For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu : ఓ రాశి వారికి ఈరోజు లైఫ్ లో అనుకోని మలుపు ఉండొచ్చు...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, శ్రావణ మాసంలో బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -08 September 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Mars Transit in Virgo 6 Septemeber 2021: కన్యరాశిలోకి కుజుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం...!Mars Transit in Virgo 6 Septemeber 2021: కన్యరాశిలోకి కుజుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన సమస్యలు ఎదురుకావొచ్చు. డబ్బు లేకపోవడం వల్ల ఆగిపోయిన మీ ముఖ్యమైన పనులు కొన్ని ఈరోజు కూడా పూర్తవుతాయి. అయితే పని విషయంలో ఈరోజు చాలా చురుకుగా ఉంటారు. మీ పనులన్నీ వేగంగా పూర్తి చేయగలరు. మీకు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు సాధ్యమే. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. మీ ప్రియమైన వారితో అసభ్యంగా ప్రవర్తించడం మానుకోండి. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైన రోజు కానుంది. ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, కొత్త ఉద్యోగం కోసం అన్వేషించేందుకు ఈరోజు అనుకూలమైన రోజు. మరోవైపు, మీరు ఉద్యోగంలో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఈరోజు మీరు మీ సన్నిహితుల సహాయం పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా కనిపిస్తాయి. మీ ఇంటి సభ్యులతో సంబంధంలో మంచి సామరస్యం ఉంటుంది. ముఖ్యంగా మీకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో పనికి సంబంధించి ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. మీరు ముందుకు సాగడానికి మంచి అవకాశాన్ని పొందొచ్చు. రిటైల్ వ్యాపారులు ఈరోజు విపరీతమైన ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ ఇంటి సభ్యులతో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మీ ఆందోళనలు తొలగిపోతాయి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి ఆరోగ్యంలో మెరుగుదల చూడొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు అధికమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఆరోగ్య విషయాలు ఈరోజు బాగానే ఉంటాయి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 గంటల వరకు

<strong>Sun and Mars Transit in Virgo:కుజుడు, సూర్యుడు ఒకే రాశిలో కలిస్తే.. ఈ రాశులకు శుభ ఫలితాలు...!</strong>Sun and Mars Transit in Virgo:కుజుడు, సూర్యుడు ఒకే రాశిలో కలిస్తే.. ఈ రాశులకు శుభ ఫలితాలు...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు జీవితంలో ఒక అందమైన మలుపు రావొచ్చు. మీరు ప్రత్యేకంగా ఒకరిని కలవొచ్చు. మీరు తొలి చూపులోనే ప్రేమలో పడే అవకాశం ఉంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మెరుగైన సామరస్యం ఉంటుంది. మీ ప్రియమైన వారి అవగాహనతో, మీరు ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందొచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీసులో మీ పని పట్ల బాస్ చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు ఒక పెద్ద ప్రాజెక్టులో పని చేసే అవకాశాన్ని కూడా పొందొచ్చు. వ్యాపార వ్యక్తులు ఈరోజు మిశ్రమ లాభాలను పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 10:35 నుండి రాత్రి 7 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారికి ఈరోజు బిజీగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు బద్ధకం మరియు సోమరితనం వదులుకోవాలి. మీ ముఖ్యమైన పనులపై శ్రద్ధ వహించాలి. ప్రత్యేకించి మీరు ఉద్యోగం చేస్తే, పని పట్ల నిర్లక్ష్యం వద్దు. వ్యాపారవేత్తలు తమ నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. ఈరోజు మీరు లాభం పొందడానికి అవకాశం పొందొచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంటి సభ్యులతో మీ సంబంధం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో విబేధాలు ఉండొచ్చు. కానీ త్వరలో మీ మధ్య అంతా సాధారణమవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీరు మీ స్థిర బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు చాలా సందర్భాల్లో కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఉద్యోగులు కార్యాలయంలో ఈరోజు పెండింగులో ఉన్న పనిని పూర్తి చేయొచ్చు. ఇది కాకుండా ఈరోజు మంచి సంబంధాన్ని కొనసాగించాలి. చిన్న వ్యాపారవేత్తలు మంచి ఆర్థిక లాభాలను పొందగలరు. మీ కుటుంబ జీవితంలో అసమ్మతి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీ ఇంట్లో వివాదం తలెత్తే అవకాశం ఉంది. మీ తండ్రి ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుండదు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4:15 నుండి సాయంత్రం 5 గంటల వరకు

zodiac signs:ఏ రాశుల వారికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారంటే...!zodiac signs:ఏ రాశుల వారికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీరు అనవసరమైన ఆందోళనలను వదిలేస్తే మంచిది. లేకుంటే అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. తగిన సమయం వచ్చినప్పుడు మీ సమస్య కచ్చితంగా పరిష్కరించబడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. అయితే ఇది పెద్ద సమస్య కాదు. ఉద్యోగులకు ఈరోజు సీనియర్ అధికారులతో సమన్వయం కొంచెం క్షీణించొచ్చు. వ్యాపారులు ఈరోజు లాభం పొందడానికి కష్టపడాల్సి రావొచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా కోర్టు కేసులో చిక్కుకుంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు పని విషయంలో చాలా మంచిగా ఉంటుంది. అలాగే మీరు మీ పనితో సంతృప్తి చెందుతారు. వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరమైన సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. మీ కుటుంబ జీవితంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 4:40 నుండి రాత్రి 10:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరగొచ్చు. కాబట్టి మీరు చాలా చురుకుగా ఉండాలి. మీరు కష్టపడి మరియు అంకితభావంతో మీ పనిని చేస్తే, త్వరలో మీరు పెద్ద పురోగతిని సాధించగలరు. ఈరోజు వ్యాపారులకు మంచిగా ఉంటుంది. మీ వ్యాపారంలో వృద్ధి సాధ్యమవుతుంది. ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు మాటలపై నియంత్రణ కలిగి ఉండాలి. ప్రత్యేకించి ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. వ్యాపారులకు ఈరోజు గందరగోళంగా ఉంటుంది. కానీ మీరు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీ ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ పెద్దలను గౌరవించడం మరియు వారి మాటలను పట్టించుకోకుండా ఉండటం మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. చాలా కాలంగా కొనసాగుతున్న మీ కృషి మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు పదోన్నతి పొందవచ్చు. ఇది కాకుండా, మీ ఆదాయం పెరగడానికి బలమైన అవకాశం ఉంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. మీకు వ్యాపారంలో ఏదైనా మార్పు కావాలంటే దానికి సమయం సరి కాదు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఇంటి సభ్యుల మధ్య ప్రేమ మరియు ఐక్యత ఉంటుంది. మీకు మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ప్రత్యేక రోజు కానుంది. మీ ప్రియమైన వారు చాలా మంచి మానసిక స్థితిలో ఉంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారులు వ్యాపార ప్రమోషన్ పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే, మీ మార్గంలో కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, త్వరలోనే మీ ఈ సమస్య తొలగిపోతుంది. ఉద్యోగం చేసే వ్యక్తులు ఈరోజు పెద్ద ఉపశమనం పొందవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయవచ్చు. మీ పనితీరుపై ఉన్నతాధికారులు సంతృప్తి చెందుతారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఇంటి సభ్యులతో చాలా సంతోషంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత, ఈరోజు మీరు ఇష్టమైన వంటకాలను కూడా ఆస్వాదించడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 3 నుండి రాత్రి 7 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -08 September 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Tuesday, September 7, 2021, 22:02 [IST]
Desktop Bottom Promotion