Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
Ugadi Rasi Phalalu 2021: కొత్త ఏడాదిలో కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!
హిందూ పంచాగం ప్రకారం, ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజు అంటే.. ఏప్రిల్ 13వ తేదీ ఉగాది పండుగ రోజు నుండి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరంలో జాతకం ఎలా ఉంటుంది.. ఏయే గ్రహాల ప్రభావం ఉంటుంది.


ఏప్రిల్..
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈ నెలలో ఊహించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులు ఆశించిన విధంగా ఫలితాలు ఉండొచ్చు. రెండో వారంలో మీరు విహారయాత్రకు కూడా వెళ్లే అవకాశం ఉంది. మీరు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీకు నూతన వాహనం లేదా కొత్త ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు.

మే..
ఈ నెలలో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు మీ స్వశక్తితో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఈ కాలంలో అవివాహితులకు వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థిక రుణాల నుండి బయట పడతారు. మీకు కుటంబం నుండి ప్రేమాభిమానాలు లభిస్తాయి. విదేశీ సంబంధ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. అయితే మిత్రుల నుండి ఏదైనా విషయంలో విభేదాలు రావొచ్చు.

జూన్..
ఈ నెలలో ఈ రాశి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే మీరు అప్రమత్తంగా ఉంటే వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. మరోవైపు ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. మీరు మానసికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆదాయ పరంగా సాధారణంగా ఉంటుంది. ఈనెలలో కొంత డబ్బును ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది.

జులై..
ఈ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి కారణం లేకుండా కోపం, చిరాకు వంటివి ఏర్పడొచ్చు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీకు కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మరోవైపు ఈ కాలంలో కుటుంబ పరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రుల నుండి ఆశించిన విధంగా మద్దతు ఉండదు. అయితే చివరి వారంలో ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మీరు వినోద సంబంధిత వాటికి సంబంధించి ఖర్చులు చేయొచ్చు.

ఆగస్టు..
ఈ నెలలో ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.. మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులు ఆశించిన విధంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెల మధ్యలో ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పని చేసే వారికి అదనపు బాధ్యతలు లభిస్తాయి. ఔషధ రంగ వ్యాపారులకు అద్భుతంగా ఉంటుంది. ఈ నెలలో మీరు కొన్ని కొత్త వస్తువులను కొంటారు.

సెప్టెంబర్..
ఈనెలలో ఈ రాశి వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈ నెలలో సాధారణంగా ఉంటుంది. వివాహం కానీ వారికి ఈ నెల రెండో వారం మరియు మూడో వారంలో వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో నూతన ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు అతి కష్టం మీద విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బందిగా ఉంటుంది. దీని కారణంగా మీరు మానసిక సమస్యలను ఎదుర్కొంటారు.

అక్టోబర్..
ఈ నెలలో ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చు. మీ ఆదాయం కూడా తగ్గిపోవచ్చు. మీ ప్రయాణాలు తీవ్ర ప్రయాసలతో కూడి ఉంటాయి. మీ కుటుంబసభ్యులకు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు ఈనెలలో మీరు కొన్ని దైవదర్శనాలు చేసుకుంటారు. ఆధ్యాత్మికవేత్తల పరిచయం వల్ల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఈ నెల చివరికి మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు.

నవంబర్..
ఈ నెలలో ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందొచ్చు. వివాహితులు సంతానం గురించి కొన్ని శుభవార్తలను వింటారు. మరోవైపు తొలి వారంలో వ్యాపారులకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. రెండో వారంలో ఉద్యోగులకు ఆకస్మిక సమస్యలు లేదా అధిక భారం ఎదుర్కొంటారు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

డిసెంబర్..
ఈ నెలలో ఈ రాశి వారికి ఆశించిన విధంగా ఫలితాలు రావొచ్చు. మీకు కావాల్సిన రుణాలు సమయానికి దక్కుతాయి. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారులకు వ్యాపార విస్తరణకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో కోర్టు వ్యవహారాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఈ నెలలో వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం తగ్గే అవకాశం ఉంది.

జనవరి..
ఈ నెలలో ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. ఈ మాసంలో మీరు కొత్త పనులను ప్రారంభించకపోవడమే మంచిది. రెండో వారంలో మీరు కొత్త బట్టలు కొనే అవకాశం ఉంది. మీ ఆదాయంలో కూడా కొంత పెరుగుదల లభిస్తుంది. మూడో వారంలో కుటుంబ పరంగా కొంత చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఆదాయ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ఫిబ్రవరి..
ఈ నెలలో ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో మంచిగా ఉంటుంది. మీ ఇంటికి ఆకస్మాత్తుగా అతిథులు వస్తారు. ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంతానంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ.. బుధ గ్రహ అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మూడో వారంలో ఉద్యోగులకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీరు ఆశించిన విధంగా ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. చివరి వారంలో అంతా సాధారణంగా ఉంటుంది.

మార్చి..
ఈ నెలలో వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. మీకు పోటీ కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు ఆశించిన ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా లభించును తొలి వారంలో కళా రంగంలోని ప్రజలు అనారోగ్యంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే మిత్రుల సహకారంతో అడ్డంకులను అధిగమిస్తారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ప్రభుత్వ సంబంధిత అడ్డంకులు ఎదుర్కొందురు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన రాశుల ఫలితాలు ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











