Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Today Rasi Phalalu :ఈ రాశుల వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు...
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, ఛైత్ర మాసంలో గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు కొత్త అవకాశాలొస్తాయి. మీ కెరీర్ ఈరోజు మలుపు తిరిగే అవకాశం ఉంది. అదే సమయంలో వ్యాపారులకు ఈరోజు లాభాలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా మీరు బంగారం మరియు వెండికి సంబంధించిన పనులు చేస్తే, ఈరోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు అవివాహితులైతే, ఇంట్లో మీ వివాహం గురించి చర్చలు ఉండొచ్చు. అంతే కాకుండా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలు ఉండవు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ :9
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో చాలా మంచిగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధం బలపడుతుంది. మరోవైపు వివాహితులకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీకు పిల్లల వైపు నుండి ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామిపై మీ నమ్మకం మరింత పెరుగుతుంది. మీరు పనిని ఆనందిస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మరోవైపు, మీరు వ్యాపారం చేస్తే, ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. రానున్న రోజుల్లో దీని ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికొస్తే, ఈరోజు కొన్ని గొంతు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడొచ్చు. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 8:10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు మీ కుటుంబ జీవితంలో మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు కుటుంబానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మీ ప్రియమైనవారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి కోసం షాపింగ్ కూడా చేయొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో పడే కష్టాన్ని బాస్ గమనించగలరు. మీకు అభినందనలు కూడా అందుతాయి. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు మీ పాత పరిచయాల సహాయం తీసుకోవచ్చు. మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఈరోజు మీరు చాలా దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు మంచి అనుభూతి చెందుతారు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :31
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు మీరు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినొచ్చు. ఈరోజు మీ కష్టానికి విజయం లభిస్తుంది. మరోవైపు వ్యాపారస్తులు లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుంది. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే మంచిది. మీ ఆర్థిక స్థితిని బలంగా ఉంచుకోవడానికి మీ ఖర్చుల గురించి సరైన ఖాతాను ఉంచుకోవాలి. ఈ సమయంలో మీరు పొదుపుపై ఎంత ఎక్కువ దృష్టి సారిస్తే అంత మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు అజాగ్రత్తగా ఉండొద్దు.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :11
లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి సాయంత్రం 4:25 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే లేదా మీ వ్యాపార ప్రణాళికను మళ్లీ పని చేయాలనుకుంటే, మీరు ఆశించిన ఫలితాన్ని పొందొచ్చు. ఉద్యోగులకు ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో, మీరు కొద్దిగా ఒత్తిడిని అనుభవిస్తారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
ఈరోజు మీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. మీరు పొదుపుపై దృష్టి పెడతారు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ :14
లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా అదృష్టంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీరు ఏదైనా పాత రుణాన్ని కూడా వదిలించుకోవచ్చు. ఈరోజు మీరు కొత్త వాహనం మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఆఫీసులో బాస్ మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు కూడా కొత్త విషయాలను నేర్చుకోవచ్చు. వ్యాపారవేత్తలు త్వరితగతిన లాభాలు పొందేందుకు షార్ట్‌కట్ మార్గాలను తీసుకోవద్దు. ఇతరుల కోరిక మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. మీరు మీ ప్రియమైన వారిని ప్రేమగా మరియు గౌరవంగా చూసుకుంటే మంచిది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ :20
లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు కొంత పని ఒత్తిడి ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు ఈరోజు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. మీరు కూడా మీ కోసం సమయాన్ని వెచ్చించాలి లేకపోతే మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా బలహీనంగా మారొచ్చు. మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం మీ ఆరోగ్యానికి హానికరం అని నిరూపించొచ్చు. ఉద్యోగస్తులు తమ ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే, ఈరోజు దాని గురించి బాస్‌తో మాట్లాడటానికి అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందగలరు. ఈరోజు మీరు ఎలాంటి ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :29
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ ధైర్యం కూడా పెరుగుతుంది. మీరు మీ ఉత్తమమైనదాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు. మీ సానుకూలత మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. ఉద్యోగస్తుల దినచర్య ఈరోజు సాధారణంగా ఉంటుంది. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉండదు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, మీరు ఈరోజు డబ్బుకు సంబంధించిన ఏ పని చేయకుండా ఉంటే మంచిది. మీరు ఇంటి సభ్యునితో వాగ్వాదానికి దిగొచ్చు. కోపంలో తప్పుడు పదాలను ఉపయోగించడం మానుకోండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :10
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులు విపరీతమైన లాభాలు పొందగలరు. మీరు పెద్ద ఒప్పందం చేసుకోవచ్చు. అలాగే మీకు కొత్త ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆఫీసులో శుభవార్తలు అందుతాయి. ఉన్నతాధికారులు మిమ్మల్ని చాలా ఆకట్టుకుంటారు. మీ ఆర్థిక ప్రయత్నాలు సఫలం కావొచ్చు. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే త్వరలోనే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. వారి మద్దతు మీకు లభిస్తుంది. మీ ఆరోగ్యం విషయానికొస్తే, మీ బిజీ రొటీన్ నుండి కొంత సమయం కేటాయించండి మరియు విశ్రాంతిపై దృష్టి పెట్టండి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :19
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు ఇంటి ఆనందం మరియు శాంతిని కాపాడుకోవడానికి, మీరు మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ పెద్దలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే, పెద్దగా జోక్యం చేసుకోకండి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ పని తీరు మెరుగుపడుతుంది. ఉన్నతాధికారులు మీ కృషిని మెచ్చుకుంటారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీరు మంచి పెట్టుబడి అవకాశాన్ని కూడా పొందే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. మీకు గ్యాస్, అజీర్ణం మొదలైన సమస్యలు ఉండవచ్చు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :38
లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో ఉద్యోగులు పెద్ద కంపెనీ నుండి కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందొచ్చు. మీరు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే, కొన్ని శుభవార్తలను పొందే బలమైన అవకాశం ఉంది. వ్యాపారస్తుల ఆర్థిక స్థితి పురోగమించే సూచనలు ఉన్నాయి. త్వరలో మీరు మీ పనిలో విజృంభణను చూడొచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఈరోజు మీరు పిల్లలతో అదనపు సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీరు వారి చదువులో కూడా వారికి సహాయం చేయొచ్చు. ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఈరోజు ఎవరికైనా అప్పు ఇవ్వడం మానుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ రోజ్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో బాస్ కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు తప్పులు చేయకుండా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చు చేస్తే ఇబ్బంది ఉండదు. మీ ఇంటి సభ్యులతో సఖ్యత ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రుల ప్రేమ మరియు దీవెనలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీ ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ :5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











