For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి..!

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత' నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసంలో శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -25 June 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Shukra Rashi Parivartan 2022:వృషభంలోకి శుక్రుడి సంచారం.. రాశిచక్రాలపై పడే ప్రభావం...!Shukra Rashi Parivartan 2022:వృషభంలోకి శుక్రుడి సంచారం.. రాశిచక్రాలపై పడే ప్రభావం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వ్యాపారులకు అద్భుతమైన రోజు కానుంది. మీరు షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాన్ని పొందొచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, భాగస్వామితో మీ అనుబంధం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ సౌకర్యాలు పెరగవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు ఆరోగ్యం పరంగా మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బుకు సంబంధించిన ఏ పనీ చేయకుండా ఉంటేనే మంచిది. పని గురించి మాట్లాడేటప్పుడు, ఈరోజు కార్యాలయంలో మీ పని పట్ల బాస్ కొంత అసంతృప్తిగా ఉంటారు. మీరు చేసిన పనిలో వారు కొన్ని లోపాలను కూడా కనుగొనవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు సహనంతో మరియు అవగాహనతో వ్యవహరించాలి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను ఆర్జించగలరు. ప్రత్యేకించి మీ పని ఆస్తికి సంబంధించినది అయితే, మీరు పెద్ద లాభాలను ఆశించొచ్చు. మీ జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారిపై మీ విశ్వాసం పెరుగుతుంది. మీ ఆరోగ్యం క్షీణించొచ్చు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:55 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో చాలా మంచిగా ఉంటుంది. మీరు మీ భాగస్వామిని వివాహానికి ప్రపోజ్ చేయాలనుకుంటే, ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో, ఈ రాశికి చెందిన వివాహితులకు ఈరోజు ప్రత్యేకమైన రోజు కానుంది. మీ వైవాహిక జీవితంలోని పాత అందమైన జ్ఞాపకం మరోసారి రిఫ్రెష్ అవుతుంది. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. మీరు పిల్లల చదువు మొదలైనవాటికి కొంత డబ్బు వెచ్చించొచ్చు. పని పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండాలి. ఉద్యోగులు నీరసం, సోమరితనం విడిచిపెట్టి తమ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యం గురించి ఎక్కువగా చింతించకండి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ఈ 5 రాశుల వారు రహస్యాలను ఎప్పటీకీ వేరే వాళ్ళతో చెప్పరు..! ఈ 5 రాశుల వారు రహస్యాలను ఎప్పటీకీ వేరే వాళ్ళతో చెప్పరు..!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం మీ సమస్యలను పెంచుతుంది. ఉద్యోగులు కార్యాలయంలోని ఉన్నతాధికారులతో గౌరవంగా ప్రవర్తించాలి. వారి మాటలను పట్టించుకోకుండా తప్పు చేయకండి, లేకుంటే నష్టం మీకే. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడటంతో, మీ పెద్ద చింతలు తొలగిపోతాయి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది. డబ్బుకు సంబంధించిన మీ నిరంతర ప్రయత్నాలలో మీరు విజయం పొందొచ్చు. త్వరలో మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం విషయానికొస్తే, ఈరోజు మీకు డీహైడ్రేషన్ సమస్య ఉండొచ్చు.

లక్కీ కలర్ : కుంకుమ పువ్వు

లక్కీ నంబర్ :30

లక్కీ టైమ్ :ఉదయం 9:35 నుండి సాయంత్రం 5 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఈ కారణంగా మీరు మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టలేరు. మీకు కార్యాలయంలో చాలా కాలంగా ఏదైనా పని పెండింగ్‌లో ఉంటే, ఈరోజే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆన్‌లైన్ వ్యాపారం చేసే వ్యక్తులు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. మీ వ్యాపారం పెరగొచ్చు. తల్లిదండ్రుల నుండి మీకు మానసిక మద్దతు ఉంటుంది. డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఆలోచించకుండా ఖర్చు చేయడం మానుకోండి. మీకు కీళ్లనొప్పుల ఫిర్యాదు ఉంటే, ఈరోజు మీ ఆరోగ్యం బాగా ఉండదు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :23

లక్కీ టైమ్ :మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రణాళిక ప్రకారం పనులన్నీ పూర్తవుతాయి. మీరు కొత్త వాహనం లేదా ఇంటిని కొనొచ్చు. ఇది కాకుండా, ఈరోజు మీరు పాత కుటుంబ రుణాన్ని తొలగించడంలో కూడా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈరోజు పురోగతి లభిస్తుంది. వ్యాపారులు కూడా మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో సమస్య ఉండొచ్చు. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు వారితో చాలా సరదాగా గడుపుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : ఉదయం 4:30 నుండి ఉదయం 11 గంటల వరకు

Surya Gochar 2022 :మిధునంలోకి సూర్యుని రవాణాతో ఏ రాశులపై ఎలాంటి ప్రభావమంటే...! Surya Gochar 2022 :మిధునంలోకి సూర్యుని రవాణాతో ఏ రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందొచ్చు. మీరు వ్యాపారులైతే, భారీ పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఇది కాకుండా, మీ వ్యాపార ప్రణాళికలలో మార్పులు చేసే ముందు, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అదనపు పనిని కేటాయించొచ్చు. ఈరోజు అనేక పనులను ఒకేసారి పరిష్కరించేందుకు మీపై ఒత్తిడి ఉంటుంది. పెరుగుతున్న ఖర్చులు కూడా మీ టెన్షన్‌ని పెంచుతాయి. ఈరోజు మీరు కూడా రుణం తీసుకోవలసి రావచ్చు. అలాంటి వాటిని నివారించడానికి, మీరు మీ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండాలి. మీ ఇంట్లో వాతావరణం సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు తమ వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించొచ్చు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ముగుస్తాయి మరియు ఈ రోజు మీరు ఒకరినొకరు మళ్లీ అర్థం చేసుకునే అవకాశాన్ని పొందొచ్చు. మీ మనస్సులో ఏదైనా ప్రశ్న ఉంటే, మీరు దానిని మీ ప్రియమైన వారితో స్వేచ్ఛగా పంచుకోవచ్చు. అవివాహితులకు ఈరోజు వివాహ ప్రతిపాదన రావొచ్చు. త్వరలో మీ జీవిత భాగస్వామి కోసం అన్వేషణ ముగుస్తుంది. పని విషయంలో ఈరోజు మీకు చాలా బిజీగా ఉంటుంది. మీరు ఆఫీసులో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వస్తే, మీ సన్నాహాల్లో ఏ విధంగానూ లోటు ఉండకూడదు, లేకుంటే మీ పురోగతికి ఆటంకం ఏర్పడొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అశ్రద్ధ వహించొద్దు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు మంచి విజయాన్ని పొందొచ్చు. ఈరోజు మీ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో బాస్ మద్దతు లభిస్తుంది. మీ ముఖ్యమైన పనిలో ఏదైనా ఆటంకం కలిగితే, ఈరోజు మీ సమస్య కూడా పరిష్కరించబడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించి ఏదైనా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులతో సంబంధం బలంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే, మీరు మీ వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో దూరం పెరగొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :8

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి 7:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఉన్నత పదవిని పొందొచ్చు. మరోవైపు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కూడా వారి కష్టానికి తగిన ఫలితాలను పొందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయితే, మీరు రుణాలు ఇవ్వకుండా ఉండవలసి ఉంటుంది లేకపోతే మీ డబ్బు చాలా కాలం పాటు నిలిచిపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉంటాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :13

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలున్నాయి. మీ ఆదాయం పెరగొచ్చు. మీ సంచిత మూలధనం కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇదే ఆలోచనతో మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఉద్యోగులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీరు విదేశీ కంపెనీలో ఉద్యోగం సంపాదించినట్లయితే, మీరు పెద్ద ప్రమోషన్ పొందొచ్చు. వ్యాపారవేత్తలు వారి కొత్త ఆలోచనలు మరియు కొత్త ప్రణాళికల నుండి మంచి ప్రయోజనాలను పొందొచ్చు. మీ వ్యాపారం పుంజుకుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామిని ప్రేమ మరియు గౌరవంతో చూడాలి. అనవసరమైన కోపం మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :8

లక్కీ టైమ్ :సాయంత్రం 6 నుండి రాత్రి 9:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అది వ్యక్తిగతమైనా లేదా వృత్తిపరమైన జీవితమైనా, మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మీ ఇంటి వాతావరణం బాగా ఉండదు. తల్లి లేదా తండ్రి ఆరోగ్యంలో ఆకస్మిక క్షీణత ఉండొచ్చు. ఈరోజు ఆఫీసులో మీ మానసిక స్థితి చాలా చెడ్డగా ఉంటుంది. ఈ రోజు మీ పనిని అసంపూర్తిగా ఉంచకుండా ఉండటం మంచిది. వ్యాపారస్తులు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా ప్రత్యర్థులతో కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు విద్యార్థి అయితే, మీ చదువులో ఏదైనా ఆటంకం ఉంటే, ఈరోజు మీ సమస్యను అధిగమించొచ్చు. మీరు శ్రద్ధగా చదువుకోగలుగుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ గృహ ఖర్చులు పెరగొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ :ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -25 June 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Friday, June 24, 2022, 16:10 [IST]
Desktop Bottom Promotion