Latest Updates
-
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.!
Ugadi Rashi Phalalu 2021: ఫ్లవ నామ సంవత్సరంలో వృశ్చికరాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో వృశ్చికరాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం చూస్తుండగానే హిందూ క్యాలెండర్ ప్రకారం, ఛైత్ర మాసంలో ఫ్లవ నామ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. అప్పుడే ఉగాది పండుగ కూడా వెళ్లిపోయింది.

శ్రీరామ నవమి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో వృశ్చికరాశి వారికి కొత్త సంవత్సరంలో జాతకం ఎలా ఉంటుంది.. ఏయే గ్రహాల ప్రభావం ఉంటుంది.

గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయా.. లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తాయా.. గత ఏడాది మాదిరిగానే సమస్యలు వెంటాడతాయా.. అనే వివరాలతో పాటు ప్రతి నెలా మీ జాతకం ఎలా ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏప్రిల్..
ఈ నెలలో ఈ రాశి వారికి సంతోషంగా ఉంటుంది. విహార యాత్రలకు ఈ కాలం అనుకూలమైనది. మీరు ఆశించిన డబ్బు కూడా లభిస్తుంది. మరోవైపు మూడో వారంలో కూడా ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉండును.

మే..
ఈ నెలలో మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీకు మూడో వారంలో ఎక్కువ ప్రతికూలతలు ఉండును. ఆదాయ పరంగా ఈ నెలలో సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఏదైనా పొరపాటు చేస్తే, క్షమాపణలు చెప్పడం వల్ల మీ సంకల్పం నెరవేరును. మీరు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీకు ఉత్సాహపూరితంగా ఉండదు.

జూన్..
ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు కొన్ని భయాలు వెంటాడుతాయి. మీకు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మీరు మానసిక తొందరపాటుతనం, పైఅధికారుల ఒత్తిడి వంటి ఇబ్బందులతో మీరు చిరాకు పడతారు. మీరు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. మీ కుటుంబ ఖర్చులు అదుపులోనే ఉండును. జంటలకు తొలి వారంలో సంతాన సంబంధ ప్రయత్నాలు ఫలించును.

జులై..
ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన విధంగా ఆదాయం వస్తుంది. మీరు చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది. ఆధ్యాత్మిక పరంగా మీకు గొప్ప వారి దర్శన భాగ్యం పొందగలుగుతారు. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు గౌరవ సత్కారాలు పొందగలుగుతారు. మీరు నూతన పదవులు పొందుతారు.

ఆగస్టు..
ఈ నెలలో మీరు ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా ఉండటం మంచిది. మీకు ఈ నెలలో ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. రెండో వారంలో మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీకు చాలా మంచి ఫలితాలు రావొచ్చు. విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి సానుకూలంగా ఉంటుంది. మూడో వారంలో అంతా సాధారణంగా ఉంటుంది. నెల చివర్లో వ్యాపారులకు మంచిగా ఉంటుంది.

సెప్టెంబర్..
ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని పనులు సాధారణంగా జరుగుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు బాగుంటుంది. ఉద్యోగులకు ఈ కాలంలో మంచిగా ఉంటుంది. వ్యాపారులకు అంతా సానుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారు పెళ్లి గురించి చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు మధ్యవర్తులను అతిగా నమ్మడం మంచిది కాదు.

అక్టోబర్..
ఈ రాశి వారికి ఈ నెలలో ప్రతికూలంగా ఉంటుంది. మీకు ఆకస్మిక సమస్యలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈ నెలలో కొన్ని నష్టాలు ఏర్పడతాయి. ఆరోగ్య పరంగా కూడా అనేక సమస్యలు వస్తాయి. ఈ నెలలో మీరు కేతు మరియు గురు గ్రహ శాంతి జరిపించుకోవడం మంచిది.

నవంబర్..
ఈ రాశి వారికి ఈ నెలలో అనేక ఇబ్బందులు రావొచ్చు. ఉద్యోగులకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా ఈ నెలలో మీరు ప్రణాళిక ప్రకారం ఖర్చులు చేయాలి. లేకపోతే మీరు మీ సొంత మనుషుల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నెల చివర్లో మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు.

డిసెంబర్..
ఈ రాశి వారు ఈ నెలలో తొలి వారంలో సానుకూల ఫలితాలను పొందుతారు. గత రెండు నెలలో ఎదుర్కొన్న ప్రతికూల ఫలితాలు క్రమంగా తగ్గిపోతాయి. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీ సంబంధ విషయాల్లో అనుకూలత ఉంటుంది. మీరు చివరి వారంలో మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది.

జనవరి..
ఈ రాశి వారికి ఈ నెల సానుకూల వాతావరణం ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మహిళలు కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యల నుండి బయటపడతారు. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి, శుభప్రదంగా ఉంటుంది.

ఫిబ్రవరి..
ఈ రాశి వారికి ఈ నెలలో పెళ్లి కాని వారికి, వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరంగా ఈ నెలలో మంచిగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు నూతన వాహనాలు కొనుగోలు చేయొచ్చు. మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు కొత్త వస్తువులను సైతం కొనుగోలు చేస్తారు. మానసికంగా మంచిగా ఉంటుంది. మీరు ఎక్కువ పొదుపు చేస్తారు.

మార్చి..
ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో మంచిగా ఉంటుంది. రెండో వారంలో మీరు ఊహించని ఫలితాలను పొందుతారు. ఈ నెలలో మీకు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ నెల చివర్లో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది.



Click it and Unblock the Notifications
