For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఓ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి..!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత' నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసంలో ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -26 June 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Shukra Rashi Parivartan 2022:వృషభంలోకి శుక్రుడి సంచారం.. రాశిచక్రాలపై పడే ప్రభావం...!Shukra Rashi Parivartan 2022:వృషభంలోకి శుక్రుడి సంచారం.. రాశిచక్రాలపై పడే ప్రభావం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. త్వరలో మీ ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి. ఉద్యోగులు ఈరోజు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీ ఈ ప్రయాణం చాలా ముఖ్యమైనది. మరోవైపు వ్యాపారులు ఈరోజు మిశ్రమ లాభాలను పొందొచ్చు. మీరు పన్ను సంబంధిత విషయాలలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఒకరికొకరు మీలో మానసిక అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9:25 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఇంట్లో లేదా కార్యాలయంలో అయినా, ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు. కాబట్టి మీరు పొదుపుపై ​​దృష్టి పెడితే మంచిది. ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో బాస్ నుండి కొన్ని మంచి సూచనలు అందుతాయి. మీరు వారి మాటలపై శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపారులు అనవసరంగా పరుగులు తీయాల్సి రావొచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ :మధ్యాహ్నం 12:20 నుండి రాత్రి 9:05 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీరు గతంలో మీ కష్టానికి తగిన ఫలితాలను పొందొచ్చు. ఈరోజు కార్యాలయంలో మీ ప్రమోషన్‌కు సంబంధించిన శుభవార్త మీకు అందే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, ఈరోజు మీకు ఎక్కువ బాధ్యతలు ఉండొచ్చు. కానీ మీ శ్రమ వృథా కాదు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. మీ వ్యాపారం పెరుగుతుంది. ఈరోజు మీరు కొన్ని పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయొచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దు. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయానికొస్తే, ఈరోజు తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ :25

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 వరకు

ఈ 5 రాశుల వారు రహస్యాలను ఎప్పటీకీ వేరే వాళ్ళతో చెప్పరు..!ఈ 5 రాశుల వారు రహస్యాలను ఎప్పటీకీ వేరే వాళ్ళతో చెప్పరు..!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో విద్యార్థులు ఈరోజు కొన్ని శుభవార్తలను వినొచ్చు. ప్రత్యేకించి మీరు ఇటీవల ఏదైనా పోటీ పరీక్షకు హాజరైనట్లయితే, మీరు అద్భుతమైన విజయాన్ని సాధించగలరు. ఇది కాకుండా, మీరు ఉన్నత విద్య కోసం ఏదైనా ప్రయత్నం చేస్తుంటే, మీరు విజయం సాధించడానికి బలమైన అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఏదైనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈరోజు బాస్ మీ పట్ల అసంతృప్తిగా ఉంటారు. మీరు వారి కోపాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారస్తులు ఈరోజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు తెలివిగా వ్యవహరించాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ :ఉదయం 4:05 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం మంచిగా ఉంటుంది. కొందరు అతిథులు కూడా మీ ఇంటికి రావొచ్చు. మీకు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. ఈరోజు జీవిత భాగస్వామి ప్రవర్తనలో కూడా మార్పు రావొచ్చు. డబ్బు విషయంలో అధిక గందరగోళాన్ని నివారించండి, ముఖ్యంగా ఇతరులను ఆకట్టుకోవడానికి మీ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయొద్దు. ఉద్యోగులు తమ ముఖ్యమైన ఫైల్‌లను భద్రంగా ఉంచుకోవాలి. ఈరోజు వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. మీకు ఛాతీలో మంట, ఒత్తిడి మొదలైన సమస్యలు ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ :సాయంత్రం 5:05 నుండి రాత్రి 8:55 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో వివాహితులు ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. వారి మనసును తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఒకరికొకరు ఎంత ఎక్కువ సమయం ఇస్తే, మీ బంధం అంత దృఢంగా ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు డబ్బుకు సంబంధించిన ఏ పనీ చేయొద్దు. ఎందుకంటే మీరు నష్టపోవచ్చు. మీరు చాలా కాలం నుండి ఇంట్లో పూజలు, హవనాలు మొదలైనవాటిని నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజు దానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఈరోజు మీరు మీ పనులన్నింటినీ శ్రద్ధగా పూర్తి చేస్తారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ :ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

Surya Gochar 2022 :మిధునంలోకి సూర్యుని రవాణాతో ఏ రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!Surya Gochar 2022 :మిధునంలోకి సూర్యుని రవాణాతో ఏ రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు తమ కుటుంబ విషయాలలో బయటి వ్యక్తుల జోక్యాన్ని అనుమతించకుండా ఉంటే మంచిది. ఇది మీ గృహ సమస్యలను మరింత పెంచుతుంది. మీ జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఉండవచ్చు. మరోవవైపు ఉద్యోగులు ఉన్నతాధికారులతో తమ సాన్నిహిత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. కోపం మరియు అహంకారానికి దూరంగా ఉండాలి. లేకపోతే మీ పని ప్రభావితం కావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే, మీకు అలసట మరియు బలహీనత ఉండొచ్చు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు తక్కువ ప్రయత్నంలో కూడా మంచి విజయాన్ని సాధించగలరు. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయ వాతావరణం చాలా బాగుంటుంది. మీకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీ సానుకూలత మరియు శక్తి ద్వారా మీ సహోద్యోగులు కూడా బాగా ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడి పెట్టేందుకు మంచి అవకాశం లభిస్తుంది. మీరు ధాన్యాలకు సంబంధించిన పనులు చేస్తే, ఈరోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు మంచి పురోగతిని సాధిస్తారు. ఈరోజు మీ పని వేగవంతమవుతుంది మరియు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అభినందనలు వస్తాయి. ఈరోజు సహోద్యోగుల మధ్య మీ స్థానం బలంగా ఉంటుంది. ఇలా కష్టపడుతూ ఉంటే త్వరలోనే ఉన్నత పదవిని కూడా పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఇది కాకుండా, మీరు క్రెడిట్ లావాదేవీలను కూడా నివారించాలి. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారంలో పెరుగుదల ఉండొచ్చు. ఈరోజు మీరు మీ వ్యాపార నిర్ణయాలను తెలివిగా తీసుకోవాలి. ఉద్యోగులు కార్యాలయంలోని అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలి. ఈరోజు మీ పనిని అసంపూర్తిగా ఉంచొద్దు. లేకపోతే రాబోయే రోజుల్లో మీపై ఒత్తిడి పెరగొచ్చు. మీరు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే మరియు ఏదైనా అడ్డంకి మీ మార్గంలో వస్తున్నట్లయితే, ఈరోజు మీ సమస్యను పరిష్కరించే బలమైన అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం చెడిపోవచ్చు. అనవసరంగా అనుమానించే అలవాటు వల్ల మీ వైవాహిక జీవితంలో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో చాలా ప్రత్యేకమైన రోజు కానుంది, ప్రత్యేకించి మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, ఈరోజు మీరు ప్రేమ ప్రతిపాదనను పొందొచ్చు. మరోవైపు ఈ రాశికి చెందిన వివాహితులకు ఈరోజు సవాలుగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో వివాదాలు పెద్ద గొడవగా మారతాయి. ఇది కాకుండా, మీ ప్రియమైనవారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీరు ఒకరినొకరు ప్రేమగా, గౌరవంగా చూసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. పని విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఈరోజు బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే, మీ మార్గంలో అడ్డంకి ఏర్పడవచ్చు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ :మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు తమ ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు అస్సలు తొందరపడొద్దు. మీ ప్రస్తుత ఉద్యోగంపై బాగా దృష్టి పెట్టండి. మీరు త్వరలో మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితిలో పెద్ద పెరుగుదల ఉండొచ్చు. ప్రత్యేకించి మీరు హోటళ్ళు లేదా రెస్టారెంట్లు, ఎలక్ట్రానిక్స్, బంగారం, వెండి, ఆహార వస్తువులు మొదలైన వాటికి సంబంధించిన పనులు చేస్తే, మీరు మంచి లాభాలను ఆశించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈరోజు మీ ప్రియమైన వారితో చాలా మరపురాని రోజు అవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు కాలేయానికి సంబంధించిన ఫిర్యాదును కలిగి ఉంటే, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -26 June 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Saturday, June 25, 2022, 21:18 [IST]
Desktop Bottom Promotion