బిగ్ బాస్ -4 ఎలిమినేటర్ దేవి నాగవల్లి ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా...

బిగ్ బాస్-4 ఎలిమినేటర్, యాంకర్ దేవి నాగవల్లి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ఎక్కడ బ్రేకింగ్ న్యూస్ ఉన్నా ఆమె క్షణాల్లో వాలిపోతారు.. మైక్ పట్టుకుని చకచకా సమాచారం అందిస్తారు. ఏదైనా తప్పు జరిగితే, అక్కడ ఎంతటి వారున్నా సరే.. ముక్కుసూటిగా ప్రశ్నించేతత్వం, డేరింగ్ అండ్ డాషింగ్ ఆమె నైజం.

Unknown facts about Devi Nagavalli (Big Boss-4) in telugu

ఆమె గురించి మనకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆమె నిత్యం మనకు న్యూస్ ఛానెల్స్ లో కనిపిస్తూనే ఉంటారు. ఆమెనే దేవి నాగవల్లి. ఈమె అకస్మాత్తుగా తన కెరీర్ ను పక్కనబెట్టి.. బిగ్ బాస్ లో ఎంట్రీ అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది.

Unknown facts about Devi Nagavalli (Big Boss-4) in telugu

అయితే ఈమె ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇప్పటివరకు బిగ్ బాస్ లో లేడీ బిగ్ బాస్ విన్నర్ లేరని, ఈ సీజన్లో తాను విన్నర్ అవుతానంటూ ధీమాగా చెప్పింది. రోటీన్ కు ఎల్లప్పుడూ భిన్నంగా ఉండే దేవి అకస్మాత్తుగా ఆమె ఈ బిగ్ బాస్-4 షో నుండి ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఆమె గురించి ఫస్ట్ న్యూస్ ప్రెజెంటర్, రిపోర్టర్ గా కెరీర్ మొదలుపెట్టిందని అందరూ అనుకుంటారు. కానీ ఆమె ఫస్ట్ జాబ్ అది కాదంట. అలాగే తనకు పెళ్లైందని.. ఆరేళ్ల బాబు కూడా ఉన్నాడనే ఆసక్తికరమైన విషయాలను ఆమె స్వయంగా చెప్పారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గోదావరి తీరాన..

గోదావరి తీరాన..

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా గోదావరి తీరాన ఉండే రాజమండ్రిలో సత్యవతి, రామక్రిష్ణ దంపతులకు దేవి నాగవల్లి జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. డిగ్రీ కందుకూరి వీరేశలింగం కాలేజీలో.. పూర్తి చేశారు. ఆమె విద్యా జీవితంలో ఉన్నప్పుడే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఎక్కువగా పాల్గొనేవారట.

దేవి ఫస్ట్ జాబ్..

దేవి ఫస్ట్ జాబ్..

దేవి డిగ్రీలో బికామ్ చదివారు. అదే సమయంలో గ్రాఫిక్స్ నేర్చుకున్నారట. అయితే ఆమె నేర్చుకున్న చోటే ట్యూషన్ చెప్పేవారట. తన ఫస్ట్ జాబ్ కూడా అదేనట. అది కూడా తన ఫ్రెండ్స్ కు కోర్సు గురించి చెప్పేవారట. ఆ తర్వాత బయటకు రావాలనిపించిందట. అప్పటికీ టివి9 వచ్చి కేవలం సంవత్సరం పూర్తయ్యింది. ఆ సమయంలో అక్కడ ఇన్ స్టిట్యూట్ లో జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి బయటకు వచ్చారట. అంతేకాదు అక్కడ నుండి రిస్క్ చేసి బయటికొచ్చి.. రెస్యూమ్ ఇచ్చారట.

కొత్త ప్రపంచంలోకి..

కొత్త ప్రపంచంలోకి..

అనుకోకుండా ఆమె ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారట. ఆ తర్వాత ఆమెకు ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు అనిపించిందట. హైదరాబాదులో అలవాటు పడటానికి కొంత టైమ్ పట్టిందట. అయితే న్యూస్ ప్రెజెంటేషన్లో తన మార్క్ చూపిస్తూ.. అతి తక్కువ కాలంలోనే పాపులర్ న్యూస్ ప్రజెంటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇంటర్వ్యూలతో క్రేజ్..

ఇంటర్వ్యూలతో క్రేజ్..

వీకెండ్ లైఫ్ డిస్కషన్స్ పేరిట ఎంతో మంది ప్రముఖులను, రాజకీయ నాయకులను, సినీ తారలను ఇంటర్వ్యూలు చేసి ఆమె అతి తక్కువ కాలంలోనే చాలా క్రేజ్ సంపాదించారు. స్టూడియోలో కూర్చుని బ్రేకింగ్ న్యూస్ చెప్పడం వరకే కాకుండా.. ఆన్ గ్రౌండ్ రిపోర్టింగ్ లో గణనీయమైన ఎక్స్ పీరియన్స్ సంపాదించారు.

డేరింగ్ రిపోర్టర్ గా..

డేరింగ్ రిపోర్టర్ గా..

ఉగ్రవాదుల దాడి తర్వాత అమరనాథ్ కు వెళ్లి అక్కడి నుండి రిపోర్టింగ్ చేసి డేరింగ్ రిపోర్టింగ్ కూడా చేశారు. కాశ్మీర్ లో అల్లర్ల సమయంలో అక్కడకు వెళ్లి ప్రతక్ష్య ప్రసారాలతో అక్కడ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు.

వివాదస్పద ఇంటర్వ్యూలు..

వివాదస్పద ఇంటర్వ్యూలు..

రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, కేఏపాల్ వంటి ప్రముఖులతో వివాదస్పద ప్రశ్నలడిగి మరింత పాపులర్ అయ్యారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి. వీటితో పాటు అన్వేషణ, ఖబడ్దార్ వంటి డేరింగ్ ప్రోగ్రామ్స్ లను చేసి.. స్టింగ్ ఆపరేషన్లలోనూ పాల్గొన్నారు.

తెలుగు మీడియా తరపున తొలి అవార్డు..

తెలుగు మీడియా తరపున తొలి అవార్డు..

ఈమె సేవలకు గాను తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో 2009లో ‘నేషనల్ టెలివిజన్ అవార్డు(ఢిల్లీ) గెలుచుకున్న తొలి తెలుగు న్యూస్ ప్రెజెంటర్ దేవి కావడం గొప్ప విషయం. అదే ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘నంది' అవార్డును కూడా అందుకున్న ఏకైక న్యూస్ రిపోర్టర్ గా రికార్డులకెక్కారు. వరుసగా రెండో ఏడాది అంటే 2010లో కూడా ఆమెను నంది అవార్డు వరించింది.

దాసరి గారి మనవరాలట..!

దాసరి గారి మనవరాలట..!

జర్నలిజంలో ఎంతో అనుభవం ఉన్న దేవి నాగవల్లి లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావుకు మనవరాలు వరుస అవుతారట. ఆమె నాన్నగారికి దాసరి నారాయణ రావు స్వయానా మేనమామ అవుతారట. అలా దేవి కుటుంబానికి, దాసరి కుటుంబానికి మధ్య రక్త సంబంధం ఉందన్న విషయం, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఆమెను బిగ్ బాస్-3 సీజన్లోనే రమ్మన్నారని, కానీ అప్పుడు అనుకోని కారణాల వల్ల కుదరక.. ప్రస్తతు బిగ్ బాస్ -4లో ఎంట్రీ, ఎలిమినేట్ రెండూ అయిపోయాయి.

దేవికి ఓ బాబు ఉన్నాడు..

దేవికి ఓ బాబు ఉన్నాడు..

దేవి నాగవల్లికి పెళ్లి అయిపోయి ఓ బాబు ఉన్నాడన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆమె భర్త నుండి విడిపోయి విడాకులు కూడా తీసుకున్నారట.

All Images Credited to : Twitter

Desktop Bottom Promotion