For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు డబ్బు నష్టపోయే అవకాశం ఉంది...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఈ 4 రాశుల వారు చాలా పవర్ ఫుల్.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...ఈ 4 రాశుల వారు చాలా పవర్ ఫుల్.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈ సమయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి. మీరు ఈరోజు ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయం తీసుకోనున్నట్లయితే, మీ కస్టమర్ల సౌకర్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోండి. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు పనిభారం పెరుగుతుంది. ఇదంతా మీ అజాగ్రత్త ఫలితమే. ఈరోజు మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. ఈరోజు మీ తల్లిదండ్రులతో కలిసి మతపరమైన ప్రదేశాలకు కూడా వెళ్లొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు నిద్రలేమి సమస్యలు ఉండొచ్చు. కాబట్టి మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు తమ ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు మీరు గొప్ప అవకాశాన్ని పొందే బలమైన అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారి ఆదాయం కూడా పెరుగుతుంది. చిరు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. మరోవైపు మీ ఇంటి వాతావరణం బాగా ఉండదు. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ ఆదాయం బాగానే ఉంటుంది. మీ ఖర్చులు పెరగడం వల్ల మీకు ఆందోళన పెరుగుతుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :28

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి ఉదయం 11 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం ఆకస్మీకంగా క్షీణించొచ్చు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ పనిలో కొన్ని అడ్డంకులు రావొచ్చు. మరోవైపు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకూడదు. మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

బుధుడి అస్తమయం వల్ల ఈ రాశులకు తీవ్రమైన కష్టాలు..!బుధుడి అస్తమయం వల్ల ఈ రాశులకు తీవ్రమైన కష్టాలు..!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు ఆఫీసు వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు మీరు పని చేయడంలో భిన్నమైన ఆనందాన్ని అనుభవిస్తారు. మీ పనిని చూసి మీ బాస్ చాలా సంతోషిస్తారు. సౌందర్య సాధనాల వ్యాపారం చేసే వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు భారీ ఆర్థిక లాభాలను పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపుడుతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఈరోజు బయటి ఆహారానికి దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈరోజు పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉండదు. ఉద్యోగులు పదోన్నతి పొందేందుకు శ్రమించాల్సి ఉంటుంది. చిన్న చిన్న పనులను కూడా పూర్తి శ్రమతో మరియు అంకితభావంతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఇంటి సభ్యులతో సఖ్యత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు కొంత వివాదం ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :5

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు బాధ్యతల భారం మీపై ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు అనవసరంగా ప్రయాణం చేయొచ్చు. మీరు శారీరక నొప్పిని కూడా అనుభవించొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయడం వంటి తప్పు చేయొద్దు. ఉద్యోగులు ఈరోజు బాస్ యొక్క కోపాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. వ్యాపారులు ఈరోజు ఎలాంటి పెద్ద ఒప్పందాలకు దూరంగా ఉండాలి. అయితే, మీరు అనవసరంగా చింతించకుండా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే, మీరు వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :30

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభంలో బుధుడి అస్తమయం.. రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!వృషభంలో బుధుడి అస్తమయం.. రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ఉపశమనం కలుగుతుంది. మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు. ఈ బాధ్యతలను పూర్తి ఉత్సాహంతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు రావొచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు మీ ప్రియమైన వారిపై నమ్మకాన్ని పెంచుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలలో ఇతరులెవరూ జోక్యం చేసుకోనివ్వకండి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, వీలైనంత త్వరగా దాన్ని పరిష్కరించుకునేందు ప్రయత్నించండి. మీ ప్రియమైన వారి ప్రవర్తనలో ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ ఆదాయం పెరగొచ్చు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో కొందరు వ్యక్తులకు ఆస్తికి సంబంధించిన విషయాల్లో చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ చిన్న పాటి అజాగ్రత్త ఈరోజు మీకు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు కొంత డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయానికొస్తే, సిగరెట్ మరియు మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :16

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో వాతావరణం వేడిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఉన్నతాధికారులతో వాగ్వాదం పడొచ్చు. ఇలాంటి సమయంలో మీరు నియంత్రణలో ఉండాలి. మరోవైపు నిరుద్యోగులు చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్నట్లయితే, ఈరోజు మీరు విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక స్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ ఇంటి సభ్యులతో అనుబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు అధిక పనిభారం ఉంటుంది. మీరు ఈరోజు విశ్రాంతిపైనా శ్రద్ధ వహించాలి. లేదంటే మీ ఆరోగ్యం కూడా ప్రభావితం కావొచ్చు. వ్యాపారులు ఈరోజు ప్రమాదకర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు సన్నిహితుల సలహాలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకుంటే, ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపేందుకు అవకాశం లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు సమయానికి నిద్రపోవాలి. ఉదయాన్నే నిద్ర లేవాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. ఈరోజు మీరు కస్టమర్లను ఆకట్టుకోవడంలో కూడా విజయం సాధించొచ్చు. వ్యాపారంలో కూడా సానుకూల మార్పులు చూడొచ్చు. ఉద్యోగులకు ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు బాస్ నుండి కొన్ని మంచి సలహాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -17 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Monday, May 16, 2022, 19:22 [IST]
Desktop Bottom Promotion