For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu : ఈ రాశి వారికి అకస్మాత్తుగా లాభాలొస్తాయి...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, శ్రావణ మాసంలో శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -13 August 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Sun Transit in Leo on 17 August 2021: సింహ రాశి లోకి సూర్యుడి రవాణా.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...Sun Transit in Leo on 17 August 2021: సింహ రాశి లోకి సూర్యుడి రవాణా.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో మంచిగా ఉంటుంది. ఉదయాన్నే కొన్ని శుభవార్తలు విన్నందుకు, మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఈరోజు చాలా సంతోషకరమైన రోజు అవుతుంది. ఈరోజు మీరు మీ మనస్సును సన్నిహితులతో పంచుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మాధుర్యం ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అదృష్టం ఉంటుంది. మీ పెద్ద ఆర్థిక సమస్యలకు ఆకస్మికంగా పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. ఈరోజు ఒక మంచి అవకాశం మీ చేతుల నుండి జారిపోతుంది. కాబట్టి మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టడం మంచిది. అజాగ్రత్తగా ఉండకండి. వ్యాపారవేత్తలు ఈరోజు పెద్ద పెట్టుబడులను నివారించాలి. తొందరపాటుతో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల భారీ నష్టాలు సంభవిస్తాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. కష్టాల్లో, మీకు మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే, ఈరోజు మీరు కూడా పెద్దగా ఖర్చు చేయొద్దు. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 8:10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది, ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీ పనిలో కొన్ని అసంపూర్ణంగా ఉండొచ్చు. అయితే, మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోనవసరం లేదు. మీరు మరింత ఒత్తిడిలో పని చేస్తే, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మరోవైపు వ్యాపారవేత్తలు మంచి ఫలితాలను పొందవచ్చు, ప్రత్యేకించి మీరు బట్టల వ్యాపారి అయితే, మీరు పెద్ద ఆర్డర్ పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడే బలమైన అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

Sun Transit in Leo on 17 August 2021:సింహంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులకు ఆర్థిక ప్రయోజనం...!Sun Transit in Leo on 17 August 2021:సింహంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులకు ఆర్థిక ప్రయోజనం...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యమైనది. మీరు మీ విద్యకు సంబంధించిన కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఉద్యోగస్తులకు పురోగతికి కొత్త మార్గాలు తెరవబడతాయి. మీరు మరింత కష్టపడాలి. త్వరలో మీరు విజయానికి పరాకాష్టలో ఉంటారు. ఈరోజు ఏదైనా పెద్ద డీల్ చేసేటప్పుడు వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల ఆదేశాల మేరకు మీ వ్యాపార నిర్ణయాలు తీసుకోకండి. మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తీవ్రమవుతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు అవగాహన చూపాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆహారంలో అవాంతరాల కారణంగా మీ ఆరోగ్యం క్షీణించొచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి సాయంత్రం 6:25 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ఉద్యోగులకు చాలా మంచిగా ఉంటుంది. మీ పనితీరుతో బాస్ చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేయడానికి కూడా అవకాశం పొందొచ్చు. మీరు కష్టపడి పని చేయండి, మీ కష్టానికి త్వరలో మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి, మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు అందకపోతే, మీరు తొందరపడొద్దు. క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. మీ వ్యాపార నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. ప్రతికూల పరిస్థితులలో మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రత్యేకించి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఒక ప్రత్యేకమైన రోజు కానుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మానసికంగా కొంత అలజడి ఉంటుంది. ఈరోజు మీరు ఏదో ఒక విషయం గురించి చాలా ఆందోళన చెందుతారు. ఇలాంటి సమయంలో మీరు మీ మనసును ఎవరితోనైనా పంచుకుంటే మంచిది. ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మరోవైపు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తులు మంచి విజయాన్ని సాధించొచ్చు. మీరు నిరుద్యోగిగా ఉండి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈరోజు మీకు మంచి కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. కాబట్టి మీ సన్నాహాలపై మంచి శ్రద్ధ వహించండి. వ్యాపారులకు ఇబ్బందులు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్థిక పరమైన అడ్డంకుల కారణంగా కొన్ని పనులు మధ్యలో ఆగిపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

Venus Transit in Virgo: కన్యరాశిలో శుక్రుడి రవాణా.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!Venus Transit in Virgo: కన్యరాశిలో శుక్రుడి రవాణా.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు సూర్యుడి ఆరాధనతో ప్రారంభించండి. ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. దీనితో పాటు, మీలో కొత్త శక్తి ప్రసరిస్తుంది. ఈరోజు ఉద్యోగస్తులకు సవాలుగా ఉండే రోజు. మీ పనితీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా కనిపిస్తారు. మీరు మళ్లీ అదే తప్పును పునరావృతం చేయకపోవడమే మంచిది. మరోవైపు వ్యాపారవ్యక్తులు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. పెద్ద లాభాలు సంపాదించడానికి మీరు మరింత కష్టపడాలి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. పిల్లల నుండి సంతోషం వస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, అనవసరమైన ఆందోళనలు మరియు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే మీరు ఏదైనా తీవ్రమైన వ్యాధి బారిన పడవచ్చు. ఉద్యోగులు ఈరోజు ముఖ్యమైన సమస్యను ఆఫీసులో బాస్‌తో చర్చించవచ్చు మరియు ఈరోజు అతను మీ మాటలకు గొప్ప ప్రాముఖ్యతను ఇవ్వొచ్చు. వ్యాపారులు ఈరోజు ఏదైనా మార్పు గురించి ఆలోచిస్తుంటే, ఈ సమయం వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో వివాదాలు ఈరోజు గొడవ రూపంలో ఉండవచ్చు. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రోజ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా ప్రయోజనకరమైన రోజు. వ్యాపారులు కూడా ఈరోజు మంచి ఆర్థిక లాభాలు పొందవచ్చు. ఇది కాకుండా, చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మీకు ఆఫీసులో బాస్ మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు మీ అన్ని పనులను పూర్తి కృషి మరియు సానుకూలతతో పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. కానీ సమస్య ఉండదు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కస్టమర్లతో సంభాషించేటప్పుడు మీ పదాలను సరిగ్గా ఉపయోగించండి లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. ఉద్యోగం చేసే వ్యక్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. సహోద్యోగులతో మీ అనుబంధం మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు నష్టపోవచ్చు. కాబట్టి డబ్బు విషయంలో చాలా అజాగ్రత్తగా ఉండకపోవడమే మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు ఇంటి పెద్దల ఆశీస్సులు పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, ఈరోజు సమస్యలేమీ ఉండవు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు సామాజిక జీవితంపై కూడా శ్రద్ధ వహించాలి. మీ ప్రియమైన వారితో రాజీపడటానికి ఈరోజు మంచి రోజు. ఉద్యోగులు ఈరోజు మంచి విజయాన్ని పొందొచ్చు. ఈరోజు మీకు ఇష్టమైన పని చేయడానికి మీకు అవకాశం ఇవ్వబడుతుంది. ఉన్నతాధికారులు మీ నుండి మంచి పనితీరును ఆశించొచ్చు. భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈరోజు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీ వ్యాపారంలో వృద్ధికి బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు తల్లిదండ్రులు కూడా మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు తెలివితేటలు మరియు మంచి ప్రసంగంతో చాలా విషయాల్లో విజయం సాధించవచ్చు. ప్రజలు మీ లక్షణాలను అభినందిస్తారు మీ సానుకూలతతో కూడా బాగా ఆకట్టుకోవచ్చు. ఉద్యోగులకు పని విషయంలో ఒత్తిడి ఉంటుంది. మీరు ఓపికగా ఉండటం మంచిది. మరోవైపు, వ్యాపారవేత్తలు పెద్ద లాభాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాన్ని నివారించాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈరోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు తండ్రి నుండి కొన్ని మంచి సలహాలను కూడా పొందొచ్చు. మీరు వివాహం చేసుకుంటే, మీ వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -13 August 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Thursday, August 12, 2021, 18:02 [IST]
Desktop Bottom Promotion