Today Rasi Phalalu :ఓ రాశి వారు లక్ష్యాన్ని చేరుకునేందుకు చాలా కష్టపడాలి...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, ఫాల్గుణ మాసంలో శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -04 March 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో రూల్స్ ను కచ్చితంగా ఫాలో అవ్వాలి. లేకపోతే మీరు ఈరోజు ఇబ్బందుల్లో పడొచ్చు. ఇది కాకుండా, మీ పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు బాస్ మీ పనిని అకస్మాత్తుగా సమీక్షించొచ్చు. వ్యాపారులు ఈరోజు ఖాతాదారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్నపాటి అజాగ్రత్త వల్ల చేతిలోని లాభం తేలికగా జారిపోతుంది. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. ఈరోజు మీరు పాత బిల్లు చెల్లించడానికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:50 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈరోజు మీరు ఇంట్లోని చిన్న సభ్యులకు మార్గనిర్దేశం చేసే అవకాశాన్ని పొందుతారు. అంతే కాకుండా పెద్దల ఆశీస్సులు కూడా పొందుతారు. మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో అనుసంధానించబడి ఉంటే, ఈరోజు మీకు చాలా ముఖ్యమైనది. మీ తెలివితేటలతో, మీరు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీ విజయాల పట్ల మీ ప్రియమైనవారు చాలా గర్వపడతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే మీరు మీ కృషిని కొనసాగించండి. త్వరలో మీరు మంచి ఫలితాలను పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు అనవసరంగా బాధపడొచ్చు. అయితే మీరు సానుకూలంగా ఉండండి. మీ జీవితంలో ప్రతిదీ బాగుంటుంది. ఉద్యోగులకు అకస్మాత్తుగా కార్యాలయంలో సమావేశానికి కాల్ రావొచ్చు. మీరు బాస్ నుండి కొన్ని మంచి సలహాలను పొందొచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజుల్లో తప్పుడు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో మీరు మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు మీ ప్రియమైనవారి కోసం సమయం కేటాయించవలసి ఉంటుంది. లేదంటే మీ తప్పుడు వైఖరి మీ ప్రియమైన వారి మనోభావాలను దెబ్బతీస్తుంది. వీలైతే ఈరోజే పిల్లలతో కలిసి ట్రిప్ ప్లాన్ చేయండి. ఉద్యోగస్తులకు ఈరోజు సవాలుగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు మీ ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలో నిలిచిపోవచ్చు. ఇది కాకుండా, మీరు బాస్ యొక్క కోపాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు వ్యాపారులకు ఈరోజు సువర్ణావకాశాలు రావొచ్చు. ఈరోజు మీరు ఎక్కువ ఖర్చులు చేయకూడదు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీ ఆదాయం పెరగొచ్చు. ఇది కాకుండా, ఈరోజు మీరు డబ్బుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. బహుశా ఈరోజు మీరు ఆర్థికంగా అవసరమైన వారికి కూడా సహాయం చేయొచ్చు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు సుదీర్ఘ ప్రయాణం చేయబోతున్నట్లయితే, మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి. ఈరోజు మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. అనవసరమైన ఒత్తిడికి లోనయ్యే అలవాటు వల్ల ఈరోజు మీ ఆరోగ్యం క్షీణించవచ్చు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో అవివాహితులకు ఈరోజు వివాహ బంధం ఏర్పడొచ్చు. త్వరలో మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందొచ్చు. మరోవైపు, మీరు ఇప్పటికే వివాహం చేసుకున్నట్లయితే, మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఉత్సాహం అలాగే ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. పని విషయంలో ఈరోజు మీకు చాలా ముఖ్యమైనది. ప్రత్యేకించి ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఈ సమయం దానికి అనుకూలంగా ఉంటుంది. మీరు విజయం పొందొచ్చు. డబ్బుకు సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో వ్యాపారులు ఇతరులను విశ్వసించకుండా ఉండాలి. లేకుంటే మీరు ఈరోజు పెద్ద నష్టాన్ని చవిచూడొచ్చు. మరోవైపు, ఉద్యోగస్తులు కార్యాలయంలోని సహోద్యోగులతో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం మానుకోండి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండాలి. మీరు ఎంత ఎక్కువ పొదుపు చేస్తే అంత త్వరగా అప్పుల నుండి బయటపడొచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో శృంగార పరంగా మంచిగా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి చాలా మంచి మానసిక స్థితిలో ఉంటారు. ఈరోజు మీ ఆరోగ్యం కొంచెం క్షీణించొచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 7:50 నుండి రాత్రి 8:15 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులపై ఎక్కువగా ఆధారపడటం మానుకోండి. ఇది కాకుండా, మీరు మీ రహస్య సమాచారాన్ని పంచుకోకుండా ఉండాలి. విదేశీ కంపెనీలో పనిచేసే వారికి ఈ సమయం మంచిది కాదు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీ వ్యాపారంలో సానుకూల మార్పు సంకేతాలు ఉన్నాయి. అయితే, మీరు మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు పెద్ద మొత్తంలో రుణం తీసుకోకుండా ఉండాలి. ఈరోజు మీ ఇంటి వాతావరణం బాగా ఉండదు. తండ్రితో సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. మీకు కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు ఉన్నట్లయితే, ఎలాంటి అజాగ్రత్త చేయొద్దు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో మందుల వ్యాపారం చేసే వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. అలాగే మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. చెక్క మరియు ఇనుము వ్యాపారులు కూడా ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. ఈరోజు మీ ఆఫీసు వాతావరణం బాగా ఉండదు. మీ ఆలస్యం ఈరోజు బాస్ యొక్క మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఇది కాకుండా, మీరు కూడా అదే తప్పును మళ్లీ మళ్లీ పునరావృతం చేయకుండా ఉండండి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ ఇంటి సభ్యులతో మీ అనుబంధం బలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఆరోగ్యం విషయానికొస్తే.. మలబద్ధకం, అసిడిటీ మొదలైన సమస్యలు ఉండొచ్చు. బయటి ఆహారానికి దూరంగా ఉండండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసు వాతావరణం చాలా బాగుంటుంది. మీరు బాస్ నుండి మార్గదర్శకత్వం పొందొచ్చు. మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలరు. పెండింగ్‌లో ఉన్న పనుల భారం కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది. విదేశీ సంస్థల్లో పనిచేసే వారికి పురోభివృద్ధికి అవకాశం ఉంది. మీ ఆదాయం పెరగొచ్చు. చిరు వ్యాపారులకు ఈరోజు చాలా లాభదాయకమైన రోజు. మీరు ఆశించిన ఫలితాన్ని పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అననుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లో గొడవల కారణంగా మీరు ఈరోజు చాలా ఒత్తిడికి లోనవుతారు. మీ వ్యక్తిగత విషయాలలో బయటి వ్యక్తులు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో సేల్స్ మరియు మార్కెటింగ్‌కు సంబంధించి పని చేసే వ్యక్తులకు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు చాలా కష్టపడాల్సి రావొచ్చు. అయితే మీరు ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో మీ కష్టానికి తగిన ఫలం తప్పకుండా లభిస్తుంది. బట్టలు, ఫర్నీచర్, నూనె గింజలు మొదలైన వాటికి సంబంధించిన పనులు చేసే వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ముఖ్యమైన పనిలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామితో చిన్న ట్రిప్ వెళ్ళే అవకాశాన్ని పొందొచ్చు. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:55 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన విషయాలలో సమయాన్ని వృథా చేయకుండా, మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం మంచిది. మీరు ఈరోజు ఆఫీసులో బాస్‌తో కొంత చర్చలు జరపొచ్చు. వారు మీ పనితీరుతో చాలా సంతృప్తి చెందకపోతే, మీరు కష్టపడి పనిచేయాలి. వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు పెద్ద లాభాలను ఆశించినట్లయితే, మీరు నిరాశ చెందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు మీకు తలనొప్పి, అలసట మొదలైన సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 4:25 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Friday, March 4, 2022, 5:00 [IST]
Desktop Bottom Promotion