Just In
- 20 min ago ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- 1 hr ago చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- 4 hrs ago గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- 4 hrs ago పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
Today Rasi Phalalu :ఓ రాశి వారు ప్రియమైన వారితో ఉత్సాహంగా గడుపుతారు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, పుష్య మాసంలో శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.
ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
Makar Sankranti 2022 Horoscope:మకరంలోకి సూర్యుడి రవాణా.. 12 రాశులపై పడే ప్రభావం...!
మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈరోజు మీరు మీ మొత్తం కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఇంట్లోని కొందరు సభ్యులు మీ పట్ల అసంతృప్తిగా ఉండొచ్చు. ఈ సందర్భంలో, మీరు సహనంతో పని చేయాలి. ఆర్థిక పరమైన విషయంలో అజాగ్రత్తగా ఉండకండి, లేకుంటే మీరు తప్పుడు ఫలితాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. ఉద్యోగులకు, సహోద్యోగులతో ఇబ్బందులు పడకుండా ఉండాలి. ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మరోవైపు, వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు చాలా కష్టపడాల్సి రావొచ్చు. ఈరోజు ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయకుండా ఉండాలి. మీ ఆరోగ్యం ఈరోజు క్షీణించొచ్చు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు
వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా కష్టంగా ఉంటుంది. ధన నష్టానికి బలమైన అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. మీరు ఉద్యోగం చేస్తే మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలాగే, అదే తప్పును పదే పదే పునరావృతం చేయకుండా ఉండండి. మరోవైపు, వ్యాపార వర్గానికి ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుంది. ఏదైనా న్యాయపరమైన అంశం మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటే, ఈరోజు మీ సమస్య పరిష్కారమవుతుంది. త్వరలో మీరు నిలిచిపోయిన ఏదైనా పని మళ్లీ ప్రారంభించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీరు వారి మానసిక మద్దతును కూడా పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు
మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో ప్రతికూలతలను ఎదుర్కోవలసి రావొచ్చు. సహోద్యోగులతో సత్సంబంధాలు క్షీణించొచ్చు. వారు మిమ్మల్ని వ్యతిరేకించొచ్చు. మీరు తెలివిగా వ్యవహరించడం మంచిది. ఈరోజు కుటుంబ జీవితంలో విభేదాలు ఉండొచ్చు. చిన్న విషయాలను విస్మరించడం ద్వారా, మీరు మీ ఇంటి శాంతిని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మీ ప్రవర్తనను సరిగ్గా ఉంచుకోండి. మీ కోపం స్వభావం మీ ప్రియమైన వారి నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు
2022 Yearly Rasi Phalalu : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు అద్భుత విజయాలు సాధిస్తారట...!
కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ పని ఒత్తిడి తగ్గుతుంది. మీరు సీనియర్ అధికారులతో కూడా మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారు. మరోవైపు, మీరు కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తుంటే, తొందరపడకండి. విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు అజాగ్రత్తగా ఉంటే మీ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఒత్తిడికి అవకాశం ఉంది. మీరు ఈరోజు ఇంటి సభ్యునితో వాగ్వాదానికి దిగొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే, సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. మీరు తాజా పండ్లు మరియు ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు
సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీ అవగాహన మరియు సామర్థ్యంతో మీ బాస్ చాలా సంతోషిస్తారు. ఈరోజు వ్యాపారులకు ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈరోజు మీరు ఆశించిన ఫలితాన్ని పొందలేరు. విదేశీ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే రాబోయే కాలంలో మీరు పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, ఆదాయం మరియు వ్యయాల మధ్య సమతుల్యతను కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యుల నుండి మానసిక మద్దతు పొందుతారు. మీరు ఇంటికి దూరంగా నివసిస్తుంటే, త్వరలో మీ ప్రియమైనవారితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు
కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు పాత రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. ఇది మీ పెద్ద చింతలను తొలగిస్తుంది. నిలిచిపోయిన పనిని మళ్లీ ప్రారంభించే రోజు మంచిది. ఉద్యోగార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. మీ ప్రతిభ అందరి ముందు ప్రకాశిస్తుంది. మరోవైపు, స్టాక్ మార్కెట్‌తో అనుబంధించబడిన వ్యక్తులు మంచి లాభాలను పొందొచ్చు. విద్యార్థులకు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మరికొంత ప్రయత్నం చేస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 11 గంటల వరకు
2022లో పురుషులు ఎలా ఉండబోతున్నారో తెలుసా? ఈ 4 రాశుల వారికి రాజయోగం రాబోతుంది....!
తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు సానుకూల భావాన్ని అనుభవిస్తారు. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీరు చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ మనస్సు మతపరమైన పనులలో ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా అవసరమైన వారికి సహాయం చేయొచ్చు. మీరు ఒక ఉద్యోగం చేసి, మీ కష్టానికి తగిన ఫలాలు మీకు లభించకపోతే, మీరు ధైర్యంగా పని చేయాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉండదు. వ్యాపారులు ఏ పనిని తొందరపాటుగా చేపట్టకుండా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు మీకు డబ్బు విషయంలో ఎవరితోనైనా వాగ్వాదం ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీరు మంచి అనుభూతి చెందుతారు
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : ఉదయం 4:10 నుండి మధ్యాహ్నం 3:50 గంటల వరకు
వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు మీరు మంచి లాభాలను పొందొచ్చు. మీరు డబ్బుకు సంబంధించిన ఆందోళన నుండి ఉపశమనం పొందుతారు. మీరు ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే, త్వరలో మీరు విజయం పొందొచ్చు. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల మద్దతును పొందుతారు. మీ ముఖ్యమైన పనిలో కొన్నింటిని ఈరోజు సకాలంలో పూర్తి చేస్తారు. మీరు సరదాగా గడపడానికి కొంత అవకాశం పొందుతారు. ఈరోజు మీరు కుటుంబం మరియు స్నేహితులతో చాలా సరదాగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామిని గౌరవించండి. మీ ప్రియమైన వ్యక్తి స్వభావంలో కొంత మార్పు ఉంటే, సంభాషణ ద్వారా వారి సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు క్రమం తప్పకుండా యోగా మరియు ధ్యానం చేయాలి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:55 నుండి సాయంత్రం 7 గంటల వరకు
ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. ఈరోజు మీ పెద్ద సమస్య కొంత పరిష్కారమవుతుంది. ఉద్యోగస్తులు తమ తెలివితేటలతో, కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఇది కాకుండా, మీరు మీ పని కోసం ఇతరులపై ఆధారపడకూడదు. వ్యాపారులకు ఈరోజు పెద్ద ఆర్థిక లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు వారితో మీ మనస్సును పంచుకోవచ్చు. ఈరోజు తండ్రి వైపు నుండి ధనలాభం లభిస్తుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీ జీవిత భాగస్వామి ప్రవర్తన కొంత రహస్యంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిది. మీరు చాలా రిఫ్రెష్‌గా ఉంటారు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు
మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే, నిరాశకు గురవుతారు. కానీ మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. త్వరలో మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాలు చేసే వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. పని మధ్యలో ఎక్కువ మాట్లాడకండి మరియు సమయాన్ని పూర్తిగా చూసుకోండి. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు స్వల్ప లాభాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారి కోసం కూడా కొంత సమయం కేటాయించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు
కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఈరోజున మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు అందడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. డబ్బు కారణంగా నిలిచిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి. మీ పెద్ద చింతలు తొలగిపోతాయి. మీ కుటుంబ జీవితంలో ఆకస్మిక సమస్యలు ఉండొచ్చు. ఇంట్లోని సభ్యుని ఆరోగ్యం క్షీణించడం వల్ల మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. మీ జీవిత భాగస్వామితో మీకు కొంత వివాదం ఉండొచ్చు. మీరు మీ వైపు ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా ఆందోళన చెందుతారు. చల్లటి వస్తువుల వినియోగాన్ని నివారించండి. అలాగే ఈరోజు ఇంట్లో విశ్రాంతి తీసుకోండి. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని విస్మరించడం వల్ల మీపై ప్రభావం పడుతుంది. మీ ఆర్థిక స్థితి బలపడాలంటే ముందుగా దుబారాను అరికట్టాలి. అంతే కాకుండా హడావుడిగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయొద్దు. శ్రామిక ప్రజలకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. అదే సమయంలో, వ్యాపారులు కూడా మిశ్రమ లాభాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు ఏదైనా సమస్యతో సతమతమవుతున్నట్లయితే, ఈరోజు కుటుంబ సభ్యుల సహకారంతో మీ సమస్య అధిగమించబడుతుంది. మీ జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారు మిమ్మల్ని ఉత్సాహపరుస్తారు. మీరు వారి మానసిక మద్దతును పొందుతారు.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.