Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో మేషరాశి జాతకం ఎలా ఉందంటే...!
తెలుగు కొత్త సంవత్సరంలో మేషరాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకోండి.
హిందూ పంచాగం ప్రకారం, ఏప్రిల్ 13వ తేదీ ఉగాది పండుగ రోజు నుండి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి కొత్త సంవత్సరంలో జాతకం ఎలా ఉంటుంది.. ఏయే గ్రహాల ప్రభావం ఉంటుంది.

గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయా.. లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తాయా.. గత ఏడాది మాదిరిగానే సమస్యలు వెంటాడతాయా.. అనే వివరాలతో పాటు ప్రతి నెలా మీ జాతకం ఎలా ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏప్రిల్..
ఈ నెలలో మేషరాశి వారికి ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. మీరు విందు, వినోదాల్లో పాల్గొంటారు. అయితే ప్రయాణం చేసే సమయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెరుగుతుంది. మరోవైపు కోర్టు కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఉద్యోగులకు 18వ తేదీ తర్వాతి నుండి సానుకూల ఫలితాలు వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మే..
మే మాసంలో ఉద్యోగులు, వ్యాపారులు, రోజు వారీ కూలీ చేసుకునే వారు తొలి రెండు వారాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. మరోవైపు మీ ప్రత్యర్థులు ఈ సమయంలో ఆధిపత్యం చెలాయిస్తారు. మూడో వారం నుండి మీ పనుల్లో చాలా ఆటంకాలు ఎదురవుతాయి. ప్రైవేట్ ఉద్యోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితం ప్రతికూలంగా ఉంటుంది.

జూన్..
ఈ నెలలో మేషరాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు ఊహించిన విధంగా పనులు జరుగుతాయి. వ్యాపారులకు ప్రభుత్వం నుండి సహకారం లభించును. మీరు చేపట్టే పనుల్లో కూడా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు ఆదాయ పరంగా మంచి అవకాశం ఉంటుంది.

జులై..
ఈ నెలలో మేష రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు మంచి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. మీ శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. అయితే ఈ నెలలో మీరు కొత్త వాహనం తీసుకోకుంటే మంచిది.

ఆగస్టు..
మేష రాశి వారు ఈ నెలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు పని చేసే చోట కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరోవైపు వ్యాపారులు ఈ సమయంలో అడ్డంకులను అధిగమిస్తారు. ఆర్థిక పరంగా ఈ కాలంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే, మీరు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

సెప్టెంబర్..
ఈ నెలలో మీరు స్నేహితుల నుండి కొన్ని శుభవార్తలను వింటారు. మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మీ విదేశీ సంబంధిత ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కుటుంబంలో మీరు కొత్త బాధ్యతలను తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు ఈ నెలలో ఎలాంటి మార్పులు చేయకుండా ఉండాలి. వివాహితులు సంతానం గురించి కొన్ని శుభవార్తలు వింటారు.

అక్టోబర్..
మేష రాశి వారు ఈ నెలలో చాలా మంచి అవకాశాలను పొందుతారు. అయితే మీరు వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రెండో వారం తర్వాత చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అప్పుడు సమయం ప్రతికూలంగా ఉంటుంది. అయితే మూడో వారం నుండి మీ పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. మీ జీవిత భాగస్వామితో చివరి వారంలో రొమాన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది.

నవంబర్..
ఈ నెలలో మేషరాశి వారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే మీకు నిరాశ కలిగించే ఫలితాలు ఎదురవుతాయి. మరోవైపు మీ కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం మీరు ఆశించిన విధంగా ఉండదు. మీకు ఆరోగ్య పరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. ఉద్యోగులకు ఈ నెల కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి.

డిసెంబర్..
మేషరాశి వారికి ఈ నెలలో శుభప్రదంగా ఉంటుంది. మీరు అడ్డంకులన్నీ అధిగమించగలరు. మీరు దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు ఈ కాలంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. మీరు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగులు ఆశించిన మార్పులు లభిస్తాయి.

జనవరి..
ఈ నెలలో మీరు ఆర్థిక పరంగా మంచి అవకాశాలను పొందుతారు. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఉద్యోగులకు అకస్మికంగా పనిభారం పెరుగుతుంది. రెండో వారంలో కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరోగ్య సమస్య ఉంటుంది. నిరుద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నెల చివర్లో ప్రతికూలంగా ఉంటుంది.

ఫిబ్రవరి..
ఈ నెలలో మేషరాశి వారికి కొన్ని సమస్యలు తగ్గుతాయి. మీరు కష్టపడి పనులు చేస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు ఈ నెలలో చాలా మంచిగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే.. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీకు ఆర్థిక పరమైన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

మార్చి..
ఈ నెలలో మేష రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీరు కొంచెం మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. అదే సమయంలో ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. వివాహితులకు ఈరోజు జీవిత భాగస్వామి నుండి సహకారం లభించదు. ఈ నెలలోని రెండు మరియు మూడో వారంలో కొన్ని ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అయితే నెల చివర్లో శుభ ఫలితాలు వస్తాయి.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన రాశుల ఫలితాలు ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications
