Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Ugadi Rashi Phalalu 2021:కొత్త ఏడాదిలో మిధున రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
ఉగాది సందర్భంగా మిధున రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాగం ప్రకారం, ఏప్రిల్ 13వ తేదీ ఉగాది పండుగ రోజు నుండి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో మిధునరాశి వారికి కొత్త సంవత్సరంలో జాతకం ఎలా ఉంటుంది.

ఏయే గ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయా.. లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తాయా.. గత ఏడాది మాదిరిగానే సమస్యలు వెంటాడతాయా.. అనే వివరాలతో పాటు ప్రతి నెలా మీ జాతకం ఎలా ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏప్రిల్..
ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీకు ఆర్థిక పరంగా ఎలాంటి అడ్డంకులు ఉండవు. మీ రుణ బాధలు తొలగుతాయి. వాహనాలకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మరోవైపు మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు వాయిదా వేస్తారు. విద్యార్థులు ఈ కాలంలో మంచిగా ఉంటుంది.

మే..
ఈ కాలంలో మీరు కొన్ని ముఖ్యమైన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. మీరు కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారులు ఈ సమయంలో నూతన పెట్టుబడులు లభించును. మీ వ్యాపార విస్తరణకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెల చివర్లో మీకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయంగా పదవులు, హోదా పొందేందుకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.

జూన్
ఈ నెలలో మీరు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందుతారు. వివాహం కాని వారికి, మంచి సంబంధాలు రావొచ్చు. మీరు దూరప్రాంతాల నుండి ఒక కీలక సమాచారాన్ని పొందుతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు విజయం లభిస్తుంది.

జులై..
ఈ మాస ప్రారంభంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మొదటి వారంలో మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే మీరు కుటుంబ సభ్యుల నుండి మానసికంగా ఆందోళన చెందుతారు. కానీ త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. విదేశీ ప్రయాణం ప్రయత్నాలు చేసే వారికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.

ఆగస్టు..
ఈ నెలలో మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. రెండో వారంలో మీకు కొన్ని కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. మూడో వారంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. స్త్రీలకు ఈ నెల చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

సెప్టెంబర్..
ఈ నెలలో ఈ రాశి వారికి కొన్ని వివాదాలు ఏర్పడతాయి. ఈ కారణంగా మీకు ఆర్థిక నష్టం ఏర్పడుతుంది. మీరు అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి నిరాశ ఎదురవుతుంది. మీ ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీ పనులన్నీ నెమ్మదిగా సాగుతాయి. మీరు చివరి వారంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.

అక్టోబర్..
ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీరు ఆకస్మికంగా మంచి ధన లాభం పొందుతారు. మరోవైపు మీ ఇంట్లో ఒకరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. రెండో వారంలో మీరు సాధారణ ఫలితాలను పొందుతారు. మూడో వారంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చివరి వారంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీ వ్యాపార ప్రయత్నాలు పెరుగుతాయి. మీకు ఆరంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా ఈ నెల చివరికంతా అన్నింటినీ అధిగమిస్తారు.

నవంబర్..
ఈ నెలలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యక్రమాలు జరుగుతాయి. మీకు మంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీ వివాహాది ప్రయత్నాలు ఈ నెలలో ఫలవంతమవ్వొచ్చు. ఉద్యోగులకు ఈ కాలంలో ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీరు చివరి వారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

డిసెంబర్..
ఈ నెలలో మీకు సంతాన సంబంధ సమస్యలు ఏర్పడతాయి. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వంటివి లభించొచ్చు. మీ ఇంటి ప్రయత్నాలు ఈ నెలలో ఫలించును. మీరు మానసికంగా అన్ని సమస్యలను అధిగమిస్తారు. ఈ నెలలో మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభిస్తే విజయవంతమగును.

జనవరి..
ఈ నెలలో వ్యాపారులకు మంచి ప్రయోజనాలు దక్కుతాయి. మీరు కొత్త వ్యాపారం ద్వారా మంచి ఆదాయం పొందుతారు. ఈ నెలలో మీ సంపాదన కూడా పెరుగుతుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఉన్నతాధికారులతో ఉద్యోగులకు కొన్ని విభేదాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

ఫిబ్రవరి..
ఈ నెలలో మీరు కోర్టు వ్యవహారాల నుండి మంచి వార్తలను వింటారు. మీరు అవివాహితులైతే, మీ వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన విధంగా ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు బదిలీ వంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ వ్యాపారం విస్తరించే అవకాశం ఉంటుంది. మీ వ్యాపార ప్రయత్నాలన్నీ ఫలితాయి. మీ ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మార్చి..
తెలుగు సంవత్సరంలో చివరి మాసమైన మార్చి మాసంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఈ కాలంలో మంచి గౌరవం పొందుతారు. మీకు నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. మీరు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మరోవైపు మీరు సంతాన సంబంధ శుభవార్తలు వింటారు. ఆరోగ్య పరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.



Click it and Unblock the Notifications











