిధ మీమ్ లన ట్వీట్ చేశారు. దీంతో

# సిడబ్ల్యుసి 19 ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్‌ట్యాగ్ ట్వీట్లలో మూడో స్థానంలో నిలిచింది.

# పుల్వామా :

# పుల్వామా :

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో హైవేపై జరిగిన పేలుడు దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బంది హృదయ విదారక మరణాన్ని ఎవరు మరచిపోగలరు. ఈ దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మరణించారు, ఆ తర్వాత భారతీయులు తమ దు:ఖాన్ని, కోపాన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ను తీసుకున్నారు. దీంతో # పుల్వామాను భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్‌ట్యాగ్‌లలో ఒకటిగా చేరింది.

# దీపావళి...

# దీపావళి...

ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా # దీపావళిని ఎక్కువ మంది భారతీయులు ఎక్కువ ఉపయోగించారు. ఐదు రోజుల వేడుక ప్రజల ఇళ్లు మరియు పరిసరాలను మాత్రమే కాకుండా వారి చీకటి జీవితాల్లో వెలుగులు నింపింది. భారతీయులంతా తమ ప్రియమైన వారితో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకున్నారు.

అవెంజర్స్ గేమ్...

అవెంజర్స్ గేమ్...

# avengersendgame: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవెంజర్స్ సీరిస్ లో ఈ ఏడాది చివరి సీరిస్ కావడంతో ఆ ఉత్సాహాన్ని అందరూ ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ విధంగా #avengerendgame భారతీయులలో ఎక్కువగా ఉపయోగించే హ్యాష్‌ట్యాగ్‌లలో ఒకటిగా మారింది.

అయోధ్య తీర్పు..

అయోధ్య తీర్పు..

#ayodhyaverdict: రామ మందిరం మరియు బాబ్రీ మసీదు మధ్య భూ వివాదం భారతదేశంలో రాజకీయ, సామాజిక-సాంస్కృతిక మరియు చారిత్రక చర్చగా మారింది, ఇది అంతం లేనిదిగా అనిపించింది. అయితే, భారత సుప్రీంకోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పులో విచారణ మరియు తుది తీర్పు ట్విట్టర్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రజలు తమ ప్రతిచర్యలను చూపించేలా చేసింది. ఇది ట్విట్టర్‌లో భారతీయులలో ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్‌ట్యాగ్‌లలో #ayodhyaverdict ఒకటిగా నిలిచింది.

English summary

#ThisHappened2019: Biggest Moments On Twitter In India

If you look back in 2019, you will find a series of good and bad incidents that took place throughout the year. In order to take you through the memory lanes of 2019, we are here with what happened in 2019.
Desktop Bottom Promotion