Latest Updates
-
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
Today Rasi Phalalu : ఈరోజు వ్యాపారులకు కొన్ని కారణాల వల్ల పనులు మధ్యలో ఆగిపోవచ్చు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో మీ ప్రవర్తనపై శ్రద్ధ వహించాలి. బాస్‌తో సంభాషించేటప్పుడు మీ మాటలను పొదుపుగా ఉపయోగించండి. మరోవైపు, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు పెద్ద డీల్ చేయబోతున్నట్లయితే, కొన్ని కారణాల వల్ల మీ పని మధ్యలో నిలిచిపోవచ్చు. ఈ సందర్భంలో, మీరు చాలా నిరాశ చెందొచ్చు. అయితే మీరు చాలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా అదృష్టవంతంగా ఉంటుంది. మీరు తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు పొందొచ్చు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో కొంత వివాదాలు ఉండవచ్చు. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ :ఉదయం 4:15 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో స్టాక్ మార్కెట్లో పని చేసే వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీరు ఊహించిన దాని కంటే మెరుగైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మరోవైపు, మీ పని విదేశీ కంపెనీలకు సంబంధించినది అయితే, మీకు కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనిని సకాలంలో పూర్తి చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు. మీరు ఈ రోజు అనవసరమైన విషయాల కోసం చాలా డబ్బు ఖర్చు చేయొచ్చు. మీరు మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించకపోతే, రాబోయే రోజుల్లో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులకు మానసిక మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులతో, మీరు ఈరోజు ఎక్కువ సమయం గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :35
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో సమయం గడపండి. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. వీలైతే, మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లండి లేదా మంచి పుస్తకాన్ని చదవండి. ఉద్యోగస్తులకు ఈరోజు మంచిగా ఉంటుంది. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈరోజు మీకు ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు సవాళ్లు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ ఆరోగ్యం మెరుగుపడొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :20
లక్కీ టైమ్ : ఉదయం 10:35 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కార్యాలయ నియమాలను ఖచ్చితంగా పాటించండి. ఇది కాకుండా, మీ ప్రణాళిక ప్రకారం మీ అన్ని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో పొరపాట్లు చేయడం వలన మీరు భారీగా నష్టపోతారు. మరోవైపు వ్యాపారులు ఈరోజు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, ఇది మీ పనిపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. డబ్బు పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో దూరం పెరగొచ్చు. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారు ఈరోజు తోబుట్టువులతో సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించండి. అవసరమైనప్పుడు మీరు వారికి మార్గనిర్దేశం చేయాలి. అంతే కాకుండా పెద్దవారితో మర్యాదగా ప్రవర్తించాలి. ఉద్యోగులు ఈరోజు కొన్ని గొప్ప విజయాలు పొందొచ్చు. మరోవైపు బంగారం, వెండి వ్యాపారులకు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి, ముఖ్యంగా మీకు గుండె సంబంధిత వ్యాధులు ఉంటే, మీ అజాగ్రత్త సమస్యలను పెంచుతుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ :18
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఇటీవల ఏదైనా పోటీ పరీక్షకు హాజరైనట్లయితే, అద్భుతమైన విజయాన్ని పొందొచ్చు. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలోని ఉన్నత అధికారుల మద్దతును పొందుతారు. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు ఉంటాయి. మీ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ప్రేమ విషయంలో ఈరోజు చాలా శృంగారభరితమైన రోజు కానుంది. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :23
లక్కీ టైమ్ :ఉదయం 4 నుండి సాయంత్రం 5 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం తగ్గొచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఈరోజు పెద్ద నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది. మీరు కార్యాలయంలో ఒకేసారి అనేక పనులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీపై అధిక పని ఒత్తిడిని పెట్టకుండా ఉండాలి, లేకుంటే అది మీ పనితీరులో క్షీణతకు దారితీస్తుంది, అలాగే మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వ్యాపారులు ఈ సమయంలో ఎలాంటి కొత్త పనులు ప్రారంభించకుండా ఉండాలి. మీ వ్యాయమాలను తెలివిగా తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీరు మీ ప్రియమైనవారి మద్దతు పొందుతారు. మీరు పిల్లలతో గొప్పగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. లేకుంటే మీ మానసిక ప్రశాంతతకు భంగం కలగొచ్చు. అది మీ శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :7
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారు డబ్బు విషయంలో పారదర్శకంగా ఉండండి. ఒక చిన్న పొరపాటు మీ ఇమేజ్‌ను పాడు చేస్తుంది మరియు మీ భాగస్వామితో మీ అనుబంధం క్షీణించొచ్చు. మరోవైపు ఉద్యోగస్తులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అకస్మాత్తుగా బాస్ మీ పనిని సమీక్షించొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశాన్ని పొందొచ్చు. చాలా కాలం తర్వాత, మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడపగలుగుతారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. మీకు ఎముకలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే, మీరు మీ కాల్షియం పరీక్ష చేయించుకోవాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :11
లక్కీ టైమ్ : సాయంత్రం 4:40 నుండి రాత్రి 8:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు మీ పాత పరిచయాల నుండి మంచి లాభాలను పొందొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ శ్రమ సఫలమై మీ ప్రతిభను కనబరిచే అవకాశం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. మీకు ఇంటి పెద్దలతో సఖ్యత చెడిపోవచ్చు. మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, కోపం మరియు ఒత్తిడిని నివారించండి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :13
లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో నిరుద్యోగులు చాలా కాలంగా మంచి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీరు మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. త్వరలో మీ కోసం కొన్ని కొత్త మార్గాలు తెరవొచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం లభిస్తుంది. భవిష్యత్తులో మీరు సరైన ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు అవివాహితులైతే, ఈరోజు ఇంట్లో మీ వివాహం గురించి చర్చ జరుగుతుంది. త్వరలో మీరు ముడి వేయొచ్చు. మీరు ఇప్పటికే వివాహం చేసుకున్నట్లయితే, మీ వైవాహిక జీవితంపై మరింత శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :44
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో హోటల్ లేదా రెస్టారెంట్, ఆస్తి, ఫర్నిచర్ మొదలైన వాటికి సంబంధించిన పని చేసే వ్యక్తులకు చాలా ప్రయోజనకరమైన రోజు. మీరు ఆశించిన ఫలితాన్ని పొందొచ్చు. మరోవైపు, ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఒక సవాలుగా ఉండే పనిని అప్పగించవచ్చు. దాన్ని మీరు ప్రశాంతమైన మనస్సుతో పూర్తి చేయాలి. మీరు సానుకూలతతో మీ పనిపై దృష్టి పెడితే, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉంచండి. ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ :31
లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. వ్యాపారుల విస్తరణ ప్రణాళికలు ముందుకు సాగొచ్చు. ఇది కాకుండా, డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు మీ సమస్య పరిష్కరించబడుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో బాస్ మద్దతు లభిస్తుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, మీరు కోరుకున్న బదిలీని కూడా పొందొచ్చు లేదా మీరు ఉన్నత పదవిని పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందొచ్చు. త్వరలో మీరు మీ అప్పుల నుండి బయటపడతారు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీకు సోదరులు మరియు సోదరీమణుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఉత్సాహాన్ని కొనసాగించడానికి మీరు మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వాలి. ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలుంటే జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :9
లక్కీ టైమ్ :మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











