Latest Updates
-
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది!
Today Rasi Phalalu :ఓ రాశి ఉద్యోగులకు పెండింగ్ పనుల భారం తగ్గుతుంది...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, మాఘ మాసంలో బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు సవాలుగా ఉంటుంది. భాగస్వామితో సమన్వయం చెడిపోవచ్చు. ఆర్థిక పరమైన విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలి. ఉద్యోగస్తులకు ఈరోజు అదనపు పనిని అప్పగించొచ్చు. ఏది ఏమైనప్పటికీ, రాబోయే రోజుల్లో మీరు కచ్చితంగా మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. మీరు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులు అవుతారు. మీరు తక్కువ శ్రమతో మంచి డబ్బు పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీరు మంచి ఫలితాలను పొందొచ్చు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద డీల్ చేయబోతున్నట్లయితే, ఈరోజు మీరు విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. మీ వ్యాపారం పెరగొచ్చు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు మీ ప్రియమైన వారితో చాలా శృంగార సమయాన్ని గడుపుతారు.మీరు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు రుణ లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులను గుడ్డిగా నమ్మడం మానుకోండి. ఇది కాకుండా, మీరు మీ రహస్య సమాచారాన్ని వారితో పంచుకోవడం కూడా నివారించాలి. ఈరోజు, వ్యాపారవేత్తలు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వారు మీ ఏదైనా ముఖ్యమైన పనిని అడ్డుకోవచ్చు. అదనంగా, మీరు ఆర్థికంగా కూడా నష్టపోవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామి యొక్క మారిన ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ సంభాషణ ద్వారా వారి మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు. మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చు చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉండొచ్చు.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 38
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉండొచ్చు. పాత ఆస్తిని విక్రయించడం వల్ల మీరు మంచి ఆర్థిక లాభాలను పొందే బలమైన అవకాశం ఉంది. మీ తండ్రి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. అయితే ఒత్తిడికి దూరంగా ఉండాలి. మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ తప్పుడు వైఖరి మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. మీరు పూర్తి విశ్వాసంతో ఉండాలి. వ్యాపారులకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు జ్వరం, జలుబు మొదలైన సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారిలో హోటళ్లు లేదా రెస్టారెంట్లకు సంబంధించి పనిచేసే వారికి ఈరోజు చాలా మంచి రోజు. మీరు భారీ ఆర్థిక లాభాలను పొందొచ్చు. మరోవైపు, ఉద్యోగస్తులు ఈరోజు తమ పురోగతికి సంబంధించిన శుభవార్తలను పొందొచ్చు. ఇదంతా మీ కష్టానికి ఫలితం. భవిష్యత్తులో కూడా ఇలాగే కష్టపడి పని చేయండి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంట్లోని యువకులతో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి ఆర్థిక ప్రయోజనాలు సాధ్యమవుతాయి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పనిలో ఏదైనా అడ్డంకి ఉండొచ్చు. కానీ త్వరలో మీ సమస్య పరిష్కరించబడుతుంది. మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. వ్యాపారస్తులు ఈరోజు తమ నిర్ణయాలను తెలివిగా తీసుకోవాలి. మీ తొందరపాటు నిర్ణయం మీ ఇబ్బందులకు కారణం కావొచ్చు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. చాలా కాలం తర్వాత, మీకు ఇష్టమైన వంటకాలను కూడా ఆస్వాదించే అవకాశం మీకు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 6:55 నుండి సాయంత్రం 4 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో వ్యాపారులు ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయబోతున్నట్లయితే,మీ పనిని జాగ్రత్తగా చేయాలి. లేకపోతే మీకు నష్టం జరగొచ్చు. మరోవైపు, ఉద్యోగస్తులు కార్యాలయంలో పూర్తి నమ్మకంతో ఉండాలి. ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాన్ని పొందకపోతే, మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, ఈరోజు మీ సమస్య పరిష్కరించబడుతుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు కొంత డబ్బు కొన్ని మతపరమైన పనులకు ఖర్చు చేయొచ్చు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు తమ ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు కోపం తెచ్చుకోకుండా ఉండాలి, లేకపోతే మీ పని ప్రభావితం కావచ్చు. స్టాక్ మార్కెట్, రవాణా, ఆహార పదార్థాలు మొదలైన వాటికి సంబంధించిన పనులు చేసే వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. ఇంటి సభ్యునితో మీకు వాగ్వాదం ఉండొచ్చు. మీ మాటలను చాలా జాగ్రత్తగా వాడండి, లేకుంటే పరిస్థితులు మరింత దిగజారవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు క్షీణత ఉండొచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పనుల జాబితా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా మీరు ఊపిరి పీల్చుకుంటారు. ఈరోజు బాస్ మీ శ్రమను గమనించగలరు. మంచి లాభాల కోసం వ్యాపారులు తమ వ్యాపార నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి. మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయితే, మీరు మీ ఖర్చు చేసే స్వభావాన్ని అరికట్టాలి. తండ్రితో సంబంధంలో సామరస్యం మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు మీ తండ్రి నుండి మంచి బహుమతిని కూడా పొందొచ్చు. మీరు మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 29
లక్కీ టైమ్ : ఉదయం 4:35 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు శారీరకంగా మరియు మానసికంగా చాలా చురుకుగా ఉండాలి. ఈరోజు మీరు కాస్త బిజీగా ఉండొచ్చు. మీకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబ బాధ్యతలు కూడా మీపై ఒత్తిడిని కలిగిస్తాయి. మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. మీ ప్రియమైన వారిపై ఇతరుల కోపాన్ని మీరు బయట పెట్టకపోవడమే మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. మీరు సంపాదించే దానికంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ఉంటే మంచిది. ఈ సమయాన్ని ఆదా చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టండి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో ఉద్యోగులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ పురోగతికి సంబంధించిన సంకేతాలను పొందొచ్చు. ప్రత్యేకించి మీరు విదేశీ కంపెనీలో పని చేస్తే, మీ కష్టానికి అనుగుణంగా ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. చిరు వ్యాపారులు మంచి లాభాలు పొందగలరు. ఈరోజు రోజంతా కస్టమర్ల కదలిక ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టగలరు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ నాన్నగారి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన ఆరోగ్యంలో కొంత మెరుగుదల సాధ్యమవుతుంది. అయితే, ఆ సమయంలో వారు విశ్రాంతి తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో ప్రేమ మరియు అనుబంధం ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండండి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : సాయంత్రం 5:55 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు ప్రత్యర్థులతో చాలా చురుగ్గా ఉంటారు. అటువంటి పరిస్థితిలో, మీరు జాగ్రత్తగా ఉండాలి. పనికి సంబంధించి ఈరోజు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మీకు కొంత వివాదం ఉండొచ్చు. వారు మీకు ఏవైనా సలహాలు ఇస్తే లేదా మీరు చేసిన పనిలో తప్పులు కనుగొంటే, మీరు వారి మాటలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ తప్పుల నుండి నేర్చుకోండి మరియు భవిష్యత్తులో వాటిని పునరావృతం చేయకుండా ఉండండి. వ్యాపారస్తులు ఆర్థికంగా నష్టపోవచ్చు. ఈరోజు ఏదైనా వ్యాపార నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడకండి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. మీకు మైగ్రేన్ సమస్య ఉంటే, ఈరోజు మీ సమస్య పెరుగుతోంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications