Latest Updates
-
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే..
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో మకర రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో మకర రాశి వారి భవిష్యత్తు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం చూస్తుండగానే హిందూ క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర మాసంలో ఫ్లవ నామ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. అప్పుడే ఉగాది పండుగ కూడా వెళ్లిపోయింది. శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. మరికొద్ది గంటల్లో రామభక్తుడైన హనుమాన్ జయంతిని జరుపుకోనున్నాం. ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి కొత్త సంవత్సరంలో జాతకం ఎలా ఉంటుంది.. ఏయే గ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయా.. లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తాయా.. గత ఏడాది మాదిరిగానే సమస్యలు వెంటాడతాయా.. అనే వివరాలతో పాటు ప్రతి నెలా మీ జాతకం ఎలా ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


ఏప్రిల్..
ఈ రాశి వారిలో నిరుద్యోగులు అతి కష్టం మీద వారికిష్టమైన ఉద్యోగం పొందుతారు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీకు గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులపై మీ ప్రేమను చూపుతారు. ఆరోగ్య పరంగా అంతా బాగుంటుంది.

మే..
ఈ నెలలో మకర రాశి వారికి ఆదాయ పరంగా సాధారణంగా ఉంటుంది. ఎవరైతే పదవులను ఆశిస్తారో.. వారికి కష్టం మీద అవి దక్కుతాయి. ఉద్యోగులకు స్థిరత్వం ఉండదు. మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యాపారులకు మంచిగా ఉంటుంది. నెల చివర్లో పెళ్లి అయిన మహిళలకు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడొచ్చు.

జూన్..
ఈ రాశి వారికి ఈ నెలలో కొంత ఆదాయం తగ్గును. తొలి వారంలో స్నేహితులతో లేదా ఉన్నతాధికారులతో విభేదాలు రావొచ్చు. రెండో వారంలో వ్యాపారులకు లాభాలు వస్తాయి. మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మూడో వారంలో జంటలకు సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. రాజకీయాల్లో ఉండే వారికి విజయం దక్కుతుంది. నెల చివర్లో ఆర్థిక పరంగా సానుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో పురోగతి సాధిస్తారు.

జులై..
ఈ నెలలో మకర రాశి వారికి సాధారణంగా ఉంటుంది. మీ ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. మీరు సమయానికి అప్పులు చేయాల్సి ఉంటుంది. తొలి వారంలో వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. నిరుద్యోగులు కూడా తొలి వారంలో ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. మూడో వారంలో సాధారణ ఫలితాలు వస్తాయి.

ఆగస్టు..
ఈ నెలలో మీరు ఎంత కష్టపడి పని చేసినా ఫలితం కనిపించకపోవచ్చు. మీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ప్రతి చిన్న విషయం మీకు ఇబ్బందికరంగా మారుతుంది. స్త్రీలు, ప్రేమ వ్యవహారాలతో నష్టపోతారు. ఆరోగ్యానికి సంబంధించి మీరు ఈ నెలలో ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది.

సెప్టెంబర్..
ఈ రాశి వారికి ఈ నెలలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఇంటి విషయంలో మీకు సానుకూలంగా ఉంటుంది. జంటలు సంతాన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మరోవైపు కోర్టు వ్యవహారాలు కలిగిన వారికి గందరగోళ వాతావరణం ఉంటుంది. మూడో వారంలో మీరు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఆదాయ పరంగా అద్భుత ఫలితాలు ఉండొచ్చు. అయితే పెట్టుబడుల విషయంలో తొందరపడకండి.

అక్టోబర్..
ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ వివాహ ప్రయత్నాలు విఫలం అవ్వొచ్చు. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు ఆఖరి నిమిషంలో ఆగిపోవచ్చు. మరోవైపు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రెండో వారంలో మీకు పరిస్థితులు అనుకూలంగా మారతాయి.

నవంబర్..
ఈ నెలలో మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. బంధువులు, మిత్రుల సహకారం లభిస్తుంది. సమయానికి మీ చేతికి డబ్బు అందుతుంది. మీకు కోర్టు వ్యవహారాలలో ఫలితాలు అనుకూలంగా వస్తాయి. మీరు ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి ఈ నెలలో సానుకూలంగా ఉంటుంది.

డిసెంబర్..
ఈ నెలలో మీ ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఊహించిన లాభాలను పొందుతారు. మీకు అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది. మీకు సమయానికి డబ్బు అందుతుంది. మీ తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు తొలగుతాయి. మీరు ఆశించిన విధంగా డాక్టర్ల సర్వీసు పొందుతారు.

జనవరి..
ఈ నెలలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆదాయం తగ్గిపోవచ్చు. మరోవైపు మీరు ఈ నెలలో విహార యాత్రలు చేయొచ్చు. కానీ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈ మాసంలో మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే మీరు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ఫిబ్రవరి..
ఈ రాశి వారు ఈ నెలలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు ఆర్థిక పరమైన లాభాలను పొందుతారు. మీ మానసిక ధైర్యం పెరుగుతుంది. మీ సన్నిహితులు మీకు సమయానికి ఆదుకుంటారు. మీ కీర్తి-ప్రతిష్టలు పెరుగుతాయి.

మార్చి..
ఈ రాశి వారికి ఈ నెలలో ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ మాసంలో మీకు కావాల్సిన ఆదాయం లభిస్తుంది. మీరు కుటుంబంతో కలిసి దేవాలయ సందర్శన చేయొచ్చు. మీకు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి సహాయంతో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు.



Click it and Unblock the Notifications