Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
Tula Rasi Ugadi Rasi Phalalu 2022:'శుభకృత'ఏడాదిలో తుల రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!
'శుభకృత'ఏడాదిలో తుల రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ఇటీవలే హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నాం.. అదే సమయంలో మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం.

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం.

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృత' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా తుల రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-08, వ్యయం-08
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయం, ఖర్చులు సమనాంగా ఉంటాయి. చిత్త నక్షత్రం 3,4 పాదాలు లేదా స్వాతి నక్షత్రం 1,2,3,4 నాలుగు పాదాలు, లేదా విశాఖ నక్షత్రం 1, 2,3 పాదాల్లో అంటే మొత్తం తొమ్మిది స్థానాలు ఉంటాయి. ఈ ఏడాదిలో గురు బలం లేకపోవడం వల్ల తుల రాశి వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

రాజపూజ్యం-7, అవమానం-09
ఈ ‘శుభకృత' నామ సంవత్సరంలో గౌరవం కన్నా అవమానాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గురు గ్రహ ప్రభావం వల్ల ఈ సంవత్సరంలో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు ఇతర రంగాలపై ద్రుష్టి పెరుగుతుంది. సంగీత కళాకారులకు కొన్ని సమస్యలు వచ్చును. అయితే సమస్యలు తీవ్రంగా మాత్రం ఉండవు. ఈ సంవత్సరం రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్ర గ్రహాల సంచారం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి. మీరు కొత్త వాహనం కొనుగోలు చేయడం, కొత్త ఇంట్లోకి ప్రవేశించొచ్చు.

శని గ్రహ ప్రభావంతో..
ఈ రాశి వారికి శని గ్రహ ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ ఆలోచనా విధానం మెరుగవుతుంది. అయితే ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఉన్నతాధికారుల కొన్ని సమస్యలొస్తాయి. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులకు ఈ కాలంలో సాధారణంగా ఉంటుంది. ఈ ఏడాదిలో తుల రాశి వారికి ఏలి నాటి శని దశ లేదు.

రాహు ప్రభావంతో..
తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి రాహువు ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఈ ఏడాది మీ జీవిత భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని గౌరవంగా చూసుకోవాలి. అవివాహితుల వివాహ ప్రయత్నాలు అంత తొందరగా కుదరవు. రాహు దోష నివారణ కోసం శ్రీకాళహస్తి లేదా రామేశ్వరంలో ప్రత్యేక పూజలు చేయడం వల్ల పెళ్లి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఈ కాలంలో ఎలాంటి సమస్యలు ఉండవు.

కేతు ప్రభావం వల్ల..
శుభకృత నామ సంవత్సరంలో కేతు గ్రహం ప్రభావం వల్ల ఈ రాశి వారు అనవసరమైన పనులు అంటే వీరికి సంబంధం లేని పనులు చేయాల్సి వస్తుంది. మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. ఉద్యోగులకు ఆకస్మికంగా నష్టం జరగొచ్చు. వ్యాపారులకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. కేతువు అనుగ్రహం పొందేందుకు ప్రతిరోజూ వినాయకుడిని ఆరాధించాలి.

పరిహారాలివే..
ఈ సంవత్సరంలో గ్రహాల అనుగ్రహం పొందేందుకు ఆవుకు నానబెట్టిన ఉలవలను బెల్లంతో కలిపి ఆహారంగా అందించాలి. ఇలా చేయడం వల్ల మీరు శుభ ఫలితాలు పొందొచ్చు. అలాగే గురు గ్రహం అనుగ్రహం పొందేందుకు ప్రతి గురువారం రోజున రాఘవేంద్ర స్వామి లేదా సాయిబాబా, దత్తాత్రేయ గురు సంబంధిత దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం మీరు దోష నివారణ పొందొచ్చు. ఈ పరిహారాలు పాటించడం వల్ల మీకు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











