Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
Today Rasi Phalalu :ఈ రాశుల వారు ఈరోజు పొదుపుపై ఎక్కువ దృష్టి సారించాలి...
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, మార్గశిర మాసంలో మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ ముఖ్యమైన పనులపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. మీ సానుకూలతతో మీ బాస్ చాలా ఆకట్టుకుంటారు. ఈరోజు మీరు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇది కాకుండా, మీరు కూడా మీతో చాలా సంతృప్తి చెందుతారు. వ్యాపారులు ఈరోజు కొత్త వ్యాపార ఆఫర్‌ను పొందవచ్చు. అయితే ఈరోజు మీరు ఎవరిని సంప్రదించకుండా పెద్ద నిర్ణయం తీసుకోకుండా ఉంటే మంచిది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది.ర మీ తల్లిదండ్రులతో సంబంధం బలంగా ఉంటుంది. మీకు పెద్ద తోబుట్టువుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైన రోజు. ఆరోగ్యంగా ఉండాలంటే కోపాన్ని తగ్గించుకోవాలి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు కొంతమంది పెద్ద కస్టమర్‌లతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని పొందవచ్చు. ఇది కాకుండా, మీ వ్యాపారం కూడా పెరుగుతుంది. అయితే, ఈరోజు మీరు ప్రమాదకర వ్యాపార నిర్ణయం కూడా తీసుకోవచ్చు. మరోవైపు, ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆఫీసులో బాస్ మూడ్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఓపికతో పని చేయాలి. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులతో మీ మానసిక అనుబంధం పెరుగుతుంది. పిల్లల వైపు నుండి సంతోషం ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఇప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే, ఈరోజున మీరు జాగ్రత్తగా ఉండాలి. కొద్దిపాటి అజాగ్రత్త వల్ల చాలా నష్టపోతారు. ఎక్కువ పని ఒత్తిడి తీసుకోకుండా ఉండండి. పనితో పాటు, మీ ఆరోగ్యం కూడా మీకు సమానంగా ముఖ్యమైనది. ఈరోజు మీరు ఎక్కువ దూరం ప్రయాణించకండి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు పొదుపుపై ఎంత ఎక్కువ దృష్టి సారిస్తే అంత మంచిది. మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ మనస్సులో ఏవైనా ప్రశ్నలు ఉంటే, దానిని మీ ప్రియమైన వారితో బహిరంగంగా పంచుకోండి. మీరు మీ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనవచ్చు.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు
2022 Yearly Rasi Phalalu : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు అద్భుత విజయాలు సాధిస్తారట...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలను పొందడానికి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. సానుకూలంగా ఉండండి మరియు కష్టపడి పని చేయండి. మీరు ఖచ్చితంగా ఆశించిన ఫలితాన్ని పొందుతారు. మరోవైపు, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్యూహాలు చేయవలసిన అవసరం లేదు. మీరు ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయం తీసుకుంటే, మీ పెద్దల అభిప్రాయాన్ని ఖచ్చితంగా తీసుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రియమైన వ్యక్తి యొక్క మండుతున్న స్వభావం మీ ఇంటి శాంతికి భంగం కలిగిస్తుంది. అంతే కాకుండా వారి పదునైన మాటలు కూడా మీ మనోభావాలను దెబ్బతీస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు ఆకస్మికంగా బదిలీ కావొచ్చు. మరోవైపు ప్రయివేటు ఉద్యోగాలు చేసే వారిపై కూడా పని భారం ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా మీరు బ్యాంకింగ్ సెక్టార్‌తో అనుబంధం ఉన్నట్లయితే, మీరు చాలా పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందవచ్చు. మీ ఆదాయం పెరగవచ్చు. అయితే, మీరు మీ ఆర్థిక నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం రాకుండా ఉండాలంటే డబ్బు విషయంలో చాలా అజాగ్రత్తగా ఉండకూడదు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి చాలా బాగుంటుంది. మీరు పర్యటనను కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు ఆఫీసులో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లడం వల్ల మీ బాస్ కోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే, ఈరోజు మీరు క్రెడిట్ లావాదేవీలు చేయకుంటే మంచిది. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంటి పెద్దలతో మీ అనుబంధం బలంగా ఉంటుంది. ఇంట్లో ఎవరితోనైనా అపార్థం ఏర్పడినట్లయితే, దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి ఉదయం 11:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో ఉద్యోగులు పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుండి మార్గదర్శకత్వం పొందొచ్చు. మీరు వారి సూచనలను గమనించాలి. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు కొత్త స్టాక్‌ల కోసం ప్లాన్ చేస్తుంటే, ఈ సమయం వారికి అనుకూలంగా ఉంటుంది. మందులు, పాల ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, ఫర్నీచర్ మొదలైన వాటికి సంబంధించిన పనులు చేసే వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. బహుశా కొన్ని కారణాల వల్ల ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామికి దూరంగా ఉండవలసి వస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ఆదాయానికి మించి ఖర్చు చేయవద్దు. ఇది కాకుండా, వీలైనంత త్వరగా రుణ విముక్తికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఆరోగ్యంగా ఉండాలంటే, రోజువారీ దినచర్యలో వ్యాయామం చేర్చుకోవాలి. ఇది మిమ్మల్ని చాలా ఫిట్‌గా మరియు యాక్టివ్‌గా ఉంచుతుంది. లేదంటే, మీరు ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని విషయంలో ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఆశించిన ఫలితాన్ని పొందొచ్చు. ఈరోజు మీ ఆర్థిక సమస్య కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. మీరు మీ ప్రియమైన వ్యక్తి యొక్క విభిన్న రూపాన్ని చూడొచ్చు. మీ ప్రియమైన వారు మీకు ఎంత ప్రత్యేకమో మీకు అనిపిస్తుంది. ఆరోగ్యం విషయానికొస్తే.. మీకు చర్మానికి సంబంధించిన వ్యాధి ఉండొచ్చు.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణంలో కొంత మెరుగ్గా ఉంటుంది. మీ ప్రియమైన వారితో వివాదాలు తొలగిపోతాయి. ఈరోజు మీరు ఎక్కువ సమయం వారితో గడపగలుగుతారు. మీరు మీ ప్రవర్తనలో కొంత మృదుత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తే మంచిది. ముఖ్యంగా ఇంట్లోని యువకులతో మీ సంబంధాన్ని చక్కగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ ఆర్థిక ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఉద్యోగులకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు అదనంగా కష్టపడవలసి రావచ్చు. మీకు అధిక రక్తపోటు సమస్య ఉన్నట్లయితే, ఈరోజు మీ సమస్య మరింత పెరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన కోపం మరియు అతివిశ్వాసానికి దూరంగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు చాలా భారంగా అనిపించొచ్చు. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు చాలా ఎక్కువ కష్టపడాల్సి రావొచ్చు. నిలిచిపోయిన ఒప్పందాన్ని ఖరారు చేయడానికి అనేక ప్రయత్నాలు చేయాల్సి రావొచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో మాత్రం విభేదాలు రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : సాయంత్రంర 6 నుండి రాత్రి 8 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో ఉద్యోగులు బద్దకాన్ని విడిచిపెట్టి, అదనపు పనులన్నింటినీ జాగ్రత్తగా చేయాలి. మీరు మీ కష్టానికి తగిన ఫలాలను త్వరలో ప్రమోషన్ రూపంలో పొందవచ్చు. దీనివల్ల మీ ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. వ్యాపారస్తులు పెద్ద ఆర్థిక లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది. త్వరలో మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, మీరు మీ జీవిత భాగస్వామితో గొడవలను నివారించాలి. అనవసరమైన దూరం మీ సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. అయినప్పటికీ ఈరోజు పెద్ద సమస్య ఉండదు. ఆలోచించకుండా రుణాలు ఇవ్వొద్దు. మీకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లయితే, మీరు మీ మందులను సకాలంలో తీసుకోవాలి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా మంచి రోజు. ఈరోజు మీరు తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు పొందొచ్చు. స్టాక్ మార్కెట్‌లో పనిచేసే వ్యక్తులు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీరు నిరుద్యోగులుగా ఉండి, చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద కంపెనీలో మీరు కోరుకున్న ఉద్యోగం పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 32
లక్కీ టైమ్ : సాయంత్రం 4:20 నుండి రాత్రి 8:20 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











