For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు సన్నిహితుల సలహాలు తీసుకోవాలి...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -09 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Mercury Retrograde in Taurus : బుధుడి తిరోగమనంతో ఈ రాశులకు ఇబ్బందులు.. మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు..Mercury Retrograde in Taurus : బుధుడి తిరోగమనంతో ఈ రాశులకు ఇబ్బందులు.. మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో చిరు వ్యాపారులకు మంచిగా ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం బలంగా ఉంది. వ్యాపారులకు ఈరోజు పురోగతి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నించండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. మీరు కొందరు సభ్యులతో వాగ్వాదం పెంచుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మరింత శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఏదైనా సమస్య ఉంటే పెద్ద ఉపశమనం పొందుతారు. మీరు ఈరోజు పనిపై పూర్తి శ్రద్ధ పెడతారు. వ్యాపారులకు త్వరలో మంచి రోజులు రానున్నాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఎవరికైనా రుణం ఇవ్వబోతున్నట్లయితే మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీరు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :18

లక్కీ టైమ్ : సాయంత్రం 5:30 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. ఇది కాకుండా, మీ పనితీరుతో కూడా చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మీరు ఇటీవల ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే, మీరు కష్టపడి పని చేయాలి. అప్పుడు మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు కుటుంబ సభ్యుల మద్దతును పొందుతారు. ముఖ్యంగా తోబుట్టువులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 9 గంటల వరకు

Vastu Tips for Wallet:మీ పర్సులో ఇవి ఉంటే వెంటనే పడేయండి... ఎందుకంటే డబ్బు సమస్యలు పెరుగుతాయట.. Vastu Tips for Wallet:మీ పర్సులో ఇవి ఉంటే వెంటనే పడేయండి... ఎందుకంటే డబ్బు సమస్యలు పెరుగుతాయట..

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో పూర్వీకులు వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఈరోజు మంచి సంకేతాలను పొందుతారు. ఈరోజు మీరు భారీ ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీ విజయాల పట్ల మీ ప్రియమైన వారు చాలా గర్వపడతారు. ఉద్యోగులు ఈరోజు ఉన్నతాధికారుల నుండి మంచి ప్రయోజనం పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఇతరులను ఆకట్టుకునేందుకు ఎక్కువ ఖర్చు చేయకండి. ఈరోజు మీరు ఇంట్లో చిన్న పార్టీని నిర్వహించొచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :25

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ఉద్యోగులకు వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఉన్నతాధికారులు మీతో చాలా కఠినంగా వ్యవవహరిస్తారు. ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వ్యాపారులు భాగస్వాములతో కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. మారు ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. మీ ఇంటి వాతావరణంలో మెరుగుదల ఉంటుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో అదనపు సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ వైపు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తే మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :24

లక్కీ టైమ్ : సాయంత్రం 5:05 నుండి సాయంత్రం 6:45 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఇదంతా మీ అజాగ్రత్త ఫలితమే. అందుకే రాత్రి సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. మీరు గతంలో పడ్డ కష్టానికి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితిలో మెరుగ్గా ఉండొచ్చు. మీకు ఇంటి సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అందమైన మలుపురావొచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :41

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:45 గంటల వరకు

Rashi Parivartan 2022: మే మాసంలో 4 గ్రహాల రవాణాతో ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు...! Rashi Parivartan 2022: మే మాసంలో 4 గ్రహాల రవాణాతో ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు పనితో పాటు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. త్వరలో మీ సమస్య పరిష్కరించబడుతుంది. ఈరోజు మీరు ఎలాంటి ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలను తీసుకోవద్దు. మీరు ఈరోజు స్నేహితులతో మంచి సమయం గడపొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :26

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక రంగంపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఏదైనా మతపరమైన ప్రదేశానికి వెళ్లొచ్చు. అలాగే ఈరోజు మీరు పేదలకు సహాయం చేయొచ్చు. మీ ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. గొడవలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఉద్యోగులు ఈరోజు పెండింగ్ పనులతో చాలా అలసిపోతారు. మీ పనిని త్వరగా పూర్తి చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :21

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే, మీ సన్నిహితుల సహాయం కచ్చితంగా తీసుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలో పనిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అనవసరమైన విషయాలలో మీ సమయాన్ని వ్రుథా చేయకండి. మరోవైపు వ్యాపారులు ఈరోజు కొత్త పనులను ప్రారంభించకూడదు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాన్ని పొందలేరు. అంతేకాదు ఈరోజు మీరు కొంత ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు సహోద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు రావొచ్చు. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి రాత్రి 9:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు ఇంటి సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత లభిస్తాయి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఖర్చులలో కొన్ని తగ్గించుకోవచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు కూడా వేగవంతం కానున్నాయి. మీరు పనిలో మంచి ఫలితాలను పొందొచ్చు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో భిన్నమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఉన్నతాధికారులు మరియు సహోద్యోగులతో మీ అనుబంధం మెరుగుపడొచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వస్త్ర వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. ఈరోజు బంగారం మరియు వెండికి సంబంధించిన వ్యాపారులు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు బాధ్యతల భారం ఎక్కువగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు పెద్ద పురోగతిని సాధించగలరు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ జీవిత భాగస్వామితో మానసిక అనుబంధం పెరుగుతుంది. మీ ప్రేమ విషయంలో ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -09 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Saturday, May 7, 2022, 17:59 [IST]
Desktop Bottom Promotion