Today Rasi Phalalu : ఓ రాశి వ్యాపారులు ఈరోజు పెద్ద ఒప్పందం చేసుకోవచ్చు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, మార్గశిర మాసంలో సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu -27 December 2021 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఈ రోజు బాస్ మిమ్మల్ని నిశితంగా గమనిస్తారు. ఈరోజు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే, మీరు దాని ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు లాభదాయకమైన పరిస్థితి ఉంది, ముఖ్యంగా ఇనుము వ్యాపారులు ఈరోజు పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశాన్ని పొందుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది. తోబుట్టువులతో మీ అన్యోన్య అనుబంధం పెరుగుతుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మోకాళ్లకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. అయితే మీరు తెలివిగా ఖర్చు చేయాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యుల నుండి మానసిక మద్దతు పొందుతారు. తండ్రి సహాయంతో ఈరోజు మీలో ఏ పెద్ద సమస్య అయినా తీరుతుంది. వారి వైపు నుండి ఆర్థిక ప్రయోజనాలు కూడా సాధ్యమే. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో మంచి సామరస్యం ఉంటుంది. మీ ప్రియమైన వారు ఈరోజు మీకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తారు. పని విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు ఈరోజు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే, పనితో పాటు, మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ ప్రియమైనవారి చిన్న పొరపాటు ఈరోజు పెద్ద సమస్యకు దారి తీస్తుంది. అటువంటి పరిస్థితిలో, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఈరోజు మీరు పాత రుణాన్ని తిరిగి చెల్లించడానికి చాలా డబ్బు ఖర్చు చేయొచ్చు. భవిష్యత్తులో మీ ఆర్థికపరమైన నిర్ణయాలు తొందరపాటుగా తీసుకోకపోవడమే మంచిది. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో అహంకారం మరియు ఘర్షణకు దూరంగా ఉండండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. ఇది కాకుండా, మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి. వ్యాపారస్తులు కొద్ది దూరం ప్రయాణించవలసి రావొచ్చు. ఇక్కడ మీ ప్రయాణం చాలా ముఖ్యమైనది. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా ఈరోజు మీ శారీరక ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం లభిస్తుందిద. మీరు మీ పూర్వీకుల ఆస్తిని విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే, త్వరలో మీకు మంచి అవకాశం లభిస్తుంది. మీరు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నట్లయితే, ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. మీరు పురోగతి సాధించవచ్చు. దీంతో పాటు ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది. బట్టల వ్యాపారులు ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. అంతే కాకుండా ఆహార పదార్థాలు, మందులు, కలప, సౌందర్య సాధనాలు మొదలైన వ్యాపారులు కూడా ఆశించిన ఫలితాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 10:50 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారికి ఈరోజు చాలా పరిస్థితుల్లో సానుకూలంగా ఉంటుంది. అయితే పనికిరాని విషయాల గురించి ఆలోచించి మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగించకండి, లేకుంటే అది మీ శారీరక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. మీరు బాగా ఆలోచిస్తే మీకు మంచి జరుగుతుంది. డబ్బు విషయంలో మీరు ఈరోజు కొంత ఉపశమనం దొరకొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ పనితీరుపై బాస్ అసంతృప్తి చెందుతారు. మీరు ఈరోజు కొంత హెచ్చరికను కూడా పొందవచ్చు. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు త్వరలో పెద్ద పురోగతిని సాధించొచ్చు. వ్యాపారులకు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ, ఈరోజు మీరు ఆశించిన ఫలితాన్ని పొందలేరు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. హాబీలు మరియు ఆనందాల కోసం అదనపు డబ్బు ఖర్చు చేయడం మానుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు హెచ్చు తగ్గులతో ఉంటాయి. మీ ఖరీదైన స్వభావం కారణంగా, మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉండొచ్చు. మీ ప్రియమైనవారి మాటలను పట్టించుకోకపోవడమే మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిది కాదు. ఆరోగ్యంలో ఆకస్మిక క్షీణత ఉండవచ్చు. మీరు వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి నుండి అందమైన ఆశ్చర్యాన్ని కూడా పొందొచ్చు. మీ శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీ భాగస్వామితో బంధం బలపడుతుంది. మీరు మీ సంబంధాన్ని కొనసాగించాలని కూడా నిర్ణయించుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో పనులన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా సమయానికి పూర్తవుతాయి. మీ పనితీరుతో బాస్ కూడా సంతృప్తి చెందుతారు. మరోవైపు, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభాలను సంపాదించడానికి తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా గొంతుకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీకు మంచి అవకాశం లభించొచ్చు. మరోవైపు, మీరు ఏదైనా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నట్లయితే, ఈరోజు మీరు పెద్ద విజయాన్ని పొందొచ్చు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ వ్యాపారాన్ని కొనసాగించాలని ప్లాన్ చేస్తుంటే, ఈ సమయం దానికి సరైనది కాదు. మీ మార్గంలో కొన్ని పెద్ద అడ్డంకులు ఉండొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. దీంతో పాటు వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ వైవాహిక జీవితంలో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామికి మీ భావోద్వేగ మద్దతు అవసరం. మీ ప్రియమైన వారిని ప్రేమ మరియు గౌరవంతో చూసుకోండి. మీరు ఇటీవల ఏదైనా శస్త్రచికిత్స లేదా ఆపరేషన్ చేయించుకున్నట్లయితే, మీరు మీ గురించి మరింత జాగ్రత్త వహించాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో బిజీగా ఉంటుంది. ఈరోజు మీరు సోమరితనాన్ని విడిచిపెట్టి, మీ అన్ని ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. మీరు ఏదైనా పొరపాటు చేస్తే రాబోయే రోజుల్లో మీ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ తండ్రితో అనుబంధం బలపడుతుంది. మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో అనుసంధానించబడి ఉంటే, మీ పెద్దల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది కాకుండా, ఈరోజు మీరు లాభాలను సంపాదించడానికి మంచి అవకాశాన్ని కూడా పొందొచ్చు. ఇదే సమయంలో ఉపాధి కూలీల ఆందోళన కొంతమేర పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని కారణాల వల్ల మీ జీతం నిలిచిపోవచ్చు. అయితే మీరు చాలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలో మీ కష్టాలు తీరుతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:05 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు అన్ని ముఖ్యమైన నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇతరుల సలహా మేరకు మీ నిర్ణయాలలో ఏదీ తీసుకోకండి. లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో, మీరు మీ పనిని పూర్తి శక్తితో మరియు ఉత్సాహంతో పూర్తి చేయాలి. పని పట్ల మీ అజాగ్రత్త మీ పురోగతి కలను పాడు చేస్తుంది. మరోవైపు, ఈరోజు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు తక్కువ శ్రమతో పెద్ద ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారితో చాలా సరదాగా గడుపుతారు. ఇంటి సభ్యులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, మీకు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు. ల్యాప్‌టాప్ లేదా మొబైల్ అధికంగా వాడటం మానుకోండి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:50 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. ఈ కారణంగా రోజంతా మీ ప్రణాళికలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. పెద్ద వ్యాపారవేత్తలు తమ కస్టమర్లతో మంచి అనుబంధాన్ని కొనసాగించాలి. మాట్లాడేటప్పుడు మీ మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. ఉద్యోగస్తుల దినచర్య సాధారణంగా ఉంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో విభేదాలు తీవ్రమవుతాయి. ఈరోజు మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. సాయంత్రం మీరు ఒక మతపరమైన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 8:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఈరోజు మీరు మంచి ఫలితాలను పొందొచ్చు. మీరు విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలని కలలుకంటున్నట్లయితే, మీరు విజయం సాధించడానికి బలమైన అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచి రోజు అవుతుందది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సరైన స్థలంలో పెట్టుబడి పెట్టినట్లయితే, మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపాటి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ప్రియమైన వారితో గడిపిన ఈ సమయం మీకు చిరస్మరణీయంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 9:20 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Monday, December 27, 2021, 5:00 [IST]
Desktop Bottom Promotion