Today Rasi Phalalu : ఈ రాశుల వ్యాపారవేత్తలు ఈరోజు కొత్త పని ప్రారంభించొద్దు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -03 September 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు క్రెడిట్ లావాదేవీలు చేయకుండా ఉండాలి. లేకుంటే రాబోయే రోజుల్లో మీ ఇబ్బందులు పెరగొచ్చు. మరోవైపు, ఉద్యోగులు మంచి పనుల కోసం తమ శక్తిని ఉపయోగించాలి. ఇతరుల పనిలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీ పనిపై దృష్టి పెట్టండి. అనవసరంగా మీ జీవిత భాగస్వామిని అనుమానించడం మానుకోండి. మీ ఈ అలవాటు మీ వైవాహిక జీవితంలో సంతోషాన్ని కప్పివేస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీ కుటుం జీవితంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఇది మీకు మానసికంగా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అదే సమయంలో, మీరు కూడా చాలా రిఫ్రెష్ అవుతారు. వ్యాపార సంబంధిత వ్యక్తులు ఈరోజు అనవసరంగా ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధంలో సామరస్యం ఉంటుంది. అయితే, ఈ సమయంలో వారు విశ్రాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది. మీ ప్రియమైన వారు అజాగ్రత్తగా ఉంటే వారి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీకు ఆదాయం కంటే ఎక్కువ వ్యయం ఉండొచ్చు. దీని కారణంగా మీరు చాలా ఒత్తిడికి గురవుతారు. మరోవైపు ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. అనవసరమైన వివాదం మీ పనిని ప్రభావితం చేయొచ్చు. వ్యాపారులు ఈరోజు పెద్ద డీల్స్ చేయడానికి అవకాశం పొందొచ్చు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు పూర్తి వినోదభరితంగా ఉంటుంది. స్నేహితులతో, ఈరోజు మీరు ఇంట్లో చిన్న పార్టీని నిర్వహించొచ్చు. చాలా కాలం తర్వాత అలాంటి సమయం గడిపిన తర్వాత, మీరు చాలా మంచి మరియు రిఫ్రెష్ అనుభూతి చెందుతారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు తమ ప్రయత్నాలను పెంచుకోవాలి. మరోవైపు, మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నట్లయితే, ఆఫీసులో సహోద్యోగులు మరియు సీనియర్ అధికారులతో మీకు మంచి అనుబంధం ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమ మరియు బంధం ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 9:20 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారి వ్యాపారవేత్తలకు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో ప్రతికూలంగా ఉంటుంది. మీరు తెలివిగా వ్యవహరించడం మంచిది. అదే సమయంలో, అదనపు పనిభారం ఉపాధి వ్యక్తులను ఇబ్బంది పెట్టొచ్చు. సీనియర్ అధికారుల ఒత్తిడి మీపై ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సాధ్యమే. మీరు ఇంటి సభ్యులతో వాదనకు దిగొచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీరు మీ వైపు ప్రశాంతంగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీ జీవితం కూడా ప్రభావితం కావొచ్చు. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో బాస్ మరియు సీనియర్ అధికారుల నుండి మద్దతు ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటారు. మీరు మీ పనులన్నీ వేగంగా పూర్తి చేస్తారు. మీరు బాస్‌తో ఒక ముఖ్యమైన చర్చ కూడా ఉండొచ్చు. అదే సమయంలో, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు త్వరగా లాభాలు ఆర్జించడానికి ఆతురుతలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు ఇంటి పెద్దల ఆశీస్సులు పొందుతారు. మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవాలి.

లక్కీ కలర్ : కుంకుమ పువ్వు

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు సోమరితనాన్ని వదులుకోవాలి. మీరు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. ఈరోజు మీరు అజాగ్రత్తగా ఉంటే, మీ ముఖ్యమైన పనులు చాలా వరకు అసంపూర్తిగా ఉంటాయి. వ్యాపారవేత్తలు ఈరోజు ఆర్థికంగా నష్టపోవచ్చు. ఇతరులను గుడ్డిగా నమ్మడం మానుకోండి. ఇది కాకుండా, మీ వ్యాపార నిర్ణయాలు మీరే తీసుకుంటే మంచిది. మీ వైవాహిక జీవితంలో, మీ జీవిత భాగస్వామితో విభేదాలు లోతుగా ఉంటాయి. మీరు విడిపోయే అవకాశం కూడా ఉంది. మీరు మిమ్మల్ని మీరు నియంత్రించుకుని, మీ నిర్ణయాలు తెలివిగా తీసుకుంటే మంచిది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేయవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి కోసం అన్వేషణ ముగిసి ఉండొచ్చు. త్వరలో మీరు మూడు ముళ్లు వేయవచ్చు. మరోవైపు, మీరు ఇప్పటికే వివాహం చేసుకున్నట్లయితే, మీ వైవాహిక జీవితంపై మరింత శ్రద్ధ వహించాలి. మీ తమ్ముళ్లతో సంబంధాలు బాగుంటాయి. ఈరోజు మీరు వారితో సరదాగా గడిపే అవకాశం కూడా లభిస్తుంది. ఉద్యోగులు ఈరోజు పని ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఉన్నతాధికారులను సంతోషపెట్టడానికి మీరు ఏదైనా ప్రయోగాలు చేస్తే, అది మీ పనితీరుతో పాటు మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. వ్యాపారులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆరోగ్య విషయాలు ఈరోజు బాగానే ఉంటాయి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఇటీవల ఏదైనా పెట్టుబడి పెడితే, దాని నుండి మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఇలా ఆలోచించిన తర్వాత మీరు మీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, త్వరలో మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈరోజు ఆర్థికంగా లాభాలు పొందొచ్చు. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తుంటే మీరు విజయం సాధించొచ్చు. ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. అధిక పనిభారం కారణంగా, ఈరోజు మీకు మీ కోసం సమయం దొరకదు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, ఈ రోజు వెన్ను లేదా నడుముకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో పెండింగ్ పనులన్నీ పూర్తి చేయొచ్చు. ఇది మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. మీ పనితీరుతో బాస్ చాలా సంతృప్తి చెందుతారు. దీనితో పాటు, మీకు ఉన్నతాధికారుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఔషధ వ్యాపారులు మంచి ఆర్థిక లాభాలను పొందగలరు. మీ వ్యాపారం పెరుగుతుంది. అదే సమయంలో, ధాన్యాలకు సంబంధించిన పని చేసే వ్యక్తులు నేడు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందొచ్చు. మీ ఇంటి వాతావరణం ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. అయితే మీరు నిరాశతో ఏ పని పూర్తి చేయలేరు. మీరు సానుకూలంగా ఉండండి. త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. మీ కార్యాలయ వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు మీ పని చాలా వేగంగా పూర్తవుతుంది. ఇది కాకుండా, అవసరమైనప్పుడు మీరు సహోద్యోగులకు కూడా సహాయం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కావలసిన బదిలీని పొందొచ్చు. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఒకరిపై ఒకరికి నమ్మకం బలపడుతుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు మానసికంగా కూడా బలంగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:50 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ప్రత్యేకించి మీకు ఆస్తమా సమస్య ఉన్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ సమస్యలు పెరుగుతాయి. పని విషయంలో ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా పరుగులు చేయాల్సి రావచ్చు. అమ్మకాలు మరియు మార్కెటింగ్‌కు సంబంధించిన వ్యక్తులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తలు ఈరోజు ఎలాంటి కొత్త పని ప్రారంభించొద్దు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఇంటి సభ్యులతో మీ సంబంధం బాగుంటుంది, మీ జీవిత భాగస్వామితో వివాదం లేదా అహంకారాన్ని నివారించండి. మీరు ఒకరినొకరు గౌరవించుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అవసరం కంటే ఎక్కువ ఖర్చు చేయడం మానుకోండి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10:15 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Friday, September 3, 2021, 5:00 [IST]
Desktop Bottom Promotion