Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Today Rasi Phalalu :ఓ రాశి నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది... మీ కష్టానికి తగ్గ ఫలితమొస్తుంది...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, మాఘ మాసంలో మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా అదృష్టకరంగా ఉంటుంది. ఈరోజు మీ ముఖ్యమైన పనులు కొన్ని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రతికూల పరిస్థితులలో, మీరు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితిలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ తల్లిదండ్రులతో సంబంధం బలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కొంత దూరం ఉండొచ్చు. సంభాషణ ద్వారా మీ మధ్య ఉన్న అపార్థాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. మౌనంగా ఉండడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు వెన్నునొప్పి లేదా కడుపు నొప్పితో ఇబ్బంది పడొచ్చు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : ఉదయం 7:25 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో చాలా ఆనందదాయకంగా ఉంటుంది. వీలైతే, మీ బిజీ రొటీన్ నుండి కొంత సమయం కేటాయించి, మీ జీవిత భాగస్వామితో కలిసి వారికి ఇష్టమైన ప్రదేశంలో షికారు చేయండి. మీరు ఇంటి నుండి పని చేస్తున్నట్లయితే, మీరు కమ్యూనికేషన్ గ్యాప్‌ను నివారించాలి. మరోవైపు, వ్యాపారవేత్తలు ఈరోజు తొందరపడి పెద్దగా ఒప్పందాలు చేసుకోవద్దు. మీరు పెద్ద వ్యాపార ఆఫర్‌ను పొందినట్లయితే, మీరు మీ సన్నిహితులు మరియు కొందరు అనుభవజ్ఞుల నుండి తప్పనిసరిగా సలహా తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు ఎలాంటి అజాగ్రత్తలు తీసుకోవద్దు. ముఖ్యంగా ఈ ప్రపంచ మహమ్మారి దృష్ట్యా, మీరు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 8:35 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు మీరు కొన్ని కొత్త వ్యూహాలు చేయొచ్చు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందొచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి. ఈరోజు మీరు పిల్లల చదువుల గురించి చాలా ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ఈరోజు బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో ఈరోజు మంచి అవకాశాన్ని పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు కడుపుకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి బయటపడొచ్చు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. వ్యాపారవేత్తలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండాలి. లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడాలి. ఉద్యోగస్తులకు ఈరోజు సవాలుగా ఉండే అవకాశం ఉంది. కొన్ని కారణాల వల్ల మీ ప్రమోషన్ నిలిచిపోవచ్చు. దీని కారణంగా మీరు చాలా నిరాశకు గురవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టగలరు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల ఆప్యాయత మరియు మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : సాయంత్రం 5:05 నుండి రాత్రి 8:55 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో తమ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతికూల పరిస్థితులలో, ప్రశాంతంగా వ్యవహరించాలి. అనవసరమైన కోపం మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఈరోజు లాభాలను ఆర్జించడానికి మంచి అవకాశం పొందొచ్చు. అయితే, ఇతరులను గుడ్డిగా నమ్మడం మానుకోండి. మీరు మీ నిర్ణయాలు తెలివిగా తీసుకుంటే, మీరు మంచి లాభాలను పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీకు ఎలాంటి పెద్ద సమస్య ఉండదు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులకు కూడా తగినంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో మంచి సామరస్యం ఉంటుంది. మీకు గుండె సంబంధిత వ్యాధి ఉంటే, కోపం మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో కొన్ని గొప్ప అవకాశాలను పొందుతారు. వ్యాపారస్తులు తమ వ్యాపార పురోగతికి కృషి చేస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తే, త్వరలో మీ వ్యాపారం రెండింతలు వేగంగా అభివృద్ధి చెందుతుంది. చెక్క, ఫర్నీచర్, బట్టలు మొదలైన వాటిలో పని చేసేవారు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పురోగతి మార్గాలు తెరచుకుంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు. అకస్మాత్తుగా మీ ఇంటికి కొందరు అతిథులు రావొచ్చు. మీరు వారి ఆతిథ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇతరులను ఆకట్టుకోవడానికి మీ ఆదాయానికి మించి ఖర్చు చేయడం మానుకోండి. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఫ్రెష్‌గా ఉంటారు.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మారుతున్న సీజన్ కారణంగా మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. దీంతో పాటు, మీరు మీ ఆహారం మరియు పానీయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు ఆఫీసులో తమ పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలి. ఈరోజు మీ పని ఏదైనా పెండింగ్‌లో ఉంటే, మీరు బాస్ యొక్క కోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వ్యాపారస్తుల ఆర్థిక స్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల మీరు మీ ప్రియమైన వ్యక్తికి దూరంగా ఉంటే, ఈరోజు మీరు వారిని చాలా మిస్ అవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు రావొచ్చు.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు భగవంతుని ఆరాధనలో మంచి అనుభూతి చెందుతారు. మీరు ఇంట్లో ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించొచ్చు. ఇది కాకుండా, మీరు ఏదైనా మతపరమైన ప్రదేశాలకు కూడా వెళ్ళొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. చిన్న విషయాలపై వాదనలకు దూరంగా ఉండాలి. లేకుంటే అది మీ పిల్లలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. ఉద్యోగులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు కూడా చేయొచ్చు. మరోవైపు, వ్యాపార సంబంధిత వ్యక్తులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు ఈరోజు మధ్యలో నిలిచిపోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు నష్టం రావొచ్చు. మీకు కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నట్లయితే, ఈరోజు మీ సమస్య కొంచెం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలను ఆశించొచ్చు. అయితే, ఈరోజు మీరు ఏ కొత్త పని చేయొద్దు. హోటళ్లు లేదా రెస్టారెంట్లలో పనిచేసే వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు చాలా బిజీగా ఉండబోతోంది. బాధ్యతల భారం మీపై ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఈరోజు మీరు కొన్ని తీవ్రమైన గృహ సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, మీకు వివాహ ప్రతిపాదన రావొచ్చు. అయితే, అలాంటి సందర్భాలలో మీరు తొందరపడొద్దు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు మీకు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో చాలా కాలం నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగం గురించి ఒక శుభవార్త వినిపిస్తుంది. ఇదంతా మీ కష్టానికి ఫలితమే. ఇలా కష్టపడి పని చేస్తూ ముందుకు సాగండి. మరోవైపు వ్యాపారులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మంచి అవకాశాన్ని కూడా పొందొచ్చు. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదల ఉంటుంది. ఇంకోవైపు మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఈరోజు మీరు సుదీర్ఘ వైద్య బిల్లును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో విద్యార్థులు చదువులు మరియు రచనలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు ఆఫీసులో చిన్న పనిని కూడా జాగ్రత్తగా చేయాలి. మీరు ఏ మాత్రం పొరపాటు చేసినా నష్టం తీవ్రంగా ఉండొచ్చు. వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలు పొందగలరు. పెద్ద లాభాల కోసం చిన్న లాభాలను విస్మరించొద్దు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు ఈరోజు పిల్లలతో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. మీరు ఈరోజు మీ ప్రియమైన వారి కోసం కొంత షాపింగ్ కూడా చేయొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు కొన్ని చర్చలకు దూరంగా ఉండాలి, లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడొచ్చు. ప్రత్యేకించి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, ఈరోజు మీకు సవాలుగా ఉండే రోజు. ఉద్యోగస్తులు ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తుంటే, త్వరలో మీకు మంచి అవకాశం రావొచ్చు. మీరు సానుకూలంగా ఉండండి. కష్టపడి పని చేయండి. మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. ఈరోజు మీరు చిన్న అప్పులను కూడా వదిలించుకోవచ్చు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మంచి శృంగార సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











