Today Rasi Phalalu : ఓ రాశి గర్భిణి స్త్రీలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, ఫాల్గుణ మాసంలో శనిరం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ఎక్కువగా అలసిపోవచ్చు. మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఇంటి బాధ్యతల భారం కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మీకు మీ కోసం సమయం కూడా లభించకపోవచ్చు. అయితే, మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతమైన మనస్సుతో, ఓపికతో చేసే పని వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో విడిపోవడాన్ని నివారించండి. ఇలాంటి విషయాలు మీ వైవాహిక జీవితంలో అసమ్మతిని పెంచుతాయి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 6:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి సిగరెట్, మద్యం వంటి చెడు అలవాట్లు ఉంటే, ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు అవుతుంది. ఉద్యోగులకు ఆఫీసు వాతావరణం బాగుంటుంది. మీరు ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల పూర్తి మద్దతు పొందుతారు. వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలను ఆశించవచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన విషయాల గురించి ఆందోళన చెందుతారు. మీకు చాలా చిరాకుగా అనిపించొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో వాగ్వాదానికి గురయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. లేకపోతే మీ రోజంతా పనికిరాని విషయాలలో వృథా కావొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలోని ఉన్నతాధికారులతో మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. వారు మీ పనిలో మెరుగుదలను సూచిస్తే, మీరు వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మరోవైపు వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ ఆగిపోయిన పని ఏదైనా పూర్తవుతుంది. ఈరోజు మీరు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వారితో చాలా సరదాగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయగలరు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉంచండి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :29

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 6:20 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారు ఈరోజు చాలా తెలివిగా వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఉత్సాహాన్ని కొనసాగించడానికి, మీరు మీ ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రమాదకర నిర్ణయాలను తీసుకోవద్దు. మీరు ఈరోజు ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేయబోతున్నట్లయితే, చాలా జాగ్రత్తగా ఉండండి. మరోవైపు ఆఫీసులో ఉద్యోగుల పనితీరుపై బాస్ అసంతృప్తిగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో, మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండేందుకు స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండండి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఉంటే మంచిది. మీరు కార్యాలయంలోని బాస్ నుండి కొన్ని మంచి సలహాలను పొందొచ్చు. ఇది కాకుండా, ఉన్నతాధికారులతో మీ సమన్వయం కూడా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు చాలా సవాళ్లు ఎదురవుతాయి. అయితే మీరు చాలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలో మీ సమస్య తీరిపోతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే, త్వరలో మీరు విజయాన్ని పొందొచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో చాలా మంచిగా ఉంటుంది. మీరు సానుకూలంగా ఉండటం వల్ల మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు. ఈరోజు మీ పనులన్నీ మీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. శ్రామికులకు ఈరోజు ఉపశమనం కలుగుతుంది. పని భారం తక్కువగా ఉంటుంది. మరోవైపు వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. ఇది కాకుండా, ఈరోజు మీరు మీ ప్లాన్లలో కొన్ని మార్పులు కూడా చేయొచ్చు. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి చాలా మంచి మూడ్‌లో ఉంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చింతలన్నింటినీ మరచిపోయి మీ ప్రియమైన వారితో చాలా సరదాగా గడుపుతారు. ఈ సమయంలో మీకు మీ ప్రియమైనవారి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశాన్ని పొందొచ్చు. త్వరలో మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు చూడవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు సాధారణంగానే ఉంటుంది. మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మరోవైపు మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. చిన్నపాటి సమస్య వచ్చినా వెంటనే మంచి వైద్యులను సంప్రదించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :5

లక్కీ టైమ్ : ఉదయం 6:25 నుండి సాయంత్రం 4 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు మంచి ఉపశమనం లభిస్తుంది. మరోవైపు, ఆహారం మరియు పానీయాల వ్యాపారం చేసే ప్రజలకు ఈరోజు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో ఉంటాయి. మీకు కొందరు కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండొచ్చు. మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటే మంచిది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇతరుల కోరిక మేరకు మీ ఆర్థిక నిర్ణయాలను తీసుకోకండి. లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీకు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయుని ఆరాధనతో ప్రారంభించాలి. మీరు మనశ్శాంతిని అనుభవిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. పెరుగుతున్న ఖర్చులు మీ బడ్జెట్‌ను బ్యాలెన్స్ లేకుండా చేస్తాయి. మీరు ఆలోచించకుండా ఎక్కువ ఖర్చు చేయకపోవడమే మంచిది. లేకుంటే మీ భవిష్యత్ ప్రణాళికలలో అడ్డంకులు ఉండొచ్చు. ఈరోజు కార్యాలయంలో మీ విలువైన సమయాన్ని వృథా చేయకుండా ఉండండి. మీకు ఏదైనా ముఖ్యమైన బాధ్యత ఉంటే, దానిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలు పొందగలరు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తీవ్రమవుతాయి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి రాత్రి 9:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఈరోజు ఇంటి వాతావరణం మంచిగా ఉంటుంది. మీరు మీ ప్రియమైనవారి మద్దతు పొందుతారు. వ్యాపారులు ఈరోజు కొత్త వ్యాపార ప్రతిపాదనను పొందొచ్చు. త్వరలో మీ వ్యాపారం రెండు రెట్లు వేగంగా వృద్ధి చెందుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కోరుకున్న బదిలీని పొందొచ్చు. మీ ఆదాయం కూడా పెరగొచ్చు. ఈరోజు మీ ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు, అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు తప్పుడు పరిణామాలను ఎదుర్కోవలసి రావొచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. వారి మద్దతు మీకు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Saturday, March 19, 2022, 5:00 [IST]
Desktop Bottom Promotion