For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఈ రాశుల వ్యాపారుల ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈరోజు ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Mercury Retrograde in Taurus : బుధుడి తిరోగమనంతో ఈ రాశులకు ఇబ్బందులు.. మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు..Mercury Retrograde in Taurus : బుధుడి తిరోగమనంతో ఈ రాశులకు ఇబ్బందులు.. మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు కార్యాలయంలో కొంత ముఖ్యమైన సమాచారాన్ని పొందొచ్చు. మీరు ఎంతగా కష్టపడితే అంత మంచి ఫలితాలొస్తాయి. మీ పనులన్నీ సాఫీగా సాగుతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి ఉదయం 10:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు అకస్మాత్తుగా కొన్ని ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పని మధ్యలో ఆగిపోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు నష్టం ఎదురుకావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మీరు వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో నిరుద్యోగులు సన్నిహితుల సహాయంతో మంచి ఉద్యోగావకాశాన్ని పొందొచ్చు. త్వరలో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఉద్యోగులకు ఇదివరకు ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీరు పనిపై ఎక్కువ ఫోకస్ పెట్టగలరు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండేందుకు తేలికపాటి క్రీడల్లో పాల్గొనాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :34

లక్కీ టైమ్ : ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు

Vastu Tips for Wallet:మీ పర్సులో ఇవి ఉంటే వెంటనే పడేయండి... ఎందుకంటే డబ్బు సమస్యలు పెరుగుతాయట..Vastu Tips for Wallet:మీ పర్సులో ఇవి ఉంటే వెంటనే పడేయండి... ఎందుకంటే డబ్బు సమస్యలు పెరుగుతాయట..

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీకు పురోగతికి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు రావొచ్చు. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. కొన్ని ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6:40 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ఉద్యోగులు బాస్ ఇచ్చిన పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు ఎలాంటి పనులను అసంపూర్తిగా ఉంచొద్దు. మరోవైపు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవద్దు. మీ కుటుంబ సభ్యులతో సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా అలసట పెరుగుతుంది. ఉద్యోగులు ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. వ్యాపారులకు ఈరోజు మంచి ప్రయోజనం కలుగుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

Rashi Parivartan 2022: మే మాసంలో 4 గ్రహాల రవాణాతో ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు...!Rashi Parivartan 2022: మే మాసంలో 4 గ్రహాల రవాణాతో ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు మీరు ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చు. ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ పనిపై ఫోకస్ పెట్టాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో వారికి మీ మార్గదర్శకత్వం అవసరం. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. అయితే ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో కొందరికి ఈరోజు ఆస్తికి సంబంధించిన వివాదాల నుండి పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు మంచి ప్రయోజనాలను పొందొచ్చు. మీ తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. వ్యాపారులు ఈరోజు చర్చలకు దూరంగా ఉండాలి. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి కాకపోవడం వల్ల మీరు కొంత చికాకు పొందొచ్చు. మరోవైపు ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో కోపానికి దూరంగా ఉండాలి. లేకపోతే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు మీరు కొత్త బట్టలు మొదలైన వాటి కోసం కూడా షాపింగ్ చేయొచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు తల్లిదండ్రులతో సంబంధం బలంగా ఉంటుంది. ఈరోజు మీరు వారితో ఎక్కువ సమయం గడుపుతారు. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, మీరు మంచి జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే, ఈరోజు మీ శోధన ముగిసినట్లు అనిపిస్తుంది. ఆర్థిక పరమైన విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసే వ్యక్తులు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రత్యేకించి మీరు హోటళ్లు లేదా రెస్టారెంట్లకు సంబంధించిన పని చేస్తే మీ ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదల ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :2

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీరు కష్టానికి తగిన ఫలితాలను కచ్చితంగా పొందుతారు. ఈరోజు బాస్ మీ శ్రమను చూసి చాలా ఆకట్టుకుంటారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు ఈరోజు ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీలు చేసే సమయంలో చాలా పారదర్శకంగా వ్యవహరించాలి. లేదంటే మీకు లాభం స్థానంలో నష్టం రావొచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం సరిగా లేకుంటే, మీ ఆందోళనలు పెరగొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ ఆరోగ్యం దెబ్బతినొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కష్టంగా ఉంటుంది. ఖర్చులు పెరగడం వల్ల మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు. ఇది కాకుండా, డబ్బు లేకపోవడం వల్ల మీరు ఇంటి బాధ్యతలను నెరవేర్చడంలో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ మనసులో అనేక ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. వ్యాపారవేత్తలు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే, మంచి అవకాశాన్ని పొందొచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారి ప్రేమ మరియు మద్దతు పొందుతారు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : ఉదయం 6:20 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా మంచిగా ఉంటుంది. మీరు తక్కువ శ్రమతో ఎక్కువ విజయాన్ని పొందొచ్చు. ఉద్యోగులకు పెండింగ్ పనుల భారం తగ్గుతుంది. మీ పనితీరును చూసి ఉన్నతాధికారులు కూడా చాలా సంతోషిస్తారు. వ్యాపారులు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ తల్లి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -10 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Monday, May 9, 2022, 22:19 [IST]
Desktop Bottom Promotion