Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Today Rasi Phalalu :ఓ రాశి వారికి ఈరోజు మానసికంగా ప్రతికూల ఫలితాలు..!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, ఫాల్గుణ మాసంలో బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో వ్యాపారులకు చాలా మంచిగా ఉంటుంది. మీరు గొప్ప అవకాశాన్ని పొందొచ్చు. ఇనుము వ్యాపారులు ఈరోజు పెద్ద ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో కష్టపడి పని చేయాలి. మీకు ఈరోజు కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి ఈరోజు బాగా ఉండదు. అటువంటి పరిస్థితిలో, మీరు ఎవరితోనైనా వివాదాస్పద అంశాన్ని చర్చించకుండా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు పొదుపుపై దృష్టి పెట్టగలరు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో లక్ష్యంతో పని చేసే వ్యక్తులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా పూర్తవుతాయి. హార్డ్‌వేర్ మరియు ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన పనులు చేసే వ్యక్తులు కూడా ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. మీ పని విదేశీ కంపెనీలకు సంబంధించినది అయితే, ఈ సమయంలో మీరు మీ వ్యాపార నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈరోజు కొందరు అతిథులు ఇంటికి రావొచ్చు. ప్రియమైన వారితో గడిపిన ఈ సమయం మీకు చాలా ప్రత్యేకమైనది. ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచి రోజుగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :19
లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు మీ ప్రియమైన వారితో మీ ప్రవర్తనను చక్కగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు కుటుంబ వివాదాలకు దూరంగా ఉండాలి. లేకుంటే కుటుంబ సభ్యులతో విడిపోయే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీకు ఆర్థిక పరంగా చాలా ఖరీదైనది. మీరు పాత బిల్లు చెల్లించాల్సి రావచ్చు. ఇది కాకుండా, ఈరోజు మీరు చిన్న రుణాలను కూడా తిరిగి చెల్లించొచ్చు. ఈరోజు మీ ఆఫీసు వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. మీకు పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. తొందరపడి, భయాందోళనలో మీ పని ఏదీ చేయకండి. వ్యాపారులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. ఈరోజు ఏదైనా వ్యాపార ఒప్పందానికి సంబంధించి మనస్సులో గందరగోళం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఈరోజు ఆరోగ్యం క్షీణించే సంకేతాలు ఉన్నాయి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :36
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైన రోజుగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీ పాత పరిచయాల నుండి మీరు ప్రయోజనం పొందొచ్చు. మీరు కోరుకున్న ఉద్యోగం త్వరలో పొందే బలమైన అవకాశం ఉంది. వ్యాపారస్తులు మంచి లాభాలను ఆశించొచ్చు. కొత్త వ్యక్తులతో వ్యాపారం చేసే అవకాశం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయి. ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మీరు పెద్ద లాభాలను పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీకు దంతాలకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :15
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారు ఈరోజు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీరు గాయపడొచ్చు. సేల్స్ మరియు మార్కెటింగ్‌కి సంబంధించిన పని చేసే వ్యక్తులకు ఈ రోజు చాలా కష్టమైన రోజు. సులువుగా పూర్తి చేసే పనులు కూడా ఈరోజు చాలా కష్టాలతో పూర్తి చేస్తారు. మరోవైపు, మీరు భాగస్వామ్యంతో ఏదైనా కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే, మీరు ఆర్థిక పరిమితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ ఇంటి వాతావరణం బాగా ఉండదు. మీరు వైద్యులు మరియు మందుల కోసం కూడా చాలా డబ్బు ఖర్చు చేయొచ్చు. ఈరోజు మీరు మానసికంగా ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :36
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. చిన్నపాటి అజాగ్రత్త పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వాదనలకు దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు చాలా సవాలుగా ఉండే రోజు. మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. అలాగే సీనియర్ అధికారుల ఒత్తిడి కూడా మీపై పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు చిన్న పొరపాట్లు చేయకుండా ఉండాలి. అలాగే వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ సంబంధంలో ప్రేమ మరియు మాధుర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అవసరానికి మించి ఖర్చు చేయడం మానుకోండి. మీకు కాలేయానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, మీ ఆహారంలో మరింత శ్రద్ధ వహించండి.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ :28
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:05 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు పని సంబంధిత ప్రయాణం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. మరోవైపు, ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. చాలా కాలం తర్వాత, ఈరోజు మీరు మీ పనిపై సరిగ్గా దృష్టి పెట్టగలరు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే, ఎక్కువ ఒత్తిడికి దూరంగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :26
లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో మీడియా మరియు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచి రోజు. మీరు అద్భుతమైన విజయాన్ని పొందొచ్చు. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే సూచనలున్నాయి. అదే సమయంలో, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల వ్యాపారం కూడా పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనట్లు కనిపిస్తున్నాయి. ఇంటి సభ్యులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. మీరు భవిష్యత్తులో మీ ప్రియమైన వారితో కలహాలు, విబేధాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ బడ్జెట్ కంటే ఎక్కువ దూరం వెళ్లొద్దు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద పెట్టుబడి పెట్టబోతున్నట్లయితే, అనుభవజ్ఞులైన వారితో సంప్రదించకుండా ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడమే మంచిది. చిరు వ్యాపారులు న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈరోజు మిశ్రమ దినంగా ఉంటుంది. ఈరోజు కార్యాలయంలో మీ పని ఏదైనా అసంపూర్తిగా ఉంటే, అది మీ పురోగతిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరు అలాంటి తప్పు చేయకుండా ఉండటం మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. తల్లిదండ్రులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈరోజు మీ ఆరోగ్యం బాగా ఉండదు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :19
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో బాస్ నుండి మద్దతు పొందుతారు. మీరు మీ బాధ్యతలను పూర్తి శ్రమతో మరియు అంకితభావంతో నెరవేరుస్తారు. బాస్ కూడా మీ హార్డ్ వర్క్ చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. వ్యాపారులకు ఈరోజు మిశ్రమ దినంగా ఉంటుంది. మీరు అనవసరంగా పరుగెత్తవలసి రావొచ్చు. ఇది కాకుండా, నిలిచిపోయిన డబ్బు రాకపోవడం వల్ల, డబ్బుకు సంబంధించిన ఆందోళనలు కూడా ఈరోజు మిమ్మల్ని వెంటాడతాయి. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. పెరుగుతున్న కోపం మరియు ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :8
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:55 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమయ్యే వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీకు మంచి అవకాశం లభించొచ్చు. మరోవైపు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కూడా తమ కష్టానికి తగిన ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీ ముఖ్యమైన పనుల్లో వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ప్రియమైన వారితో ఈరోజు నవ్వుతూ గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు చాలా మంచి మూడ్‌లో ఉంటారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత ఆటంకం ఏర్పడుతుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :30
లక్కీ టైమ్ : ఉదయం 4:10 నుండి మధ్యాహ్నం 3:50 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీరు తీవ్రంగా ప్రయత్నించాల్సి ఉంటుంది. మరోవైపు, మీరు ఉద్యోగంతో మీ సొంత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ముఖ్యంగా మీరు మీ ఆర్థిక పరిస్థితిని గమనించాలి. సంఘర్షణ పరిస్థితిని మరింత దిగజార్చొచ్చు. మీ జీవిత భాగస్వామికి మానసిక మద్దతు లభిస్తుంది. మీ ప్రియమైన వారు కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఉంటారు. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే ఈరోజు మీ ఆరోగ్యం క్షీణించొచ్చు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :14
లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 8 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











