Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Today Rasi Phalalu :ఓ రాశి వారికి అకస్మాత్తుగా ధన నష్టం.. కొన్ని రాశుల వ్యాపారులకు లభాలు...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, పుష్య మాసంలో మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీ ఖర్చులు పెరగడం వల్ల ఆకస్మికంగా ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ధనానికి సంబంధించిన విషయాల్లో తెలివిగా నిర్ణయం తీసుకోండి. మీ వైవాహిక జీవితం విషయానికొస్తే..మీ జీవిత భాగస్వామికి గరిష్ట సమయం ఇవ్వండి. ఇది మీ వైవాహిక జీవితాన్ని మంచి ట్రాక్‌లో ఉంచుతుంది, అలాగే ఒకరితో ఒకరు గడపడం వల్ల మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ప్రేమ మరియు ఉత్సాహం శృంగార జీవితంలో ఉంటాయి. మీరు మీ పని గురించి ఆందోళన చెందుతుంటే, ఈరోజు మీరు ఈ సమస్య నుండి బయటపడొచ్చు. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 30
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుంది. మీ శృంగార జీవితానికి సంబంధించి, మీరు మీ భాగస్వామిని అనవసరంగా అనుమానించకుండా ఉండాలి. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ ఖర్చులు పెరగడం వల్ల కాస్త ఇబ్బంది పడినా పెద్దగా ఇబ్బందీ ఉండదు. మీ పెండింగ్ పనులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు రిఫ్రెష్‌గా మరియు శక్తివంతంగా ఉంటారు. ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు, మీరు జాగ్రత్తగా ఆలోచించి, వాటి పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 35
లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు గొప్ప ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మానసిక మద్దతు పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మీ ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీరు ఒక సాధువు యొక్క ఆశీర్వాదాలను పొందుతారు. ఇది మీకు సానుకూల అనుభూతిని ఇస్తుంది. మరోవైపు వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. మీరు నిరుద్యోగులు మరియు చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీ శోధన ఈరోజుతో ముగియవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : సాయంత్రం 6:45 నుండి రాత్రి 9:15 గంటల వరకు
Makar Sankranti 2022 Horoscope:మకరంలోకి సూర్యుడి రవాణా.. 12 రాశులపై పడే ప్రభావం...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో పనిపై దృష్టి పెట్టకపోతే, ఈరోజు ఉన్నతాధికారులు మీపై కోపం తెచ్చుకుంటారు. అందుకు సంబంధించిన తప్పుడు పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా, ఈరోజు మీకు కొన్ని గొప్ప అవకాశాలను తెస్తుంది. ఈరోజు మీరు డబ్బుకు సంబంధించిన ఆందోళనల నుండి విముక్తి పొందుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ వల్ల బాధపడతారు. మీరు మీ ప్రియమైన వారిని ప్రేమతో చూసుకోవాలి. ఈరోజు మీరు అద్భుతమైన సాయంత్రం కోసం స్నేహితులతో బయటికి వెళ్లొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారు ఈరోజు అనేక విషయాల్లో ఆందోళన చెందుతారు. మీ ఇంట్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీ ఖర్చులు కాస్త పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. మీరు మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయొచ్చు. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. పని విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వ్యక్తులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అటువంటి పరిస్థితిలో, మీరు మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం చేయాలి. మీరు వ్యాపారం చేస్తుంటే, ఈరోజు మీరు పెద్ద వ్యాపార నిర్ణయాలను తీసుకోవద్దు. ఈరోజు రిటైల్ వ్యాపారులు లాభపడొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు గొంతు సంబంధిత సమస్యలతో బాధపడొచ్చు. ఈ సమయంలో మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 26
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మద్దతుతో, మీ యొక్క ఏదైనా ముఖ్యమైన పనిని ఈరోజు పూర్తి చేయవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. వీలైతే మీ పిల్లలతో కొంత సమయం గడపండి. మీరు మంచి అనుభూతి చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. అనవసరంగా చింతిస్తూ మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి. లేకుంటే మీరు పశ్చాత్తాపపడతారు. ఆరోగ్యం పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ రెడ్
లక్కీ నంబర్ : 45
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తొచ్చు. ఆర్థిక పరమైన విషయానికొస్తే, ఈరోజు మీ ఖర్చులు కాస్త పెరగొచ్చు. మీరు మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయొచ్చు. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. పని విషయంలో, ఈరోజు బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వ్యక్తులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అటువంటి పరిస్థితిలో, మీరు మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం చేయాలి. వ్యాపారులు ఈరోజు పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు రిటైల్ వ్యాపారులు లాభపడొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా సమస్య ఉంటే మీరు వైద్యుడిని సంప్రదించాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 7:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీ యజమాని చెడు మానసిక స్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి సోమరితనాన్ని విడిచిపెట్టి, మీ పనిపై దృష్టి పెట్టండి. మీ సహోద్యోగులతో ఎలాంటి గాసిప్‌లకైనా దూరంగా ఉండాలి. వ్యాపారులకు పెద్దగా లాభం ఉండదు. వ్యక్తిగత జీవితంలో మీ జీవిత భాగస్వామి యొక్క నిజాయితీని అనవసరంగా అనుమానించకండి. అది మీ సంబంధంలో చీలికను కలిగిస్తుంది. సంబంధాల పునాది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. మీ శృంగార జీవితంలో ప్రేమ మరియు అనుబంధం ఉంటుంది. మీ భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల కారణంగా ఈరోజు మనసులో అనేక ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : ఉదయం 7:25 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో కొందరికి ఈరోజు కుటుంబ పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీ ఇంటి సభ్యులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ మనోభావాలను దెబ్బతీయొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు కొంత మెరుగుదల ఉండొచ్చు. తండ్రి వైపు నుండి లాభం ఉంటుంది. అదనపు పనిభారంతో అలసిపోకండి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తే మంచిది. మీరు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. దీనితో పాటు జీవిత భాగస్వామితో ప్రేమ కూడా పెరుగుతుంది. మీరు సాయంత్రం కొన్ని శుభవార్తలను వినడం వల్ల సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు చాలా మంచి రోజు. మీ చదువులో ఎలాంటి ఆటంకాలు వచ్చినా తొలగిపోతాయి. మీ శక్తి స్థాయిని పెంచుకోవడానికి, మీరు పనితో పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఇది కాకుండా, ప్రతిరోజూ వ్యాయామం చేయండి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ నిలిచిపోయిన డబ్బును పొందడం ద్వారా మీరు ఈరోజు గొప్ప ఉపశమనం పొందుతారు. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందొచ్చు. మీరు పెద్ద పెట్టుబడులను పెట్టేందుకు ఈరోజు మంచి రోజు. సరైన సలహాతో, మీరు ఈ దిశలో మీ అడుగు వేయొచ్చు. మీరు ఆఫీసులో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. ఇతరులపై నిందలు వేయడం మానుకోండి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంటి సభ్యుల మద్దతు వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యుత్తమ రోజులలో ఒకటిగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 4:20 నుండి రాత్రి 9:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు జీవిత భాగస్వామితో వివాదాలు ఉండొచ్చు. మీ ఇంటి వాతావరణం బాగా ఉండదు. మీ పిల్లలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. మీ మాటలపై శ్రద్ధ వహించండి. ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు, మీరు మీ సంబంధంలో పారదర్శకతను కొనసాగించాలి. అబద్ధం చెప్పడం మానుకోండి. ఈరోజు మీ ముఖ్యమైన పనిలో కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ పూర్తవుతాయి. ఇది మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఆర్థిక పరంగా మీ నిర్ణయాలు తెలివిగా తీసుకుంటే, ఈరోజు మీరు మంచి లాభాలను పొందొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహారం మరియు పానీయాల పట్ల శ్రద్ధ వహించాలి. కడుపు సంబంధిత వ్యాధులు మిమ్మల్ని బాధపెడతాయి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు సంభాషణలో మీ నైపుణ్యం మరియు మీ అవగాహన నుండి పెద్ద ప్రయోజనాన్ని పొందొచ్చు. మీ అనవసరమైన ఒత్తిడి మానసిక ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి చర్చకు దూరంగా ఉండాలి. లేకుంటే చిన్నపాటి సమస్యలకే పెద్ద సమస్యలు ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు తెలివిగా ఖర్చు పెట్టాలి. కష్టపడి సంపాదించిన డబ్బు మీ చేతుల్లోంచి సులభంగా జారిపోయే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా శృంగార సమయాన్ని గడుపుతారు.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 1:25 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











