Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Vastu Tips: మీ ఇంట్లో బాల్కనీ ఉందా? అయితే ఈ చిట్కాలతో వాస్తు దోషాలు నివారించండి
ఇంటికి బాల్కనీలు ఎంతో ప్రత్యేకం. స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్మి ఇంట్లోకి ప్రవేశించడానికి బాల్కనీలు వీలు కల్పిస్తాయి. కాసేపు ప్రశాంతంగా బాల్కనీలో కూర్చుంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. అయితే అసలు ఇంటికి బాల్కనీ ఎలా ఉండాలి, బాల్కనీ
ఇల్లు ఆనంద నిలయంగా ఉండాలన్నా, ఇంట్లోని కుటుంబ సభ్యుల ప్ర చాలా ముఖ్యం. శాంతంగా జీవించాలన్నా వాస్తు చాలా ముఖ్యం. శాంతి, సామరస్యం, ప్రేమ, ప్రశాంతత ఉండటానికి వాస్తు కీలకమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఇల్లు కట్టుకునేటప్పుడైనా, కొనేటప్పుడైనా వాస్తు సరిగ్గా చూసుకోవాలి. వాస్తు సక్రమంగా ఉన్న ఇంట్లో ఆనందం, ప్రశాంతత, ప్రేమ, వాత్సల్యాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది.

ఇంటికి బాల్కనీలు ఎంతో ప్రత్యేకం. స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్మి ఇంట్లోకి ప్రవేశించడానికి బాల్కనీలు వీలు కల్పిస్తాయి. కాసేపు ప్రశాంతంగా బాల్కనీలో కూర్చుంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. అయితే అసలు ఇంటికి బాల్కనీ ఎలా ఉండాలి, బాల్కనీ ఎలా ఉంటే ఇంట్లో శాంతి వెల్లివిరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

హోం బాల్కనీ, మెటీరియల్ స్పేస్:
ఇంటికి బాల్కనీ ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ దిక్కుల్లో బాల్కనీ ఉంటే ఇంట్లోకి సూర్యరశ్మి ఎక్కువగా వస్తుంది. ఇంటికి బాల్కనీని దక్షిణం లేదా పశ్చిమం వైపు ఉండకూడదు. బాల్కనీ యొక్క అంతస్తు ప్రధాన భవన సమ్మేళనం యొక్క అంతస్తు కింద ఉండాలి.

బాల్కనీ అలంకరణ:
బాల్కనీలో చిన్న చిన్న మొక్కల కుండీలు ఉంచితే ఆహ్లాదానికి ఆహ్లాదం వాస్తు ప్రకారం కూడా ఇలా కుండీలు ఉంచడం మంచిది. మొక్కలు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. స్థూలమైన మొక్కలను ఉంచడం సరికాదు. రంగురంగుల పూలను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే బాల్కనీలో తీగ పారే మొక్కలను పెంచకూడదు. ఇవి ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. అలాగే ఇంట్లోకి సూర్యరశ్మి రాకుండా నిరోధిస్తాయి. అలాగే బాల్కనీకి పడమర, దక్షిణం, నైరుత వైపున కుండీలను ఉంచాలి.

ఫర్నీచర్ ఎక్కడ పెట్టాలంటే:
కొంత మంది బాల్కనీలో ఫర్నిచర్ పెట్టుకుంటారు, మరికొందరు ఎలాంటి ఫర్నిచర్ పెట్టుకోరు. బాల్కనీలో కాసేపు అలా ప్రశాంతంగా సేదదీరడానికి కుర్చీలు, చిన్న సోఫాలు ఉండాల్సిందే. అయితే మీరు బాల్కనీలో కుర్చీలు, బీన్ బ్యాగులు, బల్లాలు వంటి ఫర్నీచర్ పెట్టాలనుకుంటే వాటిని నైరుతి మూలలో మాత్రమే పెట్టాలను గుర్తుంచుకోవాలి. స్వింగ్ లను ఇష్టపడే వారు అయితే ఉత్తరం లేదా దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారం ఇది శుభప్రదంగా పరిగణించబడుతోంది.

పైకప్పు:
బాల్కనీ పైకప్పు ఎప్పుడూ ఉత్తరంత లేదా తూర్పు వైపు వాలుగా ఉండాలి. దక్షిణం లేదా పడమర వైపు ఎత్తుగా ఉండాలి. ప్రధాన భవనం పైకప్పు కంటే బాల్కనీ పైకప్పు ఎత్తు తక్కువగా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే బాల్కనీ రూఫ్ కి అస్బెస్టాస్ లేదా టిన్ ని ఉపయోగించకుండా ఉండడం మంచిది.

సరైన లైట్లు పెట్టుకోవాలి:
బాల్కనీలో లైట్లు పెట్టుకోవడం మర్చిపోవద్దు. చీకట్లో బాల్కనీలో కూర్చోవడం ప్రతికూలతకు దారి తీస్తుంది. అలాగే మరీ ఎక్కువ వెలుతురు ఉండే లైట్లను అమర్చుకుంటే బాల్కనీలో కూర్చున్న ఫీల్ రాదు. అందుకే చిన్న పాటి మొత్తంలో వచ్చే లైట్లను పెట్టుకోవడం మంచిది.

ఎలాంటి రంగులు వేసుకోవాలంటే:
బాల్కనీ అనేది మనస్సుకు విశ్రాంతినిచ్చే ప్రదేశం. కాబట్టి బాల్కనీకి ముదురు రంగులు వేయొద్దు. తెలుపు, నీలం, లేత గులాబీ వంటి ప్రశాంతమైన రంగులు బాల్కనీకి సరిగ్గా సరిపోతాయి.



Click it and Unblock the Notifications