Just In
- 31 min ago
బ్లాక్ టీ లేదా మిల్క్ టీ, ఏ టీ తాగాలో తెలుసుకొని ఆరోగ్యంగా ఉండండి..
- 6 hrs ago
Today Rasi Phalalu :ఈ రాశుల వారు ఆలోచించకుండా ఖర్చు చేయొద్దు...
- 20 hrs ago
మీ అందం పెంచుకోవడానికి పౌడర్ బ్లష్, క్రీమ్ బ్లష్ లో ఏది సూటవుతుందో చూసెయ్యండి...
- 20 hrs ago
Diabetes Mistakes: షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ తప్పులు చేస్తే షుగర్ కంట్రోల్ తప్పిందని హెచ్చరిక జాగ్రత్త!!
Don't Miss
- News
APSRTC బస్సుపై టార్పలిన్ కవర్-జగన్ సర్కార్ పై టీడీపీ ట్వీట్- ఆర్టీసీ ఫైర్ తో డిలీట్-అంతా ఫేక్
- Finance
GST: సామాన్యులపై జీఎస్టీ పిడుగు.. ఖరీదుగా మారనున్న మాంసం, చేపలు, పెరుగు, పనీర్..
- Movies
Dil Raju: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దిల్ రాజు భార్య.. 51 ఏళ్ల వయసులో తండ్రైన నిర్మాత
- Technology
Infinix నుంచి180W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మొబైల్స్?
- Sports
స్టువర్ట్ బ్రాడ్‌కు పనిష్మెంట్ విధించిన ఐసీసీ.. డారిల్ మిచెల్ బ్యాటింగ్ చేస్తుండగా ఆ పని చేశాడని..!
- Automobiles
ఆ రెండు వ్యాపారాలకు మంగళం పాడిన ఓలా ఎలక్ట్రిక్.. ఇక కొత్తగా ఏం రాబోతున్నాయ్
- Travel
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచుర్యం పొందిన పది జలపాతాలు..
Today Rasi Phalalu :ఈ రాశుల వ్యాపారులు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి..!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.
ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
Surya
Gochar
2022:
వృషభంలోకి
సూర్యుడి
సంచారం..
ఈ
రాశులపై
తీవ్ర
ప్రభావం..!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనితీరు ఆఫీసులో మెరుగ్గా ఉంటుంది. ఈరోజు బాస్ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈరోజు మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా నిర్ణయించుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు మీ తండ్రి నుండి ప్రత్యేక బహుమతిని కూడా పొందొచ్చు.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ :31
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 9:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు తమ పనిని ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేసేందుకు ప్రయత్నించండి. పని ఒత్తిడి పెంచుకోకుండా చూసుకోండి. ఎందుకంటే మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు కొన్ని తప్పులు చేయొచ్చు. రుణాలకు దూరంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ :25
లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి విద్యార్థులు ఈరోజు విద్యపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీ విలువైన సమయాన్ని అనవసరమైన విషయాల్లో వ్రుథా చేస్తే భవిష్యత్తులు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. తొందరపడి ఏ పని చేయకపోవడమే మంచిది. వ్యాపారులకు ఈరోజు మిశ్రమ లాభాలు వస్తాయి. మీరు పెద్ద లాభాల కోసం కష్టపడి పని చేయాలి. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 34
లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు
ఈ
5
రాశుల
వారు
ఎప్పుడూ
భార్యకు
లొంగిపోతారు...
అయినా
మంచి
భర్తగా
ఉంటారు!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు మానసికంగా మంచి అనుభూతి పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువ ఖర్చులు చేయొచ్చు. మీరు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగులకు తమ టాలెంట్ చూపడానికి మంచి అవకాశం రావొచ్చు. వ్యాపారానికి సంబంధించిన అన్ని నిర్ణయాల వల్ల మంచి ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు శారీరకంగా కూడా మంచి అనుభూతి పొందుతారు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : సాయంత్రం 5:05 గంటల నుండి రాత్రి 8:55 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీరు మీ కుటుంబ సభ్యులతో చిన్న ట్రిప్ కి వెళ్లే అవకాశాన్ని కూడా పొందొచ్చు. మీ ఇంటి అలంకరణలో కూడా కొన్ని మార్పులు చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, పెద్దల సలహాను కచ్చితంగా తీసుకోవాలి. మరోవైపు ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసిన తప్పులను ఉన్నతాధికారులు లోపాలను గుర్తించొచ్చు. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులు ఆర్థిక పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూడొచ్చు. కాబట్టి, రుణ లావాదేవీలను నివారించాలి. మరోవైపు పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాల్లో గొడవలు రావొచ్చు. మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి బాగా ఉండదు. తొందరపాటు మరియు భయాందోళనలను నివారించాలి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
వృషభంలో
బుధుడి
అస్తమయం..
రాశిచక్రాలపై
పడే
ప్రభావం..
పాటించాల్సిన
పరిహారాలివే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. వ్యాపారులు ఈరోజు తొందరపడి పెట్టుబడులు పెట్టడం మానుకోండి. లేకుంటే మీరు నష్టపోవచ్చు. మరోవైపు భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకునే బలమైన అవకాశం ఉంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన ఏ పనీ తొందరపడి చేయకండి. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :20
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో గాసిప్స్ కు దూరంగా ఉండాలి. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు కొంత మార్పు ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని ప్రమాదకర వ్యాపార నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ తోబుట్టువులతో మీ సంబంధం కూడా బలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :17
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా గొప్పగా ఉంటుంది. మీ పని సాఫీగా సాగుతుంది. అదే సమయంలో ఉద్యోగులకు ఈరోజు చాలా ఖరీదైనది. ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు రుణాలు తీసుకోవాల్సి రావొచ్చు. మీ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కువగా అలసిపోవచ్చు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో ఉన్నతాధికారులతో, కింది స్థాయి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం మానుకోండి. మరోవైపు మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నట్లయితే, మీరు మరింత కష్టపడాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉంటే, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. ఆర్థిక పరంగా ఈరోజు మంచి అవకాశం రావొచ్చు. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో బాస్ మద్దతు లభిస్తుంది. ఈరోజు పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలరు. మరోవైపు వ్యాపారులు ఈరోజు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :11
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మీ పరీక్షలు త్వరలో రాబోతున్నట్లయితే, మీరు విద్యపై పూర్తి శ్రద్ధ వహించాలి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు డబ్బుకు సంబంధించిన ఏదైనా పెద్ద లావాదేవీలను చేయొచ్చు. ఉద్యోగులకు ఈరోజు కొన్ని సమస్యలు పెరగొచ్చు. బాస్ మీపై చాలా కోపంగా ఉంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :15
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.