For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ugadi Wishes in Telugu: అదిరిపొయే వాట్సాప్, ఫేస్ బుక్ మెసెజ్ లు మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి

|

ఉగాది పండుగ అంటేనే షడ్రుచుల సమ్మేళనం. చిరు వేప పూత.. మామిడి కాత.. పులుపులో పులకింతతో పాటు ఆరు రుచులతో పాటు ఆనందంగా ఆరంభించే తెలుగు నూతన సంవత్సరమే ఉగాది పండుగ. ఈ షడ్రుచులలో ఒక్కో రుచికి, ఒక్కో పదార్థానికి ఒక్కో భావానికి ప్రతీక అని పెద్దలు చెబుతుంటారు.

బెల్లంలో ఉండే తీపి ఆనందానికి.. ఉప్పులో ఉండే గుణం మన జీవితంలో ఉత్సాహానికి, వేప పూతలోని చేదు మన జీవితంలో బాధ కలిగించే అనుభవాల గురించి, చింతలోని పులుపు.. మనం నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను, మామిడి ముక్కలలోని వగరు వంటి రుచులు.. కొత్త సవాళ్ల గురించి..

ఇక చివరగా కారం విషయానికొస్తే మనల్ని సహనం కోల్పేయేటట్టు చేసే పరిస్థితులను గుర్తు చేస్తుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు మరోసారి ఇళ్లలో ఉండే పండుగ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ బంధు, మిత్రులను కలుసుకోలేమని బాధపడాల్సిన అవసరం లేదు.

మీరు మీ ఫోన్ లోని వాట్సాప్, ఫేస్ బుక్ తో పాటు అందుబాటులో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకుని శ్రీ ఫ్లవ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలను చెప్పొచ్చు. అయితే అందరి కంటే ముందుగా.. ప్రత్యేకంగా మీకిష్టమైన వారిని ఆశ్చర్యపరచాలనుకుంటే కింద ఉన్న మెసెజ్ లు, కోట్స్ లో మీకు నచ్చిన వాటిని ఎంచుకోండి. మీ బంధు మిత్రులతో షేర్ చేయండి...

టాప్ - 10

టాప్ - 10

తీపి, చేదు కలగలిపినదే జీవితం..

కష్టం, సుఖం ఉంటేనే నిజమైన జీవితం..

ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వచ్చేదే

ఉగాది పర్వదినం

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శార్వరి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

టాప్ - 9

టాప్ - 9

‘‘మధురమైన ప్రతి క్షణం..

నిలుస్తుంది జీవితాంతం

రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం

అలాంటి క్షణాలెన్నో మీకందించాలని‘‘ ఆశిస్తూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శార్వరి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

టాప్ - 8

టాప్ - 8

‘‘మామిడి పువ్వుకి మాట వచ్చింది..

కోయిల గొంతుకు కూత వచ్చింది..

వేప కొమ్మకు పూత వచ్చింది..

పసిడి బెల్లం తోడు వచ్చింది..

గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది..

వీటన్నింటినీ ఉగాది మన ముందుకు తెచ్చింది..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శార్వరి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

టాప్ - 7

టాప్ - 7

జీవితం అంటే సకల అనుభూతుల సమ్మిశ్రమం..

స్థిరలక్షణాలను అలవరచుకోవడం వివేకి లక్షణం..

అదే ఉగాది పండుగ తెలిపే సందేశం..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శార్వరి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

టాప్ - 6

టాప్ - 6

‘‘ శార్వరి నామ సంవత్సరం

ఆరు రుచులతో ఆరంభం

మనసుకు తెచ్చెను తరగని సంతోషం..

ఉగాది గుండెకు ఆనందం‘‘

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శార్వరి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

టాప్ - 5

టాప్ - 5

‘‘షడ్రుచుల సమ్మేళనం..

సంబరాల సూర్యోదయం..

భవితల పంచాంగ శ్రవణం..

వసంత కోయిల గానంతో పాటు

వచ్చేదే తెలుగు వారి పండుగ ఉగాది‘‘...

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శార్వరి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

టాప్ - 4

టాప్ - 4

‘‘ వసంత కాలంలో మామిడి కాత..

వేప చెట్లలో పూసే చిరు వేప పూత..

వసంత రుతువులన్నీ దొసిట్లో నింపుకొచ్చే ఉగాది ఘనత‘‘..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శార్వరి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

టాప్ - 3

టాప్ - 3

వేసవి వేడికి వాడిన ధరణి అధరాన

దరహాస విరులు పూయు పూదోటగా

నవ వసంతంగా ఉదయించేదే ఉగాది పండుగ

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శార్వరి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

టాప్ - 2

టాప్ - 2

‘‘లేత లేత మామిడాకు తోరణాలు..

శ్రావ్యమైన సన్నాయి రాగాలు..

అందమైన ముగ్గులతో లోగిళ్లు..

ఉప్పొంగిన ఉత్తేజంతో రంగవల్లులు‘‘..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శార్వరి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

టాప్ -1

టాప్ -1

U - ఉత్సవం

G - గౌరవం

A - ఆనందం

D - ధనం

I - ఐశ్వర్యం

తెచ్చేదే ఉగాది పండుగ..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శార్వరి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు

English summary

Ugadi 2020 : Wishes, Images, Quotes, whatsapp and facebook status messages

Ugadi is also known as "Yugadi" and "Samvatsaradi". The festival marks the start of a new year and the beginning of the spring season.