Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం!
Today Rasi Phalalu :ఈ రాశుల వారి ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు బాస్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. వ్యాపారులకు ఈరోజు బిజీగా ఉంటుంది. ఈరోజు మీరు కొత్త ప్లాన్లలో దేన్నైనా చేయడం ప్రారంభించొచ్చు. ఇది కాకుండా, మీరు కొన్ని కొత్త వ్యూహాల గురించి ఆలోచిస్తారు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. పెద్దలతో మంచి సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :10
లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉదయాన్నే ఏదో ఒక శుభవార్త వినడం వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పని చేసే వారికి ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురుకావొచ్చు. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. మీరు ఉద్యోగం మానేయాలని కూడా నిర్ణయించుకోవచ్చు. మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు వ్యాపారులకు మంచి అవకాశం లభిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :31
లక్కీ టైమ్ : సాయంత్రం 5:55 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశిలో ఉద్యోగులు ఇటీవల చేరినట్లయితే, శుభవార్తలు వింటారు. కార్యాలయంలో బాస్ మీ శ్రమను అభినందిస్తారు. మీకు కొన్ని కొత్త బాధ్యతలు కూడా ఇవ్వబడతాయి. వ్యాపారులకు సంబంధించిన పనులు ఈరోజు నిలిచిపోతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామితో విభేదిస్తున్నట్లయితే, ఈరోజు మీ మధ్య దూరం కొంచెం తగ్గుతుంది. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :30
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం మంచిగా ఉండదు. మీ కఠిన మాటలు మీ ప్రియమైన వారి మనోభావాలను దెబ్బతీస్తాయి. కోపంలో మాట్లాడకపోవడమే మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఈరోజు అవసరానికి మించి ఖర్చులు చేయొచ్చు. ఉద్యోగుల పనులన్నీ సజావుగా సాగుతాయి. మీకు ఉన్నతాధికారుల మద్దతు కూడా లభిస్తుంది. అదే సమయంలో వ్యాపారులకు కొత్త మార్గాలు తెరవబడతాయి. మీరు మీ ప్లాన్లలో కొన్ని మార్పులు కూడా చేయొచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :21
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు అధికారిక పర్యటనకు వెళ్లాల్సి ఉంటుంది. మీ ఈ ప్రయాణం చాలా ముఖ్యమైనది. మరోవైపు వ్యాపారులు ఈరోజు కస్టమర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఈరోజు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :2
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉండొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదల ఉండొచ్చు. మీరు చాలా కాలంగా భూమి, ఇల్లు లేదా కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో కూడా కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీరు విదేశీ కంపెనీలో పని చేస్తే, మీ ఆదాయాన్ని పెంచుకునే బలమైన అవకాశం ఉంది. అయితే ఈరోజు బాధ్యతల భారం మీపై ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు మిశ్రమ లాభాలను పొందుతారు.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 38
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ శ్రమ బలంతో ఈరోజు కార్యాలయంలో మీ స్థానాన్ని బలోపేతం చేసుకోగలుగుతారు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు నిరాశజనకంగా ఉంటుంది. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సానుకూలంగా ఉండండి మరియు కష్టపడి పని చేయండి. మీరు త్వరలో కొత్త అవకాశాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మంచి ప్రవర్తనను కొనసాగించడానికి ప్రయత్నించండి. వీలైతే, ఈరోజు మీ ప్రియమైన వారి కోసం అద్భుతమైన ఆశ్చర్యాన్ని ప్లాన్ చేయండి. మీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :9
లక్కీ టైమ్ : ఉదయం 4:35 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో సహోద్యోగులతో విభేదాలు పెరగొచ్చు. మీరు మీ పనిపై ద్రుష్టి పెట్టగలరు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో మొరటుతనం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ :15
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో పోటీ గణనీయంగా పెరుగుతుంది. ఈరోజు మీరు చాలా కష్టపడాల్సి రావొచ్చు. పనిభారం మిమ్మల్ని ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీకు తల్లిదండ్రులతో సంబంధం బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బలహీనంగా ఉండొచ్చు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ :9
లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో పని చేసే వారికి మంచిగా ఉంటుంది. మీరు ఈరోజు సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, మీకు మంచి అవకాశం లభిస్తుంది. వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే బలమైన అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ ఇంటి సభ్యులతో సంబంధం బలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఈ విధంగా, మీరు ఒకరితో ఒకరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, మీరు వైద్యుడిని సంప్రదించాలి.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :11
లక్కీ టైమ్ : ఉదయం 6:55 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీరు కోరుకున్న జాబ్ వచ్చే బలమైన అవకాశం ఉంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు చాలా నిరాశ చెందుతారు. ఈరోజు మీరు ఎలాంటి ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలను తీసుకోవద్దు. ఈరోజు మీ ఇంటి వాతావరణం బాగా ఉండదు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మీకు అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :16
లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు ఆకస్మిక బదిలీ ఉండొచ్చు. మరోవైపు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు కష్టపడి పని చేయాలి. ఆహార పదార్థాలు, స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్, మతపరమైన విషయాలు తదితర వాటికి సంబంధించిన పనులు చేసే వారికి ఈరోజు చాలా ప్రయోజనకరమైన రోజు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు మీరు ఇంటి సభ్యులతో చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఈరోజు ఏదైనా వివాహ వేడుకలో పాల్గొనవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ :5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











