Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
Ugadi 2023: ఉగాది రోజు ఇల్లు కలకలలాడాలంటే ఇలా చేయండి
తెలుగు నూతన సంవత్సరాన్ని ఇలా ఆనందంగా, సంతోషంగా ఆహ్వానిస్తే ఆ ఏడాదంతా సుఖసంతోషాలతో ఉంటుందని విశ్వాసం. అయితే ఈ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాదికి మీ ఇంటిని ఇలా అలంకరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పండగ అనగానే ఇంటి గుమ్మాలకు ఆకుపచ్చని మామిడాకుల తోరణాలు, పూలతో అలంకరించిన ఇంటి పరిసరాలు, రంగురంగుల ముగ్గులతో లోగిళ్లు ఇలా పండగ అనగానే ఇవన్నీ మదిలో మెదులుతుంటాయి.

ఉగాది పండగకు కూడా తెలుగు వారి ఇళ్లన్నీ ప్రత్యేక శోభను సంతరించుకుంటాయి. తెలుగు నూతన సంవత్సరాన్ని ఇలా ఆనందంగా, సంతోషంగా ఆహ్వానిస్తే ఆ ఏడాదంతా సుఖసంతోషాలతో ఉంటుందని విశ్వాసం. అయితే ఈ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాదికి మీ ఇంటిని ఇలా అలంకరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రంగవల్లులు:
శుభకార్యం ఏదైనా, అది పండగ అయినా ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేస్తే ఆ ఇంటికి వచ్చే పండగ శోభ వేరేలా ఉంటుంది. చక్కగా తీర్చిదిద్దిన రంగవల్లులు మంచి పాజిటివ్ వైబ్ ను అందిస్తాయి. ముగ్గు వేసి అందులో రంగులు నింపిస్తే వాకిలి నుండే పండగ ప్రారంభమవుతుంది.
తోరణాలు:
పండగ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేయాలి. కొత్త బట్టలు వేసుకోవాలి. ఇంటి దర్వాజాలు అన్నింటికి పచ్చని మామిడి ఆకులను తోరణాలుగా కట్టాలి. అలాగే గుమ్మం వద్ద అరటి చెట్టు కాండాలను కూడా పెట్టుకుంటే పండగ శోభ ఉట్టిపడుతుంది.
పచ్చని ఆకులతో ఇంటికి ప్రకృతి అందం సంతరించుకుంటుంది. వీటితో పాటు ఫ్లోరసెంట్ లైట్లతోనూ ఇంటి గుమ్మాలను అలంకరించుకోవచ్చు. వీటి వల్ల ఇల్లు మరింత అందంగా కనిపిస్తుంది.
పూజాగది:
పండగ అంటే ఇంటి గుమ్మాలను పచ్చని తోరణాలతో ఎలా అలంకరిస్తామో పూజాగదిని కూడా ప్రత్యేకంగా అలంకరించుకోవాలి. ఉగాది రోజున కూడా పూజాగదిని ప్రత్యేకంగా అలంకరించి దేవతా చిత్రాలను కడిగి అలంకరించుకోవాలి.
దేవుడి ఫోటోలు, విగ్రహాలను కడిగి కుంకు, పసుపు, గంధం, పూలతో అలంకరించాలి. పూజా గది గుమ్మానికి మామిడాకులు, పూలదండలు కట్టుకోవాలి. చిన్న చిన్న లైట్లతో అందంగా అలంకరించుకుంటే పూజాగది కొత్త శోభ సంతరించుకుంటుంది.
మామూలుగా ఎవరి పూజాగదిలో అయినా ఇత్తడి సామాగ్రి ఉపయోగిస్తుంటారు. పండగ రోజున మీకు వీలుంటే ఇత్తడికి బదులు వెండి, రాగి పాత్రలు కొనడం మంచిది. ఇక పూజా సామాగ్రి రాగి, చెక్కతో తయారు చేసిన పాత్రలు కూడా బాగుంటాయి.
పూలతో అలంకరణ:
అలంకరణతో పాటు ఆహ్లాదం కోసం ఇంట్లో చెట్లు పెంచుకుంటాం. ఈ పండగ రోజు మీ ఇంట్లో ప్లాస్టిక్ ఫ్లవర్ వేజులు ఉంటే వాటిని తొలగించి, వాటి స్థానంలో పచ్చని మొక్కలను నాటుకోండి. వీటి వల్ల అలంకరణతో పాటు ఆహ్లాదంగా కూడా ఉంటుంది.
చామంతి, బంతి వంటి పూల మొక్కలు, బ్లష్ ఫ్లవర్స్ పెంచుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇంటి ముందు పెద్ద గంగాళం ఉంచి అందులో నీళ్లు పోసి పూలతో అలంకరించుకుంటే అందంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications