For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :కొన్ని రాశుల విద్యార్థులకు గురువుల మద్దతు.. ఈ రాశుల ఉద్యోగులకు శుభఫలితాలు...!

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, పుష్య మాసంలో సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Makar Sankranti 2022: మకరంలో మూడు గ్రహాల కలయిక.. ఈ 5 రాశులకు అశుభ ఫలితాలు...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబానికి సంబంధించిన ఆందోళనలు ఉండొచ్చు. ఇంట్లోని ఒక సభ్యుడి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఈరోజు మీరు డాక్టర్ మరియు హాస్పిటల్ చుట్టూ చాలా ప్రదక్షిణలు చేయాల్సి రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు లేదా ఘర్షణలు ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు ఈరోజు హెచ్చు తగ్గులు ఉంటాయి. మీరు ఈరోజు ఆశించిన ఫలితాన్ని పొందొచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీకు అలసట, తలనొప్పి మొదలైన సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6:10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే, మీరు మీ పెద్దలు మరియు ఉపాధ్యాయుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు. మీరు మీ అధ్యయనాలను ఆనందిస్తారు. మీ ఉత్తమమైనదాన్ని అందించడానికి మీరు ఉత్తమంగా ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులపై పనిభారం ఎక్కువగా ఉంటుంది, అయితే పై అధికారుల సహకారంతో మీరు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మొత్తానికి వ్యాపారులకు లాభాలు రావొచ్చు. మీ పని ఫర్నిచర్, బొమ్మలు, పాల ఉత్పత్తులు మొదలైన వాటికి సంబంధించినది అయితే, ఈరోజు మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశాన్ని పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6:40 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో సఖ్యత చెడిపోయే అవకాశం ఉంది. ఈరోజు మీ భాగస్వామి స్వభావంలో ఉగ్రత ఉంటుంది. చిన్న విషయాలకు మీ మధ్య మనస్పర్థలు రావొచ్చు. ఈ రాశికి చెందిన వివాహితులకు ఈరోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పెండింగ్ పనుల జాబితా పెరగడం వల్ల, ఈరోజు మీ సమస్యలు కూడా పెరుగుతాయి. ఈరోజు బాస్ యొక్క మానసిక స్థితి చాలా బాగుండదు. ఆ సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు మంచి లాభాలు పొందగలరు. మీకు ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉంటే, మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 5:15 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

బుధుడు మకరంలోకి తిరోగమనం.. 12 రాశులపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే, మీరు ఇటీవల ఏదైనా కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే, ఈరోజు మీకు సానుకూల సమాధానం వచ్చే అవకాశం ఉంది. ఇదంతా మీ కష్టానికి ఫలితం. మరోవైపు, చిన్న వ్యాపారులు చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండాలి. లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడాలి. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుండి మానసిక మద్దతు పొందుతారు. మీరు ఉమ్మడి కుటుంబంలో నివసిస్తుంటే మీ ఇంటి ఐక్యత అలాగే ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. మీ ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. అయితే, మీరు ఇతరులను ఆకట్టుకోవడానికి ఎక్కువ ఖర్చు చేయడం మానుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 33

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 3:05 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రత్యేకించి మీ ఇంట్లోని యువకులతో సంభాషించేటప్పుడు, మీ ప్రవర్తనపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారవేత్తలు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈరోజు వారు మీ ముఖ్యమైన పనిని అడ్డుకోగలరు. మరోవైపు, ఉద్యోగస్తులు కార్యాలయంలోని సహోద్యోగుల పనిలో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా ఉండాలి. మీరు మీ పనిపై దృష్టి పెట్టండి. మీ ఉత్తమమైనదాన్ని అందించడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు పెద్ద షాపింగ్ చేయాలనే మూడ్‌లో ఉంటే, ఈ రోజు దానికి మంచి రోజు కాదు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి ఉదయం 11:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసు వాతావరణం చాలా బాగుంటుంది. చాలా కాలం తర్వాత, మీరు మీ పనిపై సరిగ్గా దృష్టి పెట్టగలరు. ఈరోజు మీరు బాస్‌తో కొన్ని ముఖ్యమైన చర్చలు కూడా చేయొచ్చు. ఉద్యోగ మార్పులకు ఇది అనుకూలమైన సమయం. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని పొందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు మీ దారిలోకి వస్తున్నట్లయితే, ఈరోజు మీ సమస్య కూడా ముగియవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో గొడవ పడొచ్చు. కోపంలో తప్పుడు పదాలు వాడటం మానుకోవాలి. మీరు మీ ప్రియమైన వారిని ప్రేమ మరియు గౌరవంతో చూసుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3:20 గంటల వరకు

2022 Yearly Rasi Phalalu : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు అద్భుత విజయాలు సాధిస్తారట...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైన రోజు. ఆస్తి సంబంధిత పనులు చేసే వ్యక్తులు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు ఈరోజు కొత్త ఒప్పందం చేసుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో మీ పని పట్ల బాస్ చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు మీ పురోగతికి సంబంధించిన సంకేతాలను కూడా పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు పొదుపుపై ​​ఎక్కువ శ్రద్ధ వహిస్తే, మీరు వీలైనంత త్వరగా రుణాన్ని వదిలించుకోవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో సామరస్యం మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైనవారి ప్రవర్తనలో కొంత మార్పు ఉంటుంది. మీరు వారి నుండి మంచి బహుమతిని కూడా పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 8 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు విద్యార్థులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను పొందాలనుకుంటే, మీ మార్గంలో పెద్ద అడ్డంకి ఉండవచ్చు. అయితే, మీ సమస్య త్వరలో ముగిసే అవకాశం ఉన్నందున మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోవలసిన అవసరం లేదు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉండదు. మీ సంచిత మూలధనం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత, ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో ప్రశాంతమైన రోజును ఆనందిస్తారు. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ ప్రపంచ మహమ్మారి దృష్ట్యా, మీ ఆరోగ్యం విషయంలో ఎలాంటి అజాగ్రత్తగా ఉండకండి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో విభేదాలు రావొచ్చు. మీ సంబంధంలో చిక్కుముడి వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. మీరు పశ్చాత్తాపపడే కోపంతో ఏమీ చేయకండి. మరోవైపు, మీరు ఒంటరిగా ఉండి, మంచి జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే, ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. ఈరోజు మీరు హాబీల కోసం కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. ఇది కాకుండా, ఆర్థికంగా మీకు అవసరమైన వారికి సహాయం చేసే అవకాశం కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ పనులన్నింటినీ పూర్తి శ్రమతో పూర్తి చేస్తారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు పురోగతికి అవకాశం ఉంది. బంగారం మరియు వెండి పని చేసే వ్యక్తులు కూడా ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. కొన్ని చెడు వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కార్యాలయంలోని ఉన్నతాధికారుల సలహాలు పాటించాలి. పని పట్ల కొంచెం అజాగ్రత్త మీ పురోగతి కలను నాశనం చేస్తుంది. మరోవైపు, వ్యాపారంతో అనుబంధించబడిన వ్యక్తులు ఈరోజు కొంత పెద్ద ఆర్థిక లావాదేవీలు చేసే అవకాశాన్ని పొందొచ్చు. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో మంచి సామరస్యం ఉంటుంది. ఒకరికొకరు మీ నమ్మకం మరింత బలపడుతుంది. ఈరోజు, మీ ప్రియమైనవారి నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా సాధ్యమే. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:55 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో శృంగార పరంగా మంచిగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో సమావేశానికి మంచి ప్రదేశానికి వెళ్లొచ్చు. మీకు తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీరు ఆలోచించకుండా ఎలాంటి ఆర్థిక నిర్ణయాలను తీసుకోకపోవడమే మంచిది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పోటీ చాలా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కష్టపడి పనిచేయాలి. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నట్లయితే, మీ వంతు కృషి చేయండి. మీరు సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందగలరు. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 7:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. మీకు కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండొచ్చు. మీరు వారి నిర్ణయాలతో ఏకీభవించనట్లయితే, కోపంతో కాకుండా ప్రశాంతంగా మీ పక్షాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించండి. మీరు మీ సంబంధం యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో ఏదైనా కష్టమైన పనిని అప్పగించొచ్చు. మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ చివరికి మీరు విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. వ్యాపారస్తులు అకస్మాత్తుగా దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. మీ ఈ ప్రయాణం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈ మహమ్మారి దృష్ట్యా, మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -17 January 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published: Monday, January 17, 2022, 5:00 [IST]