For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఈ రాశుల వ్యక్తులకు త్వరలో వివాహం జరగొచ్చు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu :ఈ రాశుల వ్యక్తులకు త్వరలో వివాహం జరగొచ్చు...

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Budh Margi 2022:వృషభంలోకి బుధుడి సంచారం..ఈ రాశులకు డబ్బే డబ్బు..! మీ రాశి ఉందేమో చూసెయ్యండి..Budh Margi 2022:వృషభంలోకి బుధుడి సంచారం..ఈ రాశులకు డబ్బే డబ్బు..! మీ రాశి ఉందేమో చూసెయ్యండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఈరోజు వ్యాపారులకు కష్టాలు ఎదురవుతాయి. మీరు మీ వ్యూహాలు మరియు వ్యాపార ప్రణాళికలను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మీ పనికి సంబంధించిన వస్తువులను ఎక్కువగా తరలించడం మానుకోండి, లేకపోతే మీ ప్రత్యర్థులు మీ మార్గాన్ని అడ్డుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు మరియు ఈ రోజు మీరు మీ పనిని శ్రద్ధగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు ఈరోజు కొన్ని పెద్ద కొనుగోళ్లు కూడా చేయవచ్చు. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది మరియు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో అదనపు సమయాన్ని గడపగలుగుతారు. మీ ప్రియమైన వారి మనసును తెలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6:10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని రోజులు హెచ్చు తగ్గులు ఉంటే, ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో పెద్ద మెరుగుదల ఉంటుంది. అలాగే మీ అత్తమామల మద్దతు కూడా ఉంటుంది. మీరు మీ భాగస్వామి నుండి మంచి బహుమతిని కూడా పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. అయితే ఉద్యోగులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు అదనపు బాధ్యతలను తీసుకోవలసి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 7:40 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు చాలా అదృష్టవంతంగా ఉంటుంది, ప్రత్యేకించి మీరు పిల్లల గురించి శుభవార్తలు వినొచ్చు. త్వరలో మీ వైవాహిక జీవితంలో కొత్త మరియు అందమైన మలుపు రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మీ ఆదాయానికి మించి ఖర్చు చేయకండి, లేకపోతే మీ భవిష్యత్తు ప్రణాళికలలో ఇబ్బందులు రావొచ్చు. పని చేసే వ్యక్తులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు పనికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు కాలేయానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 11:30 గంటల వరకు

Budh Margi 2022:వృషభంలోకి బుధుడి సంచారం..12 రాశులపై ఎలాంటి ప్రభావం..!Budh Margi 2022:వృషభంలోకి బుధుడి సంచారం..12 రాశులపై ఎలాంటి ప్రభావం..!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ కలహాలు మరియు మానసిక అశాంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఇంటి వాతావరణం బాగా ఉండదు. మీ ప్రియమైన వారితో సంబంధంలో ఇబ్బంది ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు చాలా ఓపికగా వ్యవహరించాలి. సరైన సమయం వచ్చినప్పుడు, మీ సమస్య కచ్చితంగా పరిష్కరించబడుతుంది. పని విషయంలో ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పనుల భారం తగ్గుతుంది, అలాగే ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మరోవైపు, ఈరోజు వ్యాపారులకు కొత్త అవకాశాన్ని తీసుకురావొచ్చు. మీరు ఇటీవల ఏదైనా నష్టాన్ని చవిచూస్తే, దాన్ని భర్తీ చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగా ఉండదు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :33

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 3:05 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఇటీవల ఏదైనా పరీక్షను పాల్గొన్నట్లయితే, మీరు అద్భుతమైన విజయాన్ని పొందొచ్చు. మరోవైపు, మీరు మీ చదువును పూర్తి చేసి, మీరు మంచి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీరు కోరుకున్న ఉద్యోగం పొందడానికి బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనట్లు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇంటి వాతావరణం బాగుంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో మృదుత్వం ఉంటుంది మరియు ఇంటి బాధ్యతలను నెరవేర్చడంలో వారి మద్దతు మీకు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ బడ్జెట్‌కు మించి వెళ్లకుండా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే విశ్రాంతిపై కూడా దృష్టి పెట్టాలి. పనిలో పడి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి ఉదయం 11:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన కాస్త పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. వారి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల మీరు ఈరోజు చాలా ఒత్తిడికి లోనవుతారు. మీ జీవిత భాగస్వామి యొక్క అజాగ్రత్త వైఖరి మీ సమస్యలను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. కోపం లేదా గొడవల వల్ల నష్టాలు రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ఖరీదైన రోజు. పెరుగుతున్న ఖర్చుల జాబితా మీ బడ్జెట్‌ను అసమతుల్యత చేస్తుంది. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో పనిలో ఎక్కువ అనుభూతి చెందరు మరియు మీరు తప్పులు కూడా చేయవచ్చు. మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి, లేకుంటే మీ పురోగతి ఆగిపోవచ్చు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు మంచి రోజు కాదు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3:20 గంటల వరకు

June Horoscope 2022: జూన్ నెలలో మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి...!June Horoscope 2022: జూన్ నెలలో మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఇప్పటివరకు ఒంటరిగా ఉండి, మీ వివాహానికి కొన్ని అడ్డంకులు ఉంటే, ఈరోజు మీ సమస్య పరిష్కారమవుతుంది. త్వరలో మీరు ముడి వేయవచ్చు. మరోవైపు, మీరు ఇప్పటికే వివాహం చేసుకున్నట్లయితే, మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీరు వారి భావోద్వేగ మద్దతును కూడా పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు పాత చిన్న రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. ఉద్యోగులకు ఆఫీసు వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీరు మీ పనులన్నీ శ్రద్ధగా చేస్తారు. ఉన్నతాధికారులు మీ కృషిని మెచ్చుకుంటారు. వ్యాపారులకు ఈరోజు లాభదాయకమైన రోజు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :21

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే, ఈరోజు మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది. మీ కృషి మరియు అవగాహనతో, మీరు గొప్ప విజయాన్ని సాధించగలరు. విదేశీ సంస్థల్లో పనిచేసే వారికి పురోభివృద్ధికి అవకాశం ఉంది. మీరు ఉన్నత పదవిని పొందొచ్చు. అలాగే మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యుల ఆప్యాయత మరియు మద్దతు పొందుతారు. అన్నయ్యతో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. అతను ఈరోజు మీకు మార్గనిర్దేశం చేయగలడు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. సౌకర్యాల కోసం అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం వల్ల మీ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కోర్టులోని కొన్ని పాత కేసులలో విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు మీ పెద్ద ఆందోళన తొలగిపోతుంది. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందగలరు. మీరు కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే, మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు సవాలుగా ఉండే అవకాశం ఉంది. ఆఫీసులో జరుగుతున్న రాజకీయాలకు మీరు బాధితులు కావొచ్చు. మీ మనస్సులో చాలా ప్రతికూల ఆలోచనలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఇంటి పెద్దలతో మర్యాదగా మెలగాలి. మీ ఆత్మీయుల మనోభావాలను దెబ్బతీసే పనులు చేయకండి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం విషయానికొస్తే, వాతావరణంలో మార్పుల కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది మీ కష్టాలను పెంచుతుంది. మరోవైపు ఉద్యోగస్తులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుందది. ఈరోజు మీ కష్టమైన పనులు ఏవైనా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ ఉత్తమమైనదాన్ని అందించగలుగుతారు. వ్యాపారస్తుల ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది. అయితే, భవిష్యత్తులో మీరు ఆర్థిక విషయాలలో ఎలాంటి తొందరపాటు లావాదేవీలు చేయొద్దు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలను చర్చించొచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీకు నరాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:55 నుండి 6:50 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో చిన్న ట్రిప్‌కి వెళ్లే అవకాశాన్ని కూడా పొందొచ్చు. ఇది కాకుండా, మీరు మీ ప్రియమైనవారికి అందమైన బహుమతిని కూడా కొనుగోలు చేయవచ్చు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారిపై బాధ్యతల భారం ఎక్కువ కానుంది. మీరు తప్పులు చేయకుండా ఉండాలి. లేకుంటే పెద్ద నష్టం జరగవచ్చు. ఇదే సమయంలో ప్రయివేటు ఉద్యోగాలు చేస్తున్న వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా కనిపిస్తోంది. మీరు కార్యాలయంలో ప్రమోషన్ లెటర్ పొందొచ్చు. వ్యాపారులు న్యాయపరమైన విషయాల్లో ఎలాంటి అలసత్వం వహించొద్దు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, అటువంటి సందర్భాలలో మీరు తొందరపడొద్దు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 7:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే, మీరు మీ సన్నాహకాలపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం చేసే వ్యక్తులకు ఆఫీసులో బాస్ మద్దతు లభిస్తుంది. మీరు సానుకూలతను అనుభవిస్తారు. ఈరోజు మీరు మీ అన్ని పనులను వేగంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు మంచి ఆర్థిక లాభాలు పొందగలరు. మీ వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. మీరు భాగస్వామ్యంతో పని చేస్తే, మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత మెరుగ్గా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఈరోజు ప్రియమైన వారితో, ముఖ్యంగా తోబుట్టువులతో చాలా సరదాగా ఉంటుంది, ఈరోజు మీరు చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యం విషయానికొస్తే, మీరు సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -04 June 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Friday, June 3, 2022, 16:32 [IST]
Desktop Bottom Promotion