For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ugadi Rasi Phalalu 2021:కొత్త ఏడాదిలో మీ జాతకం తెలుసుకుని.. మీ జీవితానికి సరికొత్త బాటలు వేసుకోండి...!

|

''ముందుగా బోల్డ్ స్కై తెలుగు తరపున ప్రపంచంలోని తెలుగు వారందరికీ ఫ్లవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు''. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో 13వ తేదీన మంగళవారం నుండి తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఈ పండుగ సమయంలో తెలుగు ప్రజలతో పాటు మరికొందరు ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు. వీటిలో షడ్రుచులను కచ్చితంగా చేరుస్తారు. ఇదిలా ఉండగా.. ఉగాది అంటేనే సంవత్సరం యొక్క ప్రారంభ రోజు కావున ఈ పవిత్రమైన రోజున చాలా మంది జ్యోతిష్యపండితులు పంచాంగ శ్రవణం చేస్తారు.

ఈ సందర్భంగా ఈ తెలుగు నూతన ఏడాదిలో గ్రహాల పరివర్తనం ఎలా ఉంటుంది.. వీటి ప్రభావం ద్వాదశ రాశులపై ఎలా ఉంటుంది.. ఏయే రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది.. ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఏప్రిల్ నెలలో 6 గ్రహాల కదలికతో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయం-8 ఉండగా.. వ్యయం-14గా ఉంది. రాజపూజ్యం -04, అవమానం -03గా ఉంది. తెలుగు సంవత్సర క్యాలెండర్లో గురు గ్రహ ప్రభావం కారణంగా మేష రాశి నవంబర్ మాసం వరకు ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా పెద్ద వయసు ఉండేవారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో గొడవలు జరగొచ్చు. మరోవైపు మీ కుటుంబంలో కొన్ని శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే నవంబర్ తర్వాత ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. మీకు ఆర్థిక పరంగా సానుకూలంగా ఉంటుంది. మీకు ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయం-02 ఉండగా.. వ్యయం-08గా ఉంది. రాజపూజ్యం -07, అవమానం -03గా ఉంది. ఈ రాశి వారికి కూడా తెలుగు నూతన సంవత్సరంలో గురుడి గ్రహ ప్రభావం వల్ల నవంబర్ - 2021 వరకు ప్రతికూల ఫలితాలు ఏర్పడొచ్చు. ముఖ్యంగా శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని సమయాల్లో చేతులారా అవకాశాలను చేజార్చుకుంటారు. వ్యాపారులు నవంబర్ వరకు ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. విద్యార్థులు మరియు నిరుద్యోగులకు నవంబర్ తర్వాత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తీర్థయాత్రలు కూడా నవంబర్ తర్వాత పూర్తి చేస్తారు. నవంబర్ తర్వాత మీరు కొన్ని చెడు అలవాట్లను కూడా మానేస్తారు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయం-5 ఉండగా.. వ్యయం-05గా ఉంది. రాజపూజ్యం -03, అవమానం -06గా ఉంది. ఈ రాశి వారికి తెలుగు ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయ, వ్యయం సమానంగా ఉన్నప్పటికీ గురు గ్రహం ప్రభావం వల్ల ఉద్యోగులకు, విద్యార్థులకు, వ్యాపారులకు అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇదంతా తాత్కాలికమే. కొంత కాలం తర్వాత మీకు పరిస్థితులు పూర్తిగా అనుకూలిస్తాయి. కొత్త జంటలు సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మరోవైపు శనిదేవుని అనుగ్రహంతో మీరు ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు.

Jupiter Transit 2021 in Aquarius: గురుడు కుంభంలోకి ప్రవేశం.. ఈ రాశుల వారు జాగ్రత్త...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయం-14 ఉండగా.. వ్యయం-02గా ఉంది. రాజపూజ్యం -06, అవమానం -06గా ఉంది. కర్కాటక రాశి వారు ఫ్లవ నామ సంవత్సరంలో గురు గ్రహ ప్రభావంతో చాలా డబ్బును ఆదా చేయగలుగుతారు. అయితే మీకు గత ఏడాదిలాగే.. ఈ ఏడాది కూడా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. మీరు తరచుగా గురు గ్రహానికి అభిషేకాలు, శాంతి జపాలు చేయిస్తే ఫలితం ఉంటుంది. మరోవైపు ఉద్యోగులకు శని దేవుని అనుగ్రహం వల్ల ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. మీకు ప్రమోషన్లు రావొచ్చు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయం-02 ఉండగా.. వ్యయం-14గా ఉంది. రాజపూజ్యం -02, అవమానం -02గా ఉంది. సింహ రాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గురు గ్రహ ప్రభావం వల్ల మీరు చాలా సమస్యల్లో చిక్కుకుంటారు. అయితే మీరు నవంబర్ తర్వాత అడ్డంకులను అధిగమిస్తారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏడాది శని అనుగ్రహంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీరు శత్రువులపై విజయం సాధించొచ్చు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయం-05, ఉండగా.. వ్యయం-05గా ఉంది. రాజపూజ్యం -05, అవమానం -02గా ఉంది. కన్య రాశి వారు శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో గురు గ్రహం ప్రభావం వల్ల సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలను అందుకుంటారు. అయితే మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శని దేవుని అనుగ్రహం కూడా ఉంటుంది. మరోవైపు వివాహితులు సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

Jupiter Transit 2021:కుంభరాశిలోకి గురుడి సంచారం.. ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయం-02 ఉండగా.. వ్యయం-08గా ఉంది. రాజపూజ్యం -01, అవమానం -05గా ఉంది. తుల రాశి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో గురు గ్రహం ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీరు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. అయితే నవంబర్ తర్వాత మీకు ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టిన పెట్టుబడుల్లో నష్టం రావచ్చు. మరోవైపు శని గ్రహం అనుగ్రహం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయం-08 ఉండగా.. వ్యయం-14గా ఉంది. రాజపూజ్యం -04, అవమానం -05గా ఉంది. గురు గ్రహం ప్రభావం కారణంగా మీరు 2021 నవంబర్ 19వ తేదీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. మీరు చేసే పనుల్లో చాలా నష్టాలను ఎదుర్కొంటారు. మరోవైపు విద్యార్థులు ఈ సమయంలో అనేక పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అయితే ఉద్యోగులకు ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కొంటారు. శని గ్రహం ప్రభావం వల్ల మీరు కొన్ని శుభఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయం-11 ఉండగా.. వ్యయం-05గా ఉంది. రాజపూజ్యం -07, అవమానం -05గా ఉంది. ధనస్సు రాశి వారికి తెలుగు కొత్త ఏడాదిలో ఏలి నాటి దశ ఉంటుంది. మీకు గురు గ్రహం ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు ఏర్పడొచ్చు. మీ కుటుంబ జీవితంలో సమస్యలు పెరుగుతాయి. మీ శారీరక శ్రమ పెరుగుతుంది. మీరు అనవసరమైన ఖర్చులు, ప్రయాణాలు చేస్తారు. మరోవైపు ఏలినాటి శని దశ వల్ల మీరు గత ఏడాది మాదిరే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయం-14 ఉండగా.. వ్యయం-14గా ఉంది. రాజపూజ్యం -03, అవమానం -01గా ఉంది. ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఏలి నాటి దశ ఉంటుంది. మీకు గురు గ్రహం ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా నవంబర్ వరకు తీవ్ర ప్రతికూలత పరిస్థితులు ఎదురవుతాయి. మీరు చేపట్టిన పనుల్లో ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు. నిరుద్యోగులు కూడా ఈ కాలంలో మరింత నిరాశ చెందుతారు. మహిళలు మానసికంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇంకోవైపు మీ కుటిల స్వభావం వల్ల మీరు మంచి మిత్రులను దూరం చేసుకునే అవకాశం ఉంది. మీరు ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కొంటారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయం-14 ఉండగా.. వ్యయం-14గా ఉంది. రాజపూజ్యం -06, అవమానం -031గా ఉంది. కుంభ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఏలి నాటి దశ ఉంది. మీకు గురు గ్రహం ప్రభావం వల్ల ఈ ఏడాది నవంబర్ వరకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మీకు సంతానం, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే నవంబర్ తర్వాత గురువు లగ్న స్థానంలోకి రావడం వల్ల మీరు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో ఆదాయం-11 ఉండగా.. వ్యయం-05గా ఉంది. రాజపూజ్యం -04, అవమానం -04గా ఉంది. మీన రాశి వారు గురు గ్రహ ప్రభావం వల్ల తెలుగు నూతన సంవత్సరంలోని నవంబర్ వరకు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు శనిదేవుని అనుగ్రహం వల్ల మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. మీకు ఏలినాటి దశ లేకపోవడం వల్ల మీరు ఆరోగ్య పరంగా ప్రయోజనాలను పొందుతారు.

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Ugadi Rashi Phalalu 2021: Plava Nama Samvatsara Ugadi Horsocope Predictions 2021-22 in Telugu

Here we are talking about the ugadi rashi phalalu 2021:plava nama samvatsara ugadi horoscope predictions 2021-22 in telugu. Read on