For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఈ రాశుల వారు ఈరోజు సమయాన్ని వృథా చేయకుండా.. పనులపై దృష్టి పెట్టాలి...

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, పుష్య మాసంలో గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Makar Sankranti 2022 Horoscope:మకరంలోకి సూర్యుడి రవాణా.. 12 రాశులపై పడే ప్రభావం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరగొచ్చు. కోపంగా ఉండకండి, లేకుంటే మీరు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, ఈరోజు మీకు మంచి వివాహ ప్రతిపాదన కూడా రావొచ్చు. పెరుగుతున్న పని ఒత్తిడి మరియు పైఅధికారుల ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారులకు ఈరోజు సాధారణంగానే ఉంటుంది. అయితే, మీ వంతుగా ప్రయత్నిస్తూ ఉండండి. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి రుణాలు తీసుకోకుండా ఉండాలి. రాబోయే కాలంలో మీపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే, మీరు మరింత కష్టపడాలి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పని విషయంలో ఈరోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. ఈ సమయంలో మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయడం మానుకోవాలి. ఉద్యోగ మార్పునకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు పురోగతి సాధించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చు చేస్తే బాగుంటుంది. ఈరోజు డబ్బుకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు చేయకండి. ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా సమస్యలుంటే సానుకూలంగా ఉండండి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 6:20 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు ఉత్సాహంతో ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదలకు అవకాశం ఉంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ మార్గంలో పెద్ద అడ్డంకి ఉండొచ్చు. హోటళ్లు లేదా రెస్టారెంట్లకు సంబంధించిన వ్యక్తులు కొంత నష్టాన్ని చవిచూడొచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా రద్దీగా ఉంటుంది. మీకు పెండింగ్ పనుల భారం పెరగొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఎక్కువ శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

2022 Yearly Rasi Phalalu : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు అద్భుత విజయాలు సాధిస్తారట...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఆఫీసులో బాస్ మీ కష్టాన్ని గమనించొచ్చు. త్వరలో మీరు కూడా పదోన్నతి పొందొచ్చు. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు బంగారం లాంటి అవకాశం లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీరు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు మీ ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ ఆహారం మరియు పానీయాలపై శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టకరమైన రోజు. మీ వ్యాపారం పెరుగుతుంది. దీంతో పాటు, మీ ఆర్థిక పరిస్థితి కూడా పెరుగుతుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, మీరు చాలా మంచి అవకాశాలను పొందొచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీపై పనిభారం తగ్గుతుంది. మీ కుటుంబ జీవితంలో కొంత ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఇంటి పెద్దలతో మీ సాన్నిహిత్యం చెడిపోవచ్చు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. మీ ప్రియమైన వారి మనోభావాలను దెబ్బతీసే పనిని చేయకండి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీరు పొదుపుపై ​​ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు. మీకు కాలేయానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు మీ సమస్య పెరుగుతుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు జ్వరం, జలుబు, దగ్గు మొదలైన సమస్యలతో ఇబ్బంది పడొచ్చు. మీ కుటుంబంలో కొంత ఒత్తిడికి అవకాశం ఉంది. ఇంటి సభ్యుల ఐక్యతకు భంగం కలగొచ్చు. ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉండొచ్చు. మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఒకరికొకరికి మీకు నమ్మకం మరింత బలపడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించొచ్చు. జీతాలు తీసుకునే వారు తమ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈరోజు మీ పనిని అసంపూర్తిగా ఉంచొద్దు. అలాగే సహోద్యోగులతో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6:40 గంటల వరకు

2022లో పురుషులు ఎలా ఉండబోతున్నారో తెలుసా? ఈ 4 రాశుల వారికి రాజయోగం రాబోతుంది....!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం చాలా బాగుంటుంది. మీరు మీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. మీరు పని విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఆఫీసులో కొంత గొప్ప గౌరవాన్ని పొందొచ్చు. మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే, మీ పురోగతి మొత్తం అవుతుంది. ఎలక్ట్రానిక్స్, బట్టలు, కలప, సౌందర్య సాధనాలు మొదలైన వాటికి సంబంధించిన పని చేసే వారికి ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ పరంగా ఈరోజు మంచి రోజు కాదు. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. సోదరులతో సంబంధాలు చెడిపోవచ్చు. ఈరోజు మీ తండ్రి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించే అవకాశం ఉంది. ఈ సమయంలో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో మార్పు రావాల్సిన సమయం ఇది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఈరోజు కొంత మార్పు సాధ్యమే. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు, మీరు వ్యాపారవేత్త అయితే మరియు మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు మీరు శుభవార్త పొందొచ్చు. విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇంజినీరింగ్‌ చదివితే మంచి విజయం సాధించొచ్చు. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడకుండా ఉండండి. తీవ్రమైన గృహ సమస్య ఉన్నట్లయితే, దానిని తెలివిగా పరిష్కరించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల సాధ్యమవుతుంది. ఈరోజు ధనలాభం ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మీకు మంచిగా ఉంటుంది. మీరు బట్టలు, బంగారం, వెండి, చెక్క, నూనె మొదలైన వాటికి సంబంధించిన పనులు చేస్తే, మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. మీరు ఉద్యోగం చేస్తే, పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి మీరు కృషి చేస్తారు. మీరు ఉద్యోగంతో మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, త్వరలో మీ ప్రణాళిక ముందుకు సాగుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుండి మానసిక మద్దతు పొందుతారు. మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీ జీవిత భాగస్వామితో సంబంధంలో చేదు ఉండొచ్చు. అనవసరమైన విషయాల కోసం మీ ప్రియమైన వారిపై కోపం తెచ్చుకోవడం మానుకోండి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రే

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి ఉదయం 10:15 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావొచ్చు. డబ్బు లేకపోవడం వల్ల మీ కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోవచ్చు. ఆఫీసులో మహిళా సహోద్యోగులతో మీ ప్రవర్తనను చక్కగా ఉంచండి. ఈరోజు ఒక చిన్న పొరపాటు మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపారులు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేస్తున్న ఏదైనా పని అకస్మాత్తుగా చెడిపోవచ్చు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, మీరు మీ కుటుంబ సభ్యుల ఆమోదం పొందొచ్చు. మీరు ఇప్పటికే వివాహం చేసుకుంటే, మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ మానసిక అనుబంధం పెరుగుతుంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేసుకోకుండా చూసుకోవాలి. ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది, కాబట్టి మీ ముఖ్యమైన పనులపై శ్రద్ధ వహించండి. ఈరోజు మీరు అకస్మాత్తుగా అధికారిక పర్యటనకు వెళ్లవలసి రావొచ్చు. మీ ఈ ప్రయాణం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసే వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీరు పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకోవద్దు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీకు తల్లిదండ్రుల పూర్తి మద్దతు ఉంటుంది. దీంతో పాటు తోబుట్టువులతో అనుబంధం బలపడుతుంది. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఈరోజు జీవిత భాగస్వామి నుండి ఆర్థిక లాభాలు సాధ్యమే. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:55 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో కొందరికి ఈరోజు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు. చిన్న సమస్య వచ్చినా పట్టించుకోకపోవడమే మంచిది, లేకుంటే ఇబ్బందుల్లో పడొచ్చు. ఇది కాకుండా, ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే, వారి ఆరోగ్యంపై కూడా మీరు శ్రద్ధ వహించాలి. వ్యాపారులు పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా న్యాయపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. జీతాలు తీసుకునే వారు ఆఫీసులో తమ మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మీకు అకస్మాత్తుగా పెద్ద ఖర్చు ఉండొచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -21 January 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published: Friday, January 21, 2022, 5:00 [IST]