For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vastu Tips: ఎదుగుతున్నకొద్దీ అసూయపడే వ్యక్తులు పెరుగుతూ ఉంటారు, వారి దిష్టిని ఇలా తగ్గించుకోండి

లక్ష్మీదేవిలా భావించే చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతామని వాస్తు శాస్త్రం చెబుతోంది. అసలు ఇంట్లో చీపురును ఎక్కడ పెట్టాలి, కొత్త చీపురును ఎప్పుడు కొనాలి లాంటి వాస్తు నియమాల గురించి ఇప

|

జీవింతం బాగుందని, అంతా సాఫీగా సాగుతుందని, అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకునేలోపే ఏదో ఒక చెడు జరుగుతుంది. ప్రతికూల ఘటనలు ఒక్కొక్కటి జరగడం ప్రారంభమవుతుంది. మనం జీవితంలో ఎదుగుతున్నకొద్దీ అసూయ పడే వ్యక్తులు కూడా పెరుగుతూ ఉంటారు. వారి అసూయ కూడా పెరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల వాళ్లు, పొరుగువారు, బంధువులు, స్నేహితులు కూడా అసూయ పడతారు. అలాంటి వారి నుండి దూరంగా ఉండటం కష్టం.

Tips to remove negative energy of jealous people from your house in Telugu

అలాంటి వారు ఇంటికి వచ్చినప్పుడు వారితో పాటు ప్రతికూల శక్తిని కూడా తీసుకువస్తారు. అసూయపడే వ్యక్తుల వల్ల ఇంటికి దిష్టి తగులుతుంది. దాని వల్ల ఇంట్లో గొడవలు జరుగుతాయి. మానసిక ప్రశాంతత కోల్పోతాం. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇంటి ప్రవేశద్వారం వద్ద ఇలా చేయాలి:

ఇంటి ప్రవేశద్వారం వద్ద ఇలా చేయాలి:

మంచైనా, చెడైనా ఇంటి ప్రధాన ద్వారం గుండానే ఇంట్లోకి వస్తుంది. అందుకే ఇంటికి ప్రవేశ ద్వారా చాలా కీలకం. మీరు ఇంట్లో సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రవేశ ద్వారానికి గుర్రపు నాడా పెట్టుకోవాలి. ఎవరైనా వ్యక్తులు తమతో పాటు ప్రతికూల శక్తిని తీసుకువస్తుంటే ఈ గుర్రపు నాడా నెగెటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది.

దాల్చిన చెక్క పొడి:

దాల్చిన చెక్క పొడి:

పౌర్ణమి రోజు ఇంటి ప్రవేశ ద్వారా వద్ద, ఇంటి లోపల, నాలుగు మూలల్లో చిటికెడు దాల్చిన చెక్క పొడిని చల్లాలి. దాల్చిన చెక్క పొడి ఉన్న ప్యాకెట్ ను జేబులో, బ్యాగులో పెట్టుకోవడం వల్ల ఎదుటివారి దిష్టి తగలకుండా ఉంటుంది.

స్ఫటికాలను ఉపయోగించాలి:

స్ఫటికాలను ఉపయోగించాలి:

స్ఫటికాలను వాస్తు నివారణ కోసం వాడతారు. స్ఫటికాలను ఎడమ చేతికి బ్రాస్‌లెట్‌గా పెట్టుకోవాలి. శరీరం యొక్క ఎడమ వైపు గ్రహణ శక్తి ఉంటుంది. స్ఫటికాన్ని ఎడమ మణికట్టుపై ధరించడం వల్ల అది ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది.

మంత్ర పఠనం అలవాటు చేసుకోవాలి:

మంత్ర పఠనం అలవాటు చేసుకోవాలి:

రోజూ ఒక మంత్రాన్ని జపించడాన్ని అలవాటు చేసుకోవాలి. మీరు దైవ మంత్రాలు జపిస్తే దాని పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది. మంత్ర పఠనం వల్ల మీరు మాత్రమే కాకుండా కుటుంబసభ్యులకు మంచి జరుగుతుంది.

డోర్ మ్యాట్ కింద ఉప్పు:

డోర్ మ్యాట్ కింద ఉప్పు:

ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే మరో మంచి నివారణ ఉప్పు. ఉప్పును గాలి చొరబడని సంచిలో నింపి దానిని ప్రవేశ ద్వారం వద్ద డోర్ మ్యాట్ కింద పెట్టాలి. ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా ఇది అడ్డుకుంటుంది. ప్రతి శనివారం ఉప్పును మారుస్తూ ఉండాలి.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి:

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి:

ఇంటిని ప్రతికూల శక్తితో శుభ్రం చేయడానికి సేజ్, పాలో శాంటో లేదా ఇతర పద్ధతులను ఉపయోగించాలి. ఇది వాతావరణాన్ని శుభ్రపరచడానికి, ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి సహాయపడుతుంది.

కళ్లు మూసుకుని, ఇంటి చుట్టూ తెల్లటి రక్షణ కాంతిని ఊహించుకోవాలి. ఆ కాంతి ఇతరుల నుండి ఏదైనా ప్రతికూల శక్తిని లేదా ఆలోచనలను నిరోధిస్తున్నట్లు విజువలైజ్ చేసుకోవాలి. అలాగే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఇతరుల ప్రతికూల శక్తి మీపై తక్కువ ప్రభావం చూపుతుంది. కేంద్రీకృతంగా సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించాలి.

English summary

Tips to remove negative energy of jealous people from your house in Telugu

read this to know Tips to remove negative energy of jealous people from your house in Telugu
Story first published:Tuesday, January 31, 2023, 16:10 [IST]
Desktop Bottom Promotion