Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు పాత రుణాలను చెల్లిస్తారు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, ఫాల్గుణ మాసంలో శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని పట్ల నిర్లక్ష్యం ఈరోజు మీ సమస్యలను పెంచుతుంది. ఇది కాకుండా, మీకు సహోద్యోగులతో విభేదాలు ఉండొచ్చు. వ్యాపారవేత్తలు పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి. ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు పెరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటుతో ఏ పని చేసినా, మీకు ఇబ్బందులు తప్పవు. ఆర్థిక పరంగా ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ :9
లక్కీ టైమ్ : ఉదయం 4:40 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో ఉద్యోగులకు చాలా అదృష్టకరమైన రోజు. మీరు ప్రమోషన్ పొందొచ్చు. అలాగే మీ ఆదాయం పెరిగే బలమైన అవకాశం ఉంది. ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్న వారు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందొచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు పెద్ద ఒప్పందాలు చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే, పేపర్‌వర్క్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ బడ్జెట్‌కు మించి హాబీల కోసం ఖర్చు చేయడం సరికాదు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈరోజు కుటుంబంతో చాలా సరదాగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ :2
లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు మీ జీవిత భాగస్వామితో ప్రత్యేకమైన రోజు కానుంది. మీరు మీ ప్రియమైన వారి నుండి కొన్ని శుభవార్తలను వింటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీరు పాత కుటుంబ రుణాన్ని తొలగించడంలో కూడా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఆఫీసు వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు మీ బాస్ మూడ్ చాలా బాగుంటుంది. చిరు వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :13
లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో ఈరోజు విద్యార్థులు చాలా కష్టపడాలి. ఈ సమయంలో, చదువుల పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సమస్యలు వస్తాయి. మీ పరీక్షలు త్వరలో రాబోతున్నట్లయితే, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. టీవీ మరియు మొబైల్ కు దూరం ఉండాలి. మరోవైపు ఉద్యోగులకు పురోగతి ఉండకపోవచ్చు. అయితే వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఆశించిన ఫలితాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు ఇంటి సభ్యుల నుండి మానసిక మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో మెరుగుదల ఉండొచ్చు. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో అదనపు సమయాన్ని గడపగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :20
లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 11:30 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు అసూయపడే వ్యక్తులు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించొచ్చు. ఈ సందర్భంలో, మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. మీరు కార్యాలయంలో అదనపు పని చేయాల్సి రావొచ్చు. బహుశా మీ సహోద్యోగుల్లో ఒకరు సెలవులో ఉండొచ్చు. ఈ కారణంగా మీరు ఓవర్ టైం పని చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీ కృషి రాబోయే రోజుల్లో మీకు పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తుంది. ఈరోజు మీకు అనుకూలమైన రోజు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో సామరస్యం ఉంటుంది. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ :9
లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ ప్రత్యర్థులు మీకు గట్టి పోటీని ఇవ్వగలరు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ చిన్న వ్యాపార నిర్ణయాన్ని చాలా తెలివిగా తీసుకోవాలి. అలాగే మీరు తొందరపాటును నివారించాలి. ముఖ్యంగా మీకు సంబంధించిన రహస్య విషయాలను పంచుకోవడం మానుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ అజాగ్రత్త వైఖరి మీ ప్రియమైన వారిని అసంతృప్తికి గురి చేస్తుంది. మీ ప్రియమైన వారి హృదయాలను గాయపరిచే పనిని చేయవద్దు. తప్పు జీవనశైలి కారణంగా ఈరోజు మీ ఆరోగ్యం క్షీణించొచ్చు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :14
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో వ్యాపారులు త్వరలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే, మీ మనస్సులో కొన్ని సందేహాలు ఉంటే, మీరు మీ సన్నిహితుల నుండి సలహా తీసుకోవాలి. మీ సమస్యలన్నీ తొలగిపోవచ్చు. ఉద్యోగస్తులకు కార్యాలయంలోని పై అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. మీరు నిరుద్యోగులైతే, మీరు మంచి ఉపాధి అవకాశాలను పొందొచ్చు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు గొప్ప ప్రయోజనం పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇంటి సభ్యులతో మీ సంబంధం మరింత దృఢంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, మీరు మీ దుబారా ఖర్చులను నియంత్రించాలి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :39
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగాలు చేసే వారికి చాలా కష్టంగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రాకపోతే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. సరైన సమయం వచ్చినప్పుడు మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో తీసుకున్న ఏదైనా తప్పుడు నిర్ణయం వల్ల మీరు ఈరోజు భారీ నష్టాన్ని చవిచూడొచ్చు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తీవ్రమవుతాయి. మీ ప్రియమైన వ్యక్తి యొక్క దుష్ప్రవర్తన మీ మనోభావాలను దెబ్బతీస్తుంది. అటువంటి పరిస్థితిలో, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు. పిల్లల చదువుల కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయొచ్చు. మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, మీ మందులను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండండి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ :5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా మంచిగా ఉంటుంది. మీ ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు పరిష్కారం లభిస్తుంది. మరోవైపు, వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మంచి అవకాశాన్ని పొందొచ్చు. ఈరోజు మీరు పెద్ద కస్టమర్‌తో వ్యవహరించొచ్చు. ఈరోజు మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు కొత్త బట్టలు లేదా ఆభరణాలు పొందొచ్చు. జీవిత భాగస్వామి మీ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయగలరు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉండొచ్చు.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 37
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 7:55 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. ఈరోజు ఉన్నతాధికారులతో పాటు బాస్ దృష్టి మీపైనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు చిన్న పొరపాట్లు చేయకుండా ఉండాలి. ప్రశాంతమైన మనస్సుతో మీ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే, మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు ఈరోజు ఎలాంటి కొత్త ఒప్పందాలు చేసుకోకుండా ఉండాలి. మీరు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మీరు తప్పుడు ఫలితాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ ఇంటి వాతావరణం బాగా ఉండదు. మీరు కుటుంబ సభ్యులతో ప్రేమతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :29
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా చాలా కష్టపడాల్సి రావచ్చు. ఇది కాకుండా, మీరు ఈరోజు కూడా అనవసరంగా ప్రయాణించాల్సి ఉంటుంది. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ఈరోజు మీరు విజయాన్ని పొందొచ్చు. అయితే, మీరు మీ ఆర్థిక నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. మీరు మీ ప్రియమైన వారితో కలిసి ఒక అందమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశాన్ని పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో స్టాక్ మార్కెట్లో పని చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆలోచించకుండా ఖర్చు పెట్టడం మానుకోండి. లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడొచ్చు. ఇది కాకుండా, సేల్స్ మరియు మార్కెటింగ్‌కు సంబంధించిన వ్యక్తులు కూడా ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో కాసేపు గడిపే అవకాశం లభిస్తుంది. ఇది మీ ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, ఒత్తిడికి దూరంగా ఉండండి. సానుకూలంగా ఉండండి మరియు కష్టపడి పని చేయండి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











