For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఈ రాశుల వారు ఆలోచించకుండా ఖర్చు చేయొద్దు...

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత' నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసంలో బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Shukra Rashi Parivartan 2022:వృషభంలోకి శుక్రుడి సంచారం.. రాశిచక్రాలపై పడే ప్రభావం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వ్యాపారులు ఏదైనా కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మరోవైపు ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీరు ఉత్తమమైన ఫలితాలన్ని ఇవ్వాలనే ఒత్తిడి ఉంటుంది. అలాంటి సమయంలో మీకు ఒత్తిడి పెరగొచ్చు. ఆర్థిక పరమైన విషయానికొస్తే, ఈరోజు ఎక్కువ ఖర్చులు పెరగొచ్చు. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :7

లక్కీ టైమ్ :ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో మీకు ప్రమోషన్ గురించి శుభవార్త వినిపిస్తుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వ్యాపారులకు కూడా ఈరోజు కూడా మంచిగా ఉంటుంది. ఔషధ వ్యాపారులకు ఈరోజు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు మీ భాగస్వామితో కలిసి బయటకు కూడా వెళ్లొచ్చు. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కోపంగా ఉండొద్దు. ఒత్తిడి పెంచుకోవద్దు.

లక్కీ కలర్ : గ్రే

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ :ఉదయం 8 నుండి ఉదయం 10:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు కఠినంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మిత్రుల సహాకారం తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో ఈరోజు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు వారిపై కోపం ప్రదర్శించొద్దు. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రోజ్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

ఈ 5 రాశుల వారు రహస్యాలను ఎప్పటీకీ వేరే వాళ్ళతో చెప్పరు..!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఇతరుల గురించి గాసిప్స్ చేయకండి. మీ పని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. వ్యాపారులు ఈరోజు కొత్త పని చేయకుండా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు ఇంటి నుండి ఒక శుభవార్త వింటారు. ఆర్థిక పరమైన విషయంలో ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు. ఇప్పటికే మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే ఈరోజు మరింత శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :34

లక్కీ టైమ్ : ఉదయం 10:50 నుండి మధ్యాహ్నం 2:25 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ఫ్యాషన్, మీడియా, రాజకీయ రంగాలలో ఉండే వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త వినిపిస్తుంది. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :8

లక్కీ టైమ్ :మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6:40 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు తొందరపాటులో, భయాందోళనలతో ఏ పనీ చేయొద్దు. లేకపోతే మీరు గాయపడొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నట్లయితే, మీరు మీ సన్నాహాలను పెంచుకోవాలి. కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన వ్యక్తులు ఈరోజు మంచి ఫలితాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు వారికి మంచి వివాహ ప్రతిపాదన రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని సమస్యలు పెరుగుతాయి. ఆలోచించకుండా ఎక్కువ ఖర్చు చేయడం మానుకోండి. ఈరోజు మీరు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు

Surya Gochar 2022 :మిధునంలోకి సూర్యుని రవాణాతో ఏ రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు చాలా కాలంగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి కష్టపడుతూ ఉంటే, ఈరోజు మీరు విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. బాస్ మీ కృషిని అభినందిస్తారు. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి మీ పని ఆహార పానీయాలకు సంబంధించినది అయితే, మీ పని వేగవంతమవుతుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు మీ అన్నయ్యతో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. మీ సంబంధం కూడా బలపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను కూడా చేయొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులకు చాలా మంచిగా ఉంటుంది. మీరు ఇటీవల ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొన్నట్లయితే, మీరు విజయం సాధించొచ్చు. మరోవైపు, మీరు మీ చదువును పూర్తి చేసి, ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, మీరు మంచి అవకాశాలను పొందొచ్చు. వ్యాపారులు ఈరోజు ఏదైనా ప్రమాదకర నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. దీంతో భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ కోపాన్ని అరికట్టుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీకు పాదాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు కోరుకున్న ఉద్యోగం పొందొచ్చు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పురోగతి లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార ప్రతిపాదన రావొచ్చు. మీరు పెద్ద కస్టమర్‌లతో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఇంట్లో డబ్బు విషయంలో గొడవలు రావొచ్చు. మీ తప్పుడు వైఖరి మీ ప్రియమైన వారిని మీ నుండి దూరం చేస్తుంది. అటువంటి సందర్భాలలో, మీరు స్పృహతో వ్యవహరించాలి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. త్వరలో మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవిని పొందాలనుకుంటే, మీరు మరింత కష్టపడి పనిచేయాలి. ఇది కాకుండా, మీరు సమయాన్ని కూడా గుర్తుంచుకోండి. మీ ఆలస్యం మీ పురోగతిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీకు తల్లిదండ్రుల మార్గదర్శకత్వం లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:20 వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు ఏవైనా పెద్ద చింతలను వదిలించుకోవచ్చు. మానసికంగా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ప్రియమైన వారితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మీరు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందొచ్చు. మీరు మీ జీవిత భాగస్వామికి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే, ఈరోజు సరైన రోజు. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారులతో పాటు సహోద్యోగులతో కూడా సమన్వయం మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు పని చేయడంలో భిన్నమైన ఆనందాన్ని అనుభవిస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితిలో పురోగమనం ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే లైట్ ఫుడ్ తీసుకోవాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :2

లక్కీ టైమ్ :ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో కొన్ని ముఖ్యమైన పనులు అప్పగించినట్లయితే, దానికి సంబంధించిన విషయాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు. లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. అంతేకాదు మీ పనిని కూడా సకాలంలో పూర్తి చేయాలి. వ్యాపారులకు ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు సన్నిహితుల కోసం విలువైన బహుమతిని కూడా కొనుగోలు చేయొచ్చు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -29 June 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published: Wednesday, June 29, 2022, 5:00 [IST]
Desktop Bottom Promotion