Latest Updates
-
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా?
Valentine's Day 2022 Numerology :మీరు పుట్టిన తేదీని బట్టి మీ ప్రేమ జాతకం ఎలా ఉంటుందంటే...
మీ పుట్టిన తేదీని బట్టి 2022లో మీ ప్రేమ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
వాలెంటైన్స్ డే కోసం ప్రతి ఒక్క ప్రేమ జంట ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వాలెంటైన్ వీక్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు.

అయితే ఫిబ్రవరి 14 అనేది తమ ప్రేయసికి లేదా ప్రియుడికి ప్రేమను వ్యక్తం చేయడానికి, వారితో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేయాలని భావించే రోజు. ఇదిలా ఉండగా.. 2022 సంవత్సరంలో మీ భవిష్యత్తు, మీ మానసిక స్థితి, మీరు మీ ప్రేమికుడు లేదా జీవిత భాగస్వామితో ఎలా గడపొచ్చు

అనే దాని గురించి సంఖ్యాశ్యాస్త్రం ఏమి చెబుతోంది.. మీ పుట్టిన తేదీ ఆధారంగా, వాలెంటైన్స్ డే 2022 ఎలా గడుస్తుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

1, 10, 19, 28
2022 సంవత్సరం అంకెల మొత్తాన్ని కలిపితే 6 వస్తుంది. న్యూమరాలజీ ప్రకారం, ఆరో నెంబరు ప్రేమ, ఆకర్షణ, మంచి ఆరోగ్యం, పనికి సంబంధించినదిగా ఉంటుంది. పై తేదీల్లో పుట్టిన వారికి వాలెంటైన్ రోజున మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు మీ పార్ట్నర్ తో కలిసి డేట్ వెళ్లొచ్చు. మీరు లాంగ్ డ్రైవ్ కు లేదా రోడ్ ట్రిప్ ప్లాన్ చేయొచ్చు. మీ భాగస్వామితో కలిసి ఏకాంతంగా గడిపే గొప్ప సమయంగా మారుతుంది. మీ ఫీలింగ్స్ మరియు కోరికల విషయంలో మీరు చాలా నిజాయితీగా ఉండాలి.
లక్కీ నెంబర్స్ 3, 5

2, 11, 20, 29
ఈ తేదీల్లో పుట్టిన వారికి వాలెంటైన్ వేళ ప్రేమికుల మధ్య ఏదైనా అపార్థాలు మరియు విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి. మిమ్మల్ని చిక్కుల్లో పడేసే మరియు మీ భాగస్వామి నుండి మిమ్మల్ని దూరం చేసే సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయండి. గతంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే.. క్షమాపణలు చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా ఆనందంగా గడుపుతారు. మీ పార్ట్నర్ కు రోజ్ లేదా ఆరెంజ్ కలర్లో ఏదైనా బహుమతి ఇస్తే వారు హ్యాపీగా ఫీలవుతారు.
లక్కీ నెంబర్స్ 6, 8

3, 12, 21, 30
ఈ తేదీల్లో పుట్టిన వారికి వాలెంటైన్ వేళ మీకు అద్భుతమైన ఆశ్చర్యాలు ఎదురుకావొచ్చు. మీరు నిజమైన ప్రేమను పొందొచ్చు. మీరు వెతుకుతున్న వ్యక్తి ఇప్పటికే మీ వద్దకు చేరి ఉండొచ్చు. మీరు మళ్లీ ప్రేమలో పడొచ్చు.
లక్కీ నెంబర్స్ 5, 6,8

4, 13, 22, 31
ఈ తేదీల్లో పుట్టిన వారు వాలెంటైన్ వేళ నిజమైన ప్రేమను పొందొచ్చు. మీ భాగస్వామికి మనోభావాలను వ్యక్తపరిచేందుకు మంచి అవకాశం లభిస్తుంది. మీరిద్దరూ ప్రేమానురాగాలతో ఆనందంగా గడిపేందుకు, మీరు రొమాంటిక్ గా ఆలోచించేందుకు అద్భుతమైన సమయం దొరుకుతుంది.
లక్కీ నెంబర్స్ : 1, 8

5, 14, 23
ఈ తేదీల్లో పుట్టిన వారు ఆకర్షణీయమైన వ్యక్తులను ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ స్వభావం కారణంగా మీరు ఉత్తమమైన ప్రేమను పొందొచ్చు. మీరు కొత్తగా ఏర్పరచుకున్న పరిచయాలు, స్నేహం మీ బంధాన్ని మరింత బలపడేలా చేస్తుంది. ఈ సమయంలో మీరు ఆందోళనలను పక్కన పెట్టేస్తారు. ఈరోజు మీకు ఆహ్లాదకరమైన అనుభవాలు పొందే అవకాశం దక్కుతుంది.
లక్కీ నెంబర్స్ : 1, 7

6, 15, 24
ఈ తేదీల్లో పుట్టిన వారు సాధారణంగా సానుభూతి గల వ్యక్తులుగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ ఇతరుల అవసరాలలో తీర్చేందుకు, ఇతరులకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు మీ భాగస్వామికి ఎక్కువ గౌరవం ఇస్తారు. మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధిస్తారు. ఎలాంటి షరతులు లేని మీ ప్రేమను ఎవరైనా అంగీకరిస్తారు. కాబట్టి మీ భాగస్వామితో మీ ప్రేమను ఆనందంగా ఆస్వాదించండి.
లక్కీ నెంబర్స్ : 1, 2, 9

7, 16, 25
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా సింగిల్ గా ఉండటాన్ని ఇష్టపడతారు. ఒంటరితనంలో ఉండే ప్రశాంతతను ఆనందిస్తారు. మీరు సహజంగా ప్రేమించుకుంటారు. మీరు మళ్లీ మళ్లీ ప్రేమలో పడతారు. మీ భాగస్వామికి మీ సమయంలో ఎక్కువ వాటా ఇవ్వాలని కోరుకుంటారు. మీ పార్ట్నర్ తో కలిసి, హాలిడేను ప్లాన్ చేసుకోవడం మీకు ఉత్తమమైన ఆసక్తిని కలిగిస్తుంది.
లక్కీ నెంబర్స్ : 3, 5

8, 17, 26
ఈ తేదీల్లో పుట్టిన వారు కొంత కంగారుగా ఉంటారు. వీరికి త్వరగా స్థిరపడాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు డబ్బు, ఆస్తులను కాకుండా మీ భాగస్వామికి నిజమైన ప్రేమను చూపాలి. మీరు ఒకే ఒక భాగస్వామితో నిజమైన సుఖాన్ని మరియు ఆనందాన్ని పొందే వ్యక్తి. మీరు వారిని అభినందిస్తున్నారని మరియు వారిని ఆరాధిస్తారని వారికి తెలియజేయండి. అప్పుడు కలిగే అనుభూతిని మీరే తెలుసుకుంటారు.
లక్కీ నెంబర్స్ 6, 7

9, 18, 27
ఈ తేదీల్లో పుట్టిన వారు వీరు డ్రస్సింగ్ స్టైల్ ను బాగా ఇష్టపడతారు. అలాంటి వారిని ఎక్కువగా అభినందిస్తారు. వారికే బాగా ఆకర్షితులవుతారు. అందుకే వీరు భాగస్వామితో వినయంగా ఉంటారు. మీ జీవితంలో అలాంటి వ్యక్తులు ఉన్నందుకు చాలా సంతోషిస్తారు. వీరు భాగస్వామితో బాగా ఆనందిస్తారు.
లక్కీ నెంబర్స్ 3, 7



Click it and Unblock the Notifications