For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఈ రాశుల ఉద్యోగులకు కష్టానికి తగ్గ ఫలితాలొస్తాయి..!

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Planet Transit in June 2022 :జూన్ నెలలో 5 గ్రహాల రవాణా.. ఏయే తేదీల్లో మారనున్నాయంటే...Planet Transit in June 2022 :జూన్ నెలలో 5 గ్రహాల రవాణా.. ఏయే తేదీల్లో మారనున్నాయంటే...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీ సంకల్పంతో మంచి విజయాన్ని పొందగలరు. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. మీరు ప్రమోషన్ కూడా పొందొచ్చు. మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు కుటుంబంతో ప్రశాంతమైన రోజును ఆనందిస్తారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :22

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో కొన్ని సానుకూల మార్పులను చూస్తారు. ఈరోజు మీకు చాలా మంచిగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటుంటే, ఈరోజు కొన్ని శుభవార్తలు రావొచ్చు. వ్యాపారులకు ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలొస్తాయి. మరోవైపు ఈరోజు మీకు ప్రత్యర్థులు గట్టి పోటీని ఇవ్వొచ్చు. మీ వైవాహిక జీవితంలో కొత్త మరియు అందమైన మలుపు ఉండొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఉదయాన్నే నిద్ర లేవడానికి ప్రయత్నించండి. ఇది మిమ్మల్ని చాలా తాజాగా ఉంచుతుంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6:10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగాన్ని మార్చాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నట్లయితే, ఈ సమయం మంచిగా ఉంటుంది. త్వరలో మీరు మంచి అవకాశాలను పొందొచ్చు. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఆశించిన ఫలితం రాకపోతే, మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు సానుకూలంగా ఉండండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు విద్యకు సంబంధించిన ఏ పనిలోనైనా విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు రావొచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 7:40 గంటల వరకు

Vastu Tips:నిద్రించే వేళ ఇవి అస్సలు దగ్గర ఉంచుకోవద్దు...! ఎందుకంటే చెడు ఫలితాలొస్తాయట...!Vastu Tips:నిద్రించే వేళ ఇవి అస్సలు దగ్గర ఉంచుకోవద్దు...! ఎందుకంటే చెడు ఫలితాలొస్తాయట...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో నిరుద్యోగులు ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొనేటట్లయితే, మీరు చాలా సానుకూలంగా ఉండాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులపై పనిభారం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు తప్పులు చేయకుండా ఉండాలి. మరోవైపు వ్యాపారులు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. అయితే మీ సమస్య త్వరలో పరిష్కరించబడుతుంది. మీరు ఓపిక పట్టాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 11:30 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. మీరు నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి. మీరు ప్రమోషన్ పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ ఇంట్లో వాతావరణం ప్రతికూలంగా ఉంటే, వివాదస్పద విషయాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : తెల్లవారుజామున 4 నుండి ఉదయం 11:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కష్టాలను ఎదుర్కోవచ్చు. మీ విశ్వాసం తగ్గొచ్చు. ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది, కాబట్టి అనవసర విషయాలపై సమయం వృథా చేయకండి. మరోవైపు వ్యాపారవేత్తలు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు విజయం సాధించడానికి బలమైన అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు కొంత విచారంగా ఉండొచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :17

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3:20 గంటల వరకు

Shani Jayanti 2022 Daan: శని మహాదశ కష్టాల నుండి ఉపశమనం కావాలంటే ఇవి దానం చేయండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో మంచిగా ఉండదు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. ఉద్యోగులు ఈరోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు ఏదైనా ఒప్పందాలకు దూరంగా ఉండాలి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :21

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో మంచిగా ఉంటుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఇంటిపెద్దలతో ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మీరు సంపాదించిన దాని కంటే ఎక్కువ ఖర్చు చేయొచ్చు. వ్యాపారులు ఈరోజు ఇతరుల కోరిక మేరకు తమ వ్యాపార నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఏ చిన్న పొరపాటు చేసిన బాస్ కోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, మీ మార్గంలో అనేక అడ్డంకులు రావొచ్చు. మీ విశ్వాసం కూడా తగ్గొచ్చు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:55 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం పెరగొచ్చు. ఈ కాలంలో మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. అయితే మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ సహోద్యోగులతో పాటు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. వ్యాపారులకు ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఆరోగ్య పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 7:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వ్యక్తిగత లేదా పనికి సంబంధించిన జీవితంలో ఆశించిన ఫలితాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి గురవుతారు. మీరు మీ ప్రియమైన వారి మద్దతు పొందుతారు. ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే అజాగ్రత్తగా ఉండొద్దు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :6

లక్కీ టైమ్ : ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -26 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Wednesday, May 25, 2022, 21:59 [IST]
Desktop Bottom Promotion