Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Today Rasi Phalalu :ఓ రాశి వారు వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యం రానివ్వద్దు...
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, ఫాల్గుణ మాసంలో శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైన రోజు. మీరు ఉద్యోగం చేసి ఆశించినంత ఫలితం రాకపోతే మీ సామర్థ్యాలను గుర్తించాలి. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు. వ్యాపారవేత్తలు ఈ సమయంలో ఎలాంటి మార్పులకైనా దూరంగా ఉండాలి. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత విషయాలలో బయటి వ్యక్తులు జోక్యం చేసుకోవడానికి అనుమతించొద్దు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉండొచ్చు. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి నడకకు కూడా వెళ్ళొచ్చు. దీనివల్ల మీరు చాలా రిఫ్రెష్‌గా ఉంటారు. ఉద్యోగులకు ఆఫీసు వాతావరణం చాలా బాగుంటుంది. మీరు పై అధికారుల మద్దతు పొందుతారు. ఈరోజు మీ ఆగిపోయిన ఏదైనా పనిని సకాలంలో పూర్తి చేయొచ్చు. ఫర్నీచర్, బంగారం-వెండి, బట్టలు మొదలైన వాటికి సంబంధించిన వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు శ్రద్ధ వహించాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :18
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ పనితో పాటు, మీరు కుటుంబంపై కూడా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పిల్లల కోసం, మీరు మీ బిజీ రొటీన్ నుండి కొంత సమయం కేటాయించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు ఖరీదైనది. కుటుంబ సభ్యుల అనారోగ్య కారణంగా, మీరు వైద్యులు మరియు మందుల కోసం చాలా డబ్బు ఖర్చు చేయొచ్చు. మీరు ఈరోజు తప్పుడు ఫలితాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు ఈరోజు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు పెరుగుతాయి.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :37
లక్కీ టైమ్ : ఉదయం 6:25 నుండి రాత్రి 10 గంట వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా లాభదాయకమైన రోజు. మీరు మంచి పెట్టుబడి అవకాశాన్ని పొందొచ్చు. మీరు భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఉద్యోగాలు మార్చుకోవాలనుకుంటే, ఈరోజు మీరు పెద్ద కంపెనీ నుండి మంచి ఆఫర్ పొందొచ్చు. మంచి జీతంతో ఉన్నత పదవిని కూడా పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు అవివాహితులైతే, ఈరోజు ఇంట్లో మీ వివాహం గురించి చర్చ జరుగుతుంది. త్వరలో మీరు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల సాధ్యమవుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
లక్కీ కలర్ : లైట్ రెడ్
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారు ఈరోజు కొందరు పాత మిత్రులను కలుసుకోవచ్చు. చాలా కాలం తర్వాత మీరు అద్భుతమైన సమయాన్ని అనుభూతిని పొందుతారు. ఉద్యోగులు ఈరోజు సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి రావొచ్చు. పెండింగ్ పనుల భారం పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఉన్నతాధికారుల వైఖరి కూడా చాలా కఠినంగా ఉండబోతోంది. అటువంటి పరిస్థితిలో, మీ పనిని శాంతి మరియు అవగాహనతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు ఈరోజు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అయితే, మీ ఈ ప్రయాణం పెద్దగా ప్రయోజనం కలిగించదు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో సామరస్యం మెరుగ్గా ఉంటుంది. మీరు ఒకరినొకరు మళ్లీ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 32
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో అదృష్టం పొందుతారు. మీరు తక్కువ శ్రమతో మంచి విజయాన్ని పొందొచ్చు. ఉద్యోగస్తులకు పురోభివృద్ధికి అవకాశం ఉంది. మీరు ఈరోజు కార్యాలయంలో మీ ప్రమోషన్ వార్తలను పొందొచ్చు. మరోవైపు, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభాలను ఆర్జించడానికి మంచి అవకాశం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిలో పెద్ద పెరుగుదలకు బలమైన అవకాశం ఉంది. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారితో పండుగను ఉత్సాహంగా ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. మీ పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఫిట్ గా మరియు యాక్టివ్ గా ఉంటారు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి రాత్రి 8:45 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు. మీరు కొత్త ఆదాయ వనరులను పొందే బలమైన అవకాశం ఉంది. మీ ఆర్థిక నిర్ణయాలను తెలివిగా తీసుకోండి. వ్యాపారులు ఈరోజు మంచి అవకాశాలను పొందొచ్చు. మీ వ్యాపారంలో సానుకూల మార్పు సాధ్యమే. మరోవైపు, ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలితాలను కూడా పొందొచ్చు. బాస్ మీ కృషిని అభినందిస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వ్యక్తి నుండి మంచి బహుమతిని కూడా పొందొచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీకు తలనొప్పి, అలసట మొదలైన సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ :14
లక్కీ టైమ్ : ఉదయం 6:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో పని చేసే వారు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా, మీ ఉత్తమమైనదాన్ని అందించడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. మీరు మీ ప్రియమైన వారితో ఏకీభవించనట్లయితే, తగాదాకు బదులుగా, మీ వైపు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభ ఫలితాలను పొందుతారు. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు ఆఫీసులో కొన్ని శుభవార్తలను వింటారు. కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన వారు ఈరోజు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. మరోవైపు, మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే, మీ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజు అనుకూలమైన రోజు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈరోజు అతిథులు వస్తూ పోతూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో చాలా సరదాగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. మీరు మీ ప్రియమైన వారిని ప్రేమ మరియు గౌరవంతో చూడాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7:15 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. మీపై ఎక్కువ పని ఒత్తిడి పడకుండా ఉండండి. అలాగే ఏ విషయంలోనూ ఒత్తిడికి లోనుకావద్దు. వీలైతే, ఈరోజు పనిని పక్కన పెట్టి విశ్రాంతిపై దృష్టి పెట్టండి. విదేశీ కంపెనీలో పనిచేసే వారికి ఈ సమయం చాలా సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మరోవైపు, వ్యాపారవేత్తలు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:05 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ ప్రియమైన వారు మంచి అనుభూతి చెందుతారు. పని విషయంలో ఈరోజు సాధారణ రోజుగా ఉంటుంది. ఆఫీసులో మీ పనులు సజావుగా పూర్తవుతాయి. అదే సమయంలో, వ్యాపారవేత్తలు తమ నిలిచిపోయిన ప్రణాళికలను ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఈరోజు మీరు పిల్లల చదువుల కోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు జలుబు, జ్వరం మొదలైన సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ :26
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1:50 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఓపికతో పని చేయాలి. ఉద్యోగులు కార్యాలయంలోని ఉన్నతాధికారులతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నించండి. వారు మీకు ఏవైనా మార్పులను సూచిస్తే, మీరు వారి మాటలను తీవ్రంగా పరిగణించాలి. వ్యాపారంలో ఉన్నవారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు, లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడొచ్చు. మీ జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ :19
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:20 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











