For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu : ఓ రాశి ఉద్యోగులకు పని నుండి ఉపశమనం కలగొచ్చు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, కార్తీక మాసంలో శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -26 November 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Shani Gochar 2022:శని రవాణా వల్ల ఏ రాశి వారికి శుభం.. ఎవరికి అశుభమో చూసెయ్యండి...Shani Gochar 2022:శని రవాణా వల్ల ఏ రాశి వారికి శుభం.. ఎవరికి అశుభమో చూసెయ్యండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ స్వభావంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఈరోజు మీరు కోపానికి దూరంగా ఉండాలి. లేకుంటే మీరు అనవసరమైన చర్చలలో చిక్కుకుంటారు. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. ఆఫీసులో పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు అన్ని పనులను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కృషి చేయాలి. మీరు మీ పనులన్నీ సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే మంచిది. వ్యాపారులకు ఈరోజు చాలా సవాలుగా ఉండే రోజు. ఈరోజు మీరు పెండింగులో ఉన్న పనిని పూర్తి చేయడానికి రెండింతలు కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీకు గుండెల్లో మంట, ఒత్తిడి మొదలైన సమస్యలు ఉండొచ్చు. మీరు వెంటనే మంచి వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 8:45 నుండి మధ్యాహ్నం 2:20 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన వ్యక్తులు ఈరోజు తొందరపడి ఏ పనీ చేయవద్దు. తొందరపాటుతో తీసుకున్న తప్పుడు నిర్ణయానికి మీరు తప్పుడు పరిణామాలను ఎదుర్కోవలసి రావొచ్చు. ఉన్నతాధికారుల సలహా మేరకు మాత్రమే కార్యాలయంలో నడుచుకోండి. ఈరోజు వారు మీకు పనికి సంబంధించిన ఏవైనా సూచనలు ఇస్తే, మీరు వారి మాటలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచి రోజు కాదు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు పెద్దగా ఆర్థిక లావాదేవీలు చేయకండి. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మీ అపార్థాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించండి. మీ దుష్ప్రవర్తన మీ వైవాహిక జీవితంలో అసమ్మతిని పెంచుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి విద్యార్థులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తుంటే, మీరు విజయం పొందొచ్చు. మరోవైపు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రజలకు కూడా ఈరోజు శుభవార్త అందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు. మీరు అనవసర ఖర్చులను అరికట్టుకోవాలని సూచించారు. హోటల్ లేదా రెస్టారెంట్‌కి సంబంధించిన పనులు చేసే వ్యక్తులు ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. మరోవైపు ఇనుము వ్యాపారులకు కూడా ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీకు లాభాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 4:45 నుండి రాత్రి 8 గంటల వరకు

2022 Yearly Rasi Phalalu : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు అద్భుత విజయాలు సాధిస్తారట...!2022 Yearly Rasi Phalalu : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు అద్భుత విజయాలు సాధిస్తారట...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు చిన్న వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. దీనితో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కూడా పొందొచ్చు. మరోవైపు, మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే మరియు ఇటీవల మీరు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చినట్లయితే, ఈరోజు మీకు సానుకూల సమాధానం వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో కొంత ఒడిదుడుకులు ఎదురవుతాయి. అన్నయ్యలతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఈ సమయంలో మీ ప్రియమైన వారు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు కాలేయానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, ఆహారాన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:45 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను పాటించాలి. మీరు పనితో పాటు, మీ కుటుంబంపై

కూడా తగినంత శ్రద్ధ వహించాలి. మీ అజాగ్రత్త వైఖరి మీ ప్రియమైన వారిని అసంతృప్తికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఇంటి పెద్దల భావాలను గౌరవించండి. ఈరోజు ఉద్యోగులకు చాలా బిజీగా ఉంటుంది. మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు తక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మరోవైపు, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలను పొందొచ్చు. మీరు పెద్ద లాభాల కోసం కష్టపడి పనిచేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, కోపం మరియు ఒత్తిడిని నివారించండి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగులు కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏ కష్టమైన పనినైనా చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీరు బాస్ యొక్క మద్దతు పొందుతారు. అయితే, మీరు అహం వంటి ప్రతికూల భావాలకు దూరంగా ఉండాలి. మీరు సానుకూలంగా ఉండండి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తీవ్రంగా కృషి చేస్తే, మీరు త్వరలో విజయాన్ని పొందిచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు ఆకస్మిక ధనాన్ని అందుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశాన్ని పొందొచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 7:55 గంటల వరకు

Guru Rashi Parivartan 2021:గురుడు కుంభంలోకి ఆగమనం.. రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...!Guru Rashi Parivartan 2021:గురుడు కుంభంలోకి ఆగమనం.. రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ముఖ్యమైన పనిలో కొన్ని ఈరోజు అసంపూర్తిగా ఉండే అవకాశం ఉంది. మీరు పై అధికారుల ఆగ్రహాన్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని విషయంలో అజాగ్రత్తగా ఉండకపోవడమే మంచిది. మీరు గతంలో ప్రమోషన్ రూపంలో మీ కష్టానికి తగిన ఫలితాలను పొందొచ్చు. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. ప్రత్యేకించి మీ పని చెక్కతో కూడుకున్నది అయితే, ఈరోజు మీకు చాలా ముఖ్యమైనది. మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. అనవసరమైన ఘర్షణలు మరియు అహంకారాన్ని నివారించండి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చు చేస్తే బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాకుండా, మీరు మీ ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఈరోజు ఆఫీసులో బాస్ మూడ్ కాస్త హాట్ గా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, పని పట్ల నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈరోజు మంచి రోజు కాదు. మీ వ్యాపారంలో క్షీణత కారణంగా మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. మీరు పెద్దగా ఆందోళన చెందనవసరం లేనప్పటికీ, త్వరలో మీ నష్టాన్ని భర్తీ చేయొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచి రోజుగా ఉంటుంది. రుణాలు తీసుకోవడం మానుకోండి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మీరు ఆరాధనలో శ్రద్ధ పొందుతారు. మీరు మతపరమైన పనులలో పాల్గొనొచ్చు. ఇది కాకుండా, మీరు ఆర్థికంగా కూడా పేదలకు సహాయం చేయొచ్చు. వ్యాపారవేత్తలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండాలి. లేకుంటే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడొచ్చు. మీరు ఆర్థికంగా కూడా నష్టపోవచ్చు. అదే సమయంలో, ఉపాధి కూలీల రోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ తోబుట్టువులతో సంబంధాలు చెడగొట్టవచ్చు. మీరు మీ కోప స్వభావాన్ని మార్చుకోవాలి. మీ సంబంధంలో దూరం ఉండొచ్చు. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, ఈరోజు మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. అలాగే శారీరకంగా మీరు చాలా బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందకపోతే, మీరు మీ ప్రణాళికలను పునరాలోచించుకోవాలి. ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా, ఈ సమయంలో మీరు మీ ప్రతి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుదల సాధ్యమవుతుంది. ఈరోజు మీరు మీ పాత అప్పులలో దేనినైనా చెల్లించడంలో కూడా విజయం సాధిస్తారు. భవిష్యత్తులో, డబ్బు విషయంలో చాలా అజాగ్రత్తగా ఉండకండి. ముఖ్యంగా ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు తొందరపడకుండా ఉంటే మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమ కొనసాగుతుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, మీకు అలెర్జీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు తొందరపడకండి. చేయి లేదా భుజానికి గాయం కావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ఈరోజు పెద్ద సమస్య ఏమీ కనిపించడం లేదు. అయితే, మీరు మీ ఆదాయానికి మించి ఖర్చు చేయకూడదు. ఉద్యోగులకు కార్యాలయంలో పెండింగులో పని భారాన్ని తగ్గించడం ద్వారా మీరు పెద్ద ఉపశమనం పొందవచ్చు. మీరు పై అధికారుల మద్దతు కూడా పొందుతారు. బట్టల వ్యాపారులు ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. మీరు పెద్ద ఆర్డర్ చేయవచ్చు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే చాలా అజాగ్రత్తగా ఉండకండి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు భారీ ఆర్థిక లాభాలను పొందొచ్చు. ఈ రోజు మీరు మీ వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. మీ పని అలాంటి వాటి వల్ల ప్రభావితం కావొచ్చు. ఇతరుల పనిలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీ స్వంత వ్యాపారం చేయండి. ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను కూడా పొందొచ్చు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి చాలా శృంగారభరితంగా ఉంటుంది. మీరు ఈరోజు మీ ప్రియమైన వారితో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి సాయంత్రం 4:50 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -26 November 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Thursday, November 25, 2021, 17:48 [IST]
Desktop Bottom Promotion