Latest Updates
-
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.! -
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.! -
కిచెన్లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.? -
రక్తం పెరగాలన్నా, చర్మం మెరవాలన్నా.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పింక్ పూరీ ఉండాల్సిందే! -
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.! -
మీరు సెప్టెంబర్లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా.. -
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..
Vastu Tips: ఇంట్లో గుర్రపు నాడాను ఈ దిశలో పెట్టండి, అదృష్యం, ఐశ్వర్యవంతులు కలుగుతాయి
ఇంట్లో గుర్రపు నాడాను ఎటు వైపు ఉంచాలి, ఎక్కడ ఉంచితే సంపద కలుగుతుంది, ఎలా ఉంచితే ప్రయోజనం చేకూరుతుంది లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఇళ్లల్లో యూ ఆకారంలో ఒక ఇనుప వస్తువు కనిపించే ఉంటుంది. దానినే గుర్రపు నాడా అంటారు. గుర్రాల కాళ్లను ఈ ఇనుపు నాడాను అమర్చుతారు. ఈ గుర్రపు నాడా చాలా మంది ఇళ్లల్లో ద్వారాలకు ఉంటుంది. గుర్రపు నాడా అదృష్టాన్ని తీసుకువస్తుందని, సంపదను సృష్టిస్తుందని, ఇంటి కుటుంబసభ్యులపై లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.

ఇంట్లో గుర్రపు నాడాను ఎటు వైపు ఉంచాలి, ఎక్కడ ఉంచితే సంపద కలుగుతుంది, ఎలా ఉంచితే ప్రయోజనం చేకూరుతుంది లాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుర్రపు నాడా ఎలా ఉంచాలి:
గుర్రపు నాడా చివర్లు పైకి చూసేలా అమర్చాలని చెబుతుంటారు. ఇలా అమర్చడం వల్ల ఇంట్లో అదృష్టం, సంపద కలుగుతాయని నమ్ముతారు. అలాగే ఇంట్లోని సంపద బయటకు వెళ్లకుండా ఆపుతుందని విశ్వసిస్తారు. మరికొందరు గుర్రపు నాడా చివర్లు కిందకు చూసేలా అమర్చాలని నమ్ముతుంటారు. ఇలా అమర్చడం అదృష్ట వర్షాన్ని సూచిస్తుందని అంటారు.

గుర్రపు నాడా ఎక్కడ ఉంచాలి:
గుర్రపు నాడాను ఇంటి ప్రధాన ద్వారం పైన ఉంచాలి. ఇంట్లో అదృష్టానికి, శ్రేయస్సుకు ప్రధాన ద్వారం ముఖ్యమైనది. కాబట్టి ఆ తలుపు పైన గుర్రపు నాడా అమర్చుకోవాలి. గుర్రపు డెక్క చాలా వరకు ఇనుముతో తయారు చేసి ఉంటుంది. ఇనుము అదృష్టాన్ని ఆకర్షిస్తుందని కూడా చెబుతారు.

ఇలాంటి గుర్రపునాడాలను పెట్టొద్దు:
ప్లాస్టిక్ లేదా రెసిన్ వంటి ఇతర పదార్థాలతో తయారు చేసిన గుర్రపునాడాల కంటే ఐరన్ తో చేసిన గుర్రపు నాడాలే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. అందుకే వాటినే ఎంచుకోవడం ఉత్తమం. అయితే గుర్రపు నాడాలతో పూర్తి ప్రయోజనం చేకూరాలంటే దానిని గుర్రం ధరించి ఉండాలన్నది కొందరి నమ్మకం. దీని వల్ల మంచి ఫలితం ఉంటుందని వారు విశ్వసిస్తారు.

గుర్రపు నాడాను ఇలా ఉంచాలి:
గుర్రపు నాడాను అమర్చే ముందు దానిని గంగాజలంతో బాగా కడగాలి. గంగాజలం లేకపోతే నది నీరు అయినా పర్లేదు. అలా నీటితో కడిగిన గుర్రపు నాడాను ఎండ వచ్చే చోట ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా సూర్య కిరణాల్లోని పాజిటివ్ ఎనర్జీని గుర్రపు నాడా ఆకర్షించుకుంటుంది.
ఆ తర్వాత ఆ గుర్రపు నాడాను పూజా గదిలోని లక్ష్మీదేవి చిత్రపటం లేదంటే విగ్రహం ముందు ఉంచాలి. పసుపు కుంకుమ, బియ్యం దానిపై వేసి లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలని, ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యంతో స్థిరపడాలని మొక్కాలి. తర్వాత లక్ష్మీ దేవికి హారతి ఇచ్చి గుర్రపు నాడాను అక్కడి నుండి తీయాలి. ఆ గుర్రపు నాడాను ఇంటి ప్రధాన ద్వారం పైన అమర్చుకోవాలి.

గుర్రపు నాడా ఏ దిక్కులో ఉంచాలి:
గుర్రపు నాడాలను మేకులతో ఇంటి ద్వారాలనికి అమర్చవచ్చు. లేదంటే నల్లటి దారానికి గుర్రపు నాడాను కట్టి దానిని ప్రధాన ద్వారం పైన వేలాడదీయవచ్చు. చాలా ఇళ్లకు ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా, ఉత్తర వైపు ఉంటుంది. అదే దిశలో గుర్రపు నాడాలను వేలాడదీయాలి లేదంటే అమర్చాలి. ఒకవేళ ఇంటి ప్రధాన ద్వారా ఇతర దిశల్లో ఉంటే అక్కడ గుర్రపునాడాను అమర్చకూడదు. దీని వల్ల ప్రతికూల ప్రభావాలు వస్తాయి.
ఇంటికి అదృష్టాన్ని, శ్రేయస్సును తీసుకురావడానికి గుర్రపు నాడాలను వాడాలని పెద్దలు చెబుతుంటారు. గుర్రపు నాడాలను ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శాంతిని ఇవ్వడమే కాకుండా, డబ్బు కొరతను కూడా తొలగిస్తుంది.



Click it and Unblock the Notifications