For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu : ఈ రాశుల వారు పనులన్నీ సకాలంలో పూర్తి చేసేస్తారు..!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, అశ్వీయుజ మాసంలో మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -13 October 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మకరరాశితో ఈ రాశుల వారు ఆనందంగా గడిపేస్తారట... మీ రాశి ఉందేమో చూసెయ్యండి...మకరరాశితో ఈ రాశుల వారు ఆనందంగా గడిపేస్తారట... మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి అనుభూతి పొందుతారు. మీరు ఒక మతపరమైన ప్రదేశాన్ని కూడా సందర్శించొచ్చు. దేవుడిని పూజించడం ద్వారా, ఈరోజు మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఉద్యోగులకు ఈరోజు చాలా సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలరు. వ్యాపారవేత్తలు మంచి లాభాలను పొందొచ్చు. ఇనుముకు సంబంధించిన వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు ఇంటి సభ్యుల నుండి కొన్ని శుభవార్తలు పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు చాలా జాగ్రత్తగా పని చేయాలి. మీరు ఎంత కష్టపడి పని చేస్తే, అంత త్వరగా పురోగమిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆశించిన విధంగా ఫలితాన్ని పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీ తండ్రితో వివాదం ఉంటే, ఈరోజు మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగించబడతాయి. మీరు మీ పెద్దలను గౌరవించాలి. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. మీకు ఒకరిపై ఒకరికి నమ్మకం బలపడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : సాయంత్రం 5:55 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఆఫీసులో అధిక పనిభారం కారణంగా మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. మీ బాస్ వైఖరి కూడా చాలా కఠినంగా ఉండొచ్చు. మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈరోజు ఏదైనా ఆర్థిక ఒప్పందం చేసుకునేటప్పుడు వ్యాపారవేత్తలు తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవద్దు. లేకుంటే మీరు పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేసే పొరపాటు చేయొద్దు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటుంటే.. నిర్లక్ష్యంగా ఉండొద్దు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

సొంత రాశిలోకి శని సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...సొంత రాశిలోకి శని సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మీ ఉదారతను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించొచ్చు. అలాంటి వ్యక్తులతో తెలివిగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందవచ్చు. కొత్త ఆదాయ వనరు పొందడానికి బలమైన అవకాశం ఉంది. మరోవైపు, ఉద్యోగం చేసే వ్యక్తులు ఈరోజు కార్యాలయంలో పెద్ద సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది. ఈరోజు బాస్ మూడ్ బాగుండదు. అటువంటి పరిస్థితిలో, ఈరోజు చిన్న పొరపాటు కూడా చేయకుండా ఉండాలి. వ్యాపారవేత్తలు లాభం సంపాదించడానికి అవకాశం పొందవచ్చు. మీరు దిగుమతి ఎగుమతికి సంబంధించిన పని చేస్తే, మీరు మంచి విజయాన్ని పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ ఇంటి ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు చాలా అదృష్టవంతమైన రోజు కానుంది. మీరు అద్భుతమైన విజయాన్ని పొందొచ్చు. మరోవైపు, విదేశీ కంపెనీలో పనిచేసే వ్యక్తుల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇదంతా మీ కష్టానికి ఫలితం. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, ఈ రోజు మీరు చర్చను నివారించాలి. లేకుంటే మీకు పెద్ద ఆర్థిక నష్టం ఉండవచ్చు. అలాగే, మార్కెట్లో మీ ఇమేజ్ కూడా చెడిపోవచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుండి మద్దతు ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైనవారు చాలా మంచి మానసిక స్థితిలో ఉంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ పెరుగుతున్న బరువును నియంత్రించాలి. ఇది కాకుండా, మీరు మీ ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేయాలి. పని విషయంలో ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఉద్యోగులు లేదా వ్యాపారులు ఈరోజు కష్టపడి పని చేయాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఈరోజు మీరు పొదుపు చేసే అవకాశాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో ప్రయాణించే అవకాశాన్ని పొందొచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

అక్టోబర్ నెలలో 4 గ్రహాల తిరోగమనం.. ఈ రాశులకు ఆర్థిక రంగంపై ప్రభావం...!అక్టోబర్ నెలలో 4 గ్రహాల తిరోగమనం.. ఈ రాశులకు ఆర్థిక రంగంపై ప్రభావం...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. ఉదయాన్నే ఓ శుభవార్త వినడం వల్ల మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది కాకుండా, మీరు కొంత భావోద్వేగాన్ని కూడా అనుభవించొచ్చు. ఈరోజు మీకు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. అలాగే ఉన్నతాధికారులతో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. పెద్ద లాభాలు రాకపోవడం వల్ల వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొంత నిరాశను పొందొచ్చు. అయితే, వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉన్నందున మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆరోగ్య పరంగా ఈరోజు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 4:35 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులు చాలాకాలంగా ఏదైనా ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు మీరు విజయం సాధించొచ్చు. మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు మీ లక్ష్యం వైపు వేగంగా వెళ్తారు. ఈరోజు మీకు ఆర్థిక పరంగా చాలా మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక ప్రయత్నం విజయవంతం కావొచ్చు. ఈరోజు పని కోణం నుండి మిశ్రమ రోజుగా ఉండే అవకాశం ఉంది. మీరు ఉద్యోగం చేస్తే ఈరోజు మీరు బాస్‌తో ఒక ముఖ్యమైన చర్చ చేయొచ్చు. మీరు పూర్తి విశ్వాసంతో మీ వైపు ప్రదర్శించాలి. వ్యాపారవేత్తలు ఈరోజు చాలా పరుగులు చేయాల్సి రావొచ్చు. ఈరోజు మీ ఇంటి వాతావరణం మంచిది కాదు. మీ కుటుంబ ఐక్యతకు భంగం కలుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా సమస్య ఉంటే, మీరు వెంటనే మంచి వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఈరోజు మీకు పనికి సంబంధించి ఏవైనా ఆందోళనలు వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వండి. త్వరలో పురోగతి యొక్క కొత్త తలుపులు మీ కోసం తెరవబడతాయి. మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటే, మీకు మంచి అవకాశం లభిస్తుంది. మీ వ్యాపారానికి సంబంధించి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే ఆలోచించకుండా ఖర్చు చేసే మీ అలవాటు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, మీరు మరింత కష్టపడాలి. ప్రత్యేకించి మీరు భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయొద్దు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ తండ్రి ఆరోగ్యం బాగోలేకపోతే, ఈరోజు అతని ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, ఈ సమయంలో మీరు వారిని ఒత్తిడి నుండి దూరంగా ఉంచాలి. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఈరోజు మీ ప్రియమైనవారి మానసిక స్థితి బాగా ఉండదు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6:55 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో వ్యాపారవేత్తలు ఈరోజు మంచి ఫలితాలను పొందొచ్చు, ముఖ్యంగా బంగారం మరియు వెండి వర్తకులకు, ఈరోజు ఉపశమనం లభించొచ్చు. అదే సమయంలో, మందులు, బట్టలు, ఆహార పదార్థాలు, నూనె మొదలైన వాటికి సంబంధించిన వ్యక్తులు, ఆశించిన ఫలితాలను పొందడానికి బలమైన అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పనిభారం తక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ పెండింగ్ పనిని పూర్తి చేయగలరు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఇంటి సభ్యులతో సంతోషంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత, ఈ రోజు మీరు మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించగలరు. ఈరోజు మీకు డబ్బు విషయంలో గొప్ప అవకాశం లభిస్తుంది. మీరు డబ్బు సంపాదించడానికి అవకాశం పొందవచ్చు. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు. మీరు ఆలోచించకుండా మరియు తొందరపడకుండా మీ నిర్ణయాలు ఏవీ తీసుకోకపోవడమే మంచిది. ఇది కాకుండా, ఇంట్లోని ఏ సభ్యుడి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల మీరు చాలా ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరమైన విషయాల్లో బలోపేతం కావడానికి, ముందుగా మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉద్యోగస్తులకు ఆఫీసులో బాస్ మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు చాలా చురుకుగా ఉంటారు. మీ అన్ని పనులను వేగంగా పూర్తి చేయగలరు. సోదరుడి వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు గతంలో చేసిన ఏదైనా పెట్టుబడికి ఆశించిన ఫలితాలను పొందొచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -13 October 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Tuesday, October 12, 2021, 19:11 [IST]
Desktop Bottom Promotion