For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు కొత్త పనిని ప్రారంభించేందుకు సమయం అనుకూలం...!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Shukra Gochar May 2022:మేషంలోకి శుక్రుని ప్రవేశంతో..ఈ రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది...!Shukra Gochar May 2022:మేషంలోకి శుక్రుని ప్రవేశంతో..ఈ రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు పూర్తి అంకితభావంతో పని చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు మందులు మరియు వైద్యుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఒడిదుడుకుల కారణంగా పరిస్థితులు క్లిష్టంగా మారొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతున్నట్లయితే, ఈరోజు మీకు చాలా ముఖ్యమైన రోజు కానుంది. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ జీవిత భాగస్వామితో కొంత ఇబ్బందులు ఉండొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అజాగ్రత్తగా ఉండొద్దు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది. ఉద్యోగులు ఆఫీసులో ఉన్నత స్థానంలో పని చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు ప్రణాళిక ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి కోసం తగినంత సమయాన్ని వెచ్చించగలరు. మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

ఈ 6 రాశుల వారు ప్రేమ విషయంలో చాలా లక్కీ...! ఈ జాబితాలో మీ రాశి ఉందా?ఈ 6 రాశుల వారు ప్రేమ విషయంలో చాలా లక్కీ...! ఈ జాబితాలో మీ రాశి ఉందా?

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు మంచి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీకు చాలా మంచిగా ఉంటుంది. మీకు పెద్ద కంపెనీ నుండి జాబ్ ఆఫర్ రావొచ్చు. మీరు ఇంటర్వ్యూ కోసం వెళ్తుంటే, మీ ప్రిపరేషన్లో ఎలాంటి లోటు ఉండకూడదు. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు పెద్ద డీల్ చేయబోతున్నట్లయితే, ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఇంటి సభ్యుల నుండి మానసిక మద్దతు ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కీళ్లనొప్పుల సమస్య ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారికి ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పని వేగంగా సాగుతుంది. మీరు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు ఇటీవల కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, ఈరోజు మీకు మరిన్ని మంచి అవకాశాలు రావొచ్చు. ఉద్యోగులకు ఈరోజు గొప్ప ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు కష్టపడి పని చేయాలి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:05 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, మీకు మంచి వివాహ ప్రతిపాదన రావొచ్చు. త్వరలో మీ ఇంట్లో పెళ్లి కార్యక్రమం జరగొచ్చు ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ ఆదాయానికి మించి ఖర్చు చేయకుండా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారిపై పని భారం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ పనిని నిదానంగా మరియు ప్రశాంతమైన మనసుతో పూర్తి చేయాలి. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడొచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :21

లక్కీ టైమ్ : ఉదయం 11:15 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

Astro Tips for Money:ఈ చిట్కాలతో మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం...!Astro Tips for Money:ఈ చిట్కాలతో మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో కొంత పనిభారం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో, ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపాలి. మరోవైపు వ్యాపారులు ఈరోజు మంచి ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :28

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12:05 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో బాస్ యొక్క మానసిక స్థితి చాలా చెడ్డగా ఉంటుంది. మీరు వారి కోపాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మీ మనసులో అనేక ప్రతికూల ఆలోచనలు వస్తాయి. మీరు ఉద్యోగం మానేయాలని కూడా నిర్ణయించుకోవచ్చు. వ్యాపారులు ఈరోజు చర్చలకు దూరంగా ఉండాలి. ప్రత్యేకించి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, తగాదాలకు దూరంగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. తల్లిదండ్రులు మీతో సంతోషంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :8

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 7:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఫైనాన్స్ వ్యాపారులకు ఈరోజు చాలా సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఆలోచించకుండా ఏ పనీ చేయొద్దు. ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు తెలివిగా ఖర్చు చేస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. మీ ఇంటి సభ్యులతో గొడవలు, అహంకారం మానుకోవాలి. మీరు మీ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ :19

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు న్యాయపరమైన చిక్కులకు దూరంగా ఉండాలి. మీ వ్యాపార నిర్ణయాలను తెలివిగా తీసుకోవాలి. భవిష్యత్తులో మీరు చింతించాల్సిన పనిని చేయకండి. మీరు ఇటీవల ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే, కొత్త వ్యూహాలను రూపొందించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పెరుగుతున్న పనిభారం కారణంగా కొంత ఒత్తిడిని అనుభవిస్తారు. ఉద్యోగులు ఈరోజు మీ ప్రవర్తనను బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి. మీరు ఎక్కువ ఒత్తిడిని తీసుకుంటే, అది మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. వ్యాపారులకు ఈరోజు పెద్ద పెట్టుబడి ఉంటుంది. మీరు ఈరోజు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలనే మానసిక స్థితిలో ఉన్నట్లయితే, మీరు దానిని నివారించాలి. మీ ఆర్థిక పరిస్థితి క్షీణించొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ సహోద్యోగులను గుడ్డిగా విశ్వసించడం మానుకోవాలి. మీరు కొన్ని రాజకీయాల బారిన పడొచ్చు. వ్యాపారులు తమ ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వగలరు. మీరు ఇటీవల మీ వ్యాపార ప్రణాళికలలో కొన్ని మార్పులు చేసినట్లయితే, మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీకు పిల్లల వైపు నుండి సంతోషం ఉంటుంది. విద్యారంగంలో మీ పనితీరు బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు మంచి అనుభూతి పొందుతారు.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :22

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -23 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Saturday, May 21, 2022, 23:56 [IST]
Desktop Bottom Promotion