For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu : ఓ రాశి వారు ఈరోజు పేదలకు సహాయం చేస్తారు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, మార్గశిర మాసంలో సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -03 January 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Mercury Transit in Capricorn :బుధుడు మకరంలోకి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!Mercury Transit in Capricorn :బుధుడు మకరంలోకి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో చాలా మంచిగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఇటీవల ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్లయితే, ఈరోజు మీరు దాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. మరోవైపు, మీరు వ్యాపారం చేస్తే, భాగస్వామ్య వ్యాపారంలోకి వెళ్లకుండా ఉండాలి. మీ భాగస్వామి మిమ్మల్ని పెద్దగా మోసం చేసే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని పెద్ద విజయాలు పొందొచ్చు. స్నేహితులతో సరదాగా సమయాన్ని గడపొచ్చు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఇతరులు చెప్పేవాటి గురించి ఎక్కువగా ప్రభావితం కాకండి. కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి. ఏది మంచి.. ఏది చెడు అనే విషయం మీకు బాగా తెలుసు. కొందరు వ్యక్తులు మీ లక్ష్యం నుండి మిమ్మల్ని మళ్లించడానికి కూడా ప్రయత్నించొచ్చు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మీరు శృంగార జీవితంలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఈరోజు మీ భాగస్వామితో చాలా సరదాగా గడపబోతున్నారు. ఆర్థిక పరంగా ఈరోజు నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 7:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పని భారం పెరగొచ్చు. మరోవైపు ఆలోచించకుండా మాట్లాడే అలవాటు వల్ల ఈరోజు మీరు కొన్ని వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో, మీరు చాలా చికాకును అనుభవిస్తారు. ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండండి, లేకుంటే భవిష్యత్తులో మీరు పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. మీ మనసులో ఏదైనా సందిగ్ధత ఉంటే, మీ సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకోండి. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని కొత్త ఆర్థిక ప్రణాళికలను కూడా చేయొచ్చు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి రాత్రి 8:45 గంటల వరకు

2022 Yearly Rasi Phalalu : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు అద్భుత విజయాలు సాధిస్తారట...!2022 Yearly Rasi Phalalu : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు అద్భుత విజయాలు సాధిస్తారట...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఈరోజు మీరు ఒకరితో ఒకరు చాలా శృంగార క్షణాలు గడుపుతారు. మరోవైపు, ఇంటి సభ్యులతో విభేదాల కారణంగా మీ టెన్షన్ పెరగొచ్చు. మీకు కావాలంటే, మీరు పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు లాభాలు రావొచ్చు. ప్రేమ విషయంలో ఈరోజు మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు అటువంటి మూలం నుండి డబ్బు సంపాదించొచ్చు. ఆదాయం పెరగడంతో డబ్బుకు సంబంధించిన ఆందోళనలు తీరుతాయి. బహుశా ఈరోజు మీరు హాబీల కోసం కూడా ఏదైనా ఖర్చు చేస్తారు. పని విషయంలో ఈరోజు సవాలుగా ఉంటుంది. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేకుంటే అనవసర వివాదాలలో చిక్కుకోవడం ద్వారా మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు. రాబోయే కాలంలో మీరు దీని భారాన్ని భరించాల్సి రావొచ్చు. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండదు. పిల్లల వైపు నుండి సంతోషం ఉంటుంది. మీరు వ్యాపారం చేస్తే, ఈరోజు మీరు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు కష్టపడి పని చేస్తారు. మీ అద్భుతమైన పనిని చూసి మీ ఉన్నతాధికారులు ఆశ్చర్యపోతారు. ఈరోజు సహోద్యోగులు కూడా మీ కృషిని అభినందిస్తారు. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మద్దతు పొందడం ద్వారా మీరు చాలా ఆనందాన్ని పొందుతారు. మీరు మీ సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులతో చాలా సరదాగా గడుపుతారు. మీరు ఒంటరిగా ఉంటే, ఈరోజు మీకు ప్రేమ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీరు ఆస్తికి సంబంధించిన పనిలో విజయం పొందొచ్చు. వ్యాపారులు ఈరోజు కొంత పెద్ద మొత్తంలో లాభం పొందొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

ఈ 5 రాశుల వారు దేనికీ భయపడరు, ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తి వీరి బ్లడ్ లోనే ఉంది!ఈ 5 రాశుల వారు దేనికీ భయపడరు, ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తి వీరి బ్లడ్ లోనే ఉంది!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అకస్మాత్తుగా ఏదైనా పెద్ద ఆర్థిక ప్రయోజనం పొందడం వల్ల మీ సమస్య పరిష్కారమవుతుంది. ఈరోజు మీరు కొన్ని గృహ విషయాల గురించి ఆందోళన చెందుతారు. ముఖ్యంగా మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మీ ఔదార్యాన్ని సద్వినియోగం చేసుకోనివ్వకపోవడమే మంచిది. ఈరోజు మీరు ఓర్పు మరియు ప్రశాంతతతో పని చేయాలి. పని ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. మీరు వ్యాపారం చేస్తుంటే, పెద్ద ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, లేకుంటే ఈరోజు కొన్ని ఆటంకాలు ఉండొచ్చు. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీకు నచ్చిన ప్రదేశానికి మీ ప్రేమ భాగస్వామితో కలిసి పిక్నిక్‌కి వెళ్లొచ్చు. మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీరు మీ జీవిత భాగస్వామితో చాలా ప్రశాంతంగా గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు మీ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకున్న తర్వాత మాత్రమే ఖర్చు చేస్తారు. కొంత కాలంగా మీరు ఏదైనా విషయం గురించి చాలా ఆందోళన చెందుతూ, అశాంతితో ఉన్నట్లయితే, ఈరోజు మీ సమస్యకు ముగింపు పలికే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో స్థానం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు పరిస్థితులు మీకు అనుకూలంగా మారొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు చిత్తశుద్ధితో పని చేస్తే, ఈరోజు అదృష్టం కూడా తోడవుతుంది. గ్రహాల కదలిక ఈరోజు కొంత పెద్ద విజయాన్ని చూపుతోంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి బాగా ఉండదు. మీరు ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా ఉండటం మంచిది. లేకుంటే మీ మధ్య విభేదాలు తీవ్రమవుతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు చేసే ముందు మీ బడ్జెట్‌ను గుర్తుంచుకోండి. ఈరోజు స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీరు సాయంత్రం బంధువుల ఇంటికి వెళ్ళొచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమపూర్వక ప్రవర్తన మీ రోజును మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఉద్యోగులు ఆఫీసులో ఎక్కువగా నవ్వడం మానుకోండి, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. అలాగే, సమయానికి కార్యాలయానికి చేరుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు కొందరు పేదలకు సహాయం చేయొచ్చు. ఇది మీ ప్రతిష్టను కూడా పెంచుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. ఈరోజు, చాలా సందర్భాలలో, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మీరు నిరాశకు గురవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆలోచించకుండా విలాసవంతమైన వస్తువులపై ఎక్కువ ఖర్చు చేయడం మానుకోండి. ఈరోజు మీరు మీ మాట మరియు ప్రవర్తనను సమతుల్యంగా ఉంచుకోవాలి. మీపై మీకు కోపం తెప్పించే పనిని చేయడం మానుకోండి. ఇది కాకుండా, ఏదైనా తప్పు మరియు అనవసరమైన వాటికి దూరంగా ఉండండి, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు కొంత పెద్ద లాభాలను పొందొచ్చు. అయితే, మీరు మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. అధిక పనిని నివారించండి, ఇది మీ ఒత్తిడిని మాత్రమే పెంచుతుంది. మీ శృంగార జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీ భాగస్వామి మానసిక స్థితి బాగా ఉండదు. ఈరోజు ఏదైనా వివాదాస్పద అంశాన్ని చర్చించడం మానుకోండి. మీరు పనిలో సంతృప్తికరమైన ఫలితాలను పొందాలనుకుంటే, ప్రణాళికాబద్ధంగా పని చేయండి. మానసికంగా దృఢంగా ఉండాలంటే రోజూ ధ్యానం చేయండి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -03 January 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Saturday, January 1, 2022, 19:32 [IST]
Desktop Bottom Promotion