Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
Today Rasi Phalalu : ఓ రాశి వారు అకస్మాత్తుగా శుభవార్తలు వింటారు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, కార్తీక మాసంలో శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైన రోజు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు ఆర్థికంగా మంచి లాభాలు పొందగలరు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా సరదాగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీ సంబంధం మెరుగుపడుతుంది. అయితే, భవిష్యత్తులో మీరు చిన్న విషయాలపై ఘర్షణకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు మంచి అనుభూతి చెందుతారు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నించండి. అహంకారం, ఘర్షణలకు దూరంగా ఉండండి. లేకుంటే అనవసర విషయాలపై వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఇంటి సభ్యులతో మీ ప్రవర్తనను మర్యాదగా ఉంచడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఇంట్లోని చిన్న సభ్యులతో చాలా కఠినంగా ఉండకండి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో సామరస్యం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, మీకు తలనొప్పి మరియు అలసట వంటి సమస్యలు ఉండొచ్చు. ఆరోగ్యంగా ఈరోజు విశ్రాంతిపై దృష్టి పెట్టండి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు. లేకుంటే ఈరోజు పనికిరాని విషయాలలో మీ రోజు వృథా అవుతుంది. మీరు ఉద్యోగం చేస్తే, ఆఫీసులో మీ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలి. మీ ఆలస్యం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టొచ్చు. ఈరోజు మీ పట్ల బాస్ ప్రవర్తన బాగా ఉండదు. వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీ ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదల సంకేతాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో సమన్వయం దెబ్బతింటుంది. మీకు పనితో పాటు మీ కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం తగ్గుతుంది. మీ కోసం మీకు తగినంత సమయం లభిస్తుంది. ఈరోజు మీరు బాస్ నుండి కొన్ని ముఖ్యమైన సూచనలను పొందొచ్చు. ఇది రాబోయే రోజుల్లో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు చాలా మంచి రోజు. ప్రత్యేకించి మీరు ఇంటికి దూరంగా నివసిస్తుంటే, చాలా కాలం తర్వాత మీ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం మీకు లభిస్తుంది. ధాన్యాల వ్యాపారం చేసే వారికి ఈసారి కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయితే, త్వరలో మీ సమస్య పరిష్కారం కావొచ్చు. ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు వివాహం చేసుకుంటే మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చిన్న సమస్య ఉన్నా, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారికి ఫైనాన్స్‌కు సంబంధించిన వ్యక్తులు ఈరోజు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు అన్ని మూలల నుండి పరిశీలించిన తర్వాత మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిది. మీరు రవాణా సంబంధిత పనులు చేసే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో చాలా యాక్టివ్‌గా ఉండాలి. ఈరోజు, సోమరితనాన్ని విడిచిపెట్టి, మీ పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే మీ ముఖ్యమైన పనులు ఈరోజు అసంపూర్ణంగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల సాధ్యమవుతుంది. అయితే, మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కొనసాగించాలి. తద్వారా మీరు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలను ఎదుర్కోకూడదు. మీ ఇంటి పెద్దలతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు మీ ఆహారపు అలవాట్లలో కొన్ని అవసరమైన మార్పులు చేసుకోవాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 24
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:05 నుండి 4 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు చిక్కుకుపోయిన ప్రణాళికలను మళ్లీ ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ వ్యాపార నిర్ణయాలను తెలివిగా తీసుకుంటే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరోవైపు, కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు సహోద్యోగులతో వివాదాలు నివారించాలి. మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. మీ పనిపై దృష్టి పెట్టండి. అలాంటివి మీ పనిని కూడా ప్రభావితం చేస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఈరోజు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు. ఆలోచించకుండా ఖర్చు పెట్టే అలవాటు వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందుల్లో పడొచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో వివాదాలు ఉండొచ్చు. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 3:05 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో కొందరు ఈరోజు చిన్న చిన్న విషయాలను మనసులో పెట్టుకునే అలవాటు వల్ల విచారంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు మీ భావోద్వేగాలను నియంత్రించండి. మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయితే, మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి, మీరు పొదుపుపై దృష్టి పెట్టాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మైగ్రేన్ రోగులు ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంది. మీరు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే అవకాశాన్ని పొందొచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. మరోవైపు, పిల్లల నుండి కూడా ఆనందం వస్తుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు పొందొచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సజావుగా పని చేయగల మీ కళ మిమ్మల్ని సహోద్యోగుల కంటే ముందు ఉంచుతుంది. మరోవైపు భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు మంచి లాభాలను పొందొచ్చు, ముఖ్యంగా హోటళ్లు మరియు రెస్టారెంట్లకు సంబంధించిన వ్యక్తులకు, ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 44
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన కోపం మీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. మరోవైపు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. కాస్త అజాగ్రత్తగా వ్యవహరించినా భారీ నష్టం వాటిల్లుతుంది. ఈరోజు ఇంటి వాతావరణం బాగా ఉండదు. ఈరోజు మీరు ప్రశాంతమైన మనస్సుతో పని చేయాలి. ప్రతికూల పరిస్థితులలో, మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్యలు ఉంటే, వెంటనే మంచి వైద్యుడిని సంప్రదించాలి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో వ్యాపారస్తులు ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. అలాగే మీ వ్యాపారం కూడా వేగంగా పురోగమిస్తుంది. మీరు కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, మీ మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మరోవైపు, ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలితాలను కూడా పొందొచ్చు. మీ ప్రమోషన్ చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే, ఆఫీసులో కొన్ని శుభవార్తలను పొందే బలమైన అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఇది కాకుండా, పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీరు తల్లిదండ్రుల ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మీరు వివాహం చేసుకుంటే, మీ వైవాహిక జీవితంలో ప్రేమ అలాగే ఉంటుంది. ఈరోజు ఆరోగ్య విషయాలు చక్కగా ఉంటాయి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం క్షీణించడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఈరోజు మీ పని కూడా ప్రభావితం కావొచ్చు. మీరు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తీవ్రమవుతాయి. మీరు అతని ఆవేశపూరిత స్వభావం మీ ప్రియమైన వారిని బాధపెట్టొచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు తొందరపడి ఆర్థిక లావాదేవీలు చేయకుంటే మంచిది. ఈరోజు మీరు అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలను వినోచ్చు. ఇది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు ఆస్తి సంబంధిత పనుల్లో మంచి లాభాలను పొందుతారు. మీ పెండింగ్ పనులు కూడా ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఉద్యోగస్తులు ఈరోజు కొన్ని పెద్ద సవాలును ఎదుర్కోవలసి రావచ్చు. మీ అజాగ్రత్తపై ఆఫీసులోని ఉన్నతాధికారులు చాలా కోపంగా ఉంటారు. వారు మీకు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన బాధ్యతలను కూడా వెనక్కి తీసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ విశ్వాసం బలహీనపడొచ్చు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ తోబుట్టువులతో సంబంధం మంచిగా ఉంటుంది. మీకు వారి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











