Latest Updates
-
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు
Valentines Day 2023: ఈ దేశాల్లో ప్రేమికుల రోజు వేడుకలు కాస్త డిఫరెంట్, వావ్ అనాల్సిందే..
ప్రేమికుల రోజును ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కోలా చేసుకుంటారు. ఏయే దేశాల్లో ఎలా చేసుకుంటారు, విభిన్నంగా ప్రేమికుల రోజున గడుపుకునే దేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదు. కానీ వాలెంటైన్స్ డే ప్రేమను కాసత వెరైటీగా, మరింత హృద్యంగా వ్యక్తపరచాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రేమికుల రోజున తమ ప్రియురాలు ప్రియుడికి మరింత దగ్గరవ్వాలని, తమ బంధం శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుంటారు ప్రేమికులు.

ప్రేమికుల రోజు గురించి దాని చరిత్ర గురించి ఎన్నో కథలు వినిపిస్తాయి. అయితే చాలా మంది నుండి వినిపించే కథ వాలెంటైన్ అనే లవ్ గురూ కథ. ఆయన పేరు మీదుగానే వాలెంటైన్స్ డే వచ్చిందని అంటారు. అయితే ఈ ప్రేమికుల రోజును ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కోలా చేసుకుంటారు. ఏయే దేశాల్లో ఎలా చేసుకుంటారు, విభిన్నంగా ప్రేమికుల రోజున గడుపుకునే దేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అర్జెంటీనా
మన దేశంలో ఫిబ్రవరి నెలను లవ్ మంత్ అంటారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే అదే ప్రేమికుల రోజును జరుపుకుంటాం. అయితే అర్జెంటీనాలో జులైలో జరుపుకుంటారు. దానిని వారు వీక్ ఆఫ్ స్వీట్‌నెస్‌గా పిలుచుకుంటారు. ఆరోజు ఒకరికొకరు స్వీట్లు ఇచ్చిపుచ్చుకుంటారు.

2. ఫ్రాన్స్
(image:Nyoooz)
ఒకప్పుడు ప్రేమికుల రోజు కార్డ్స్ ఇచ్చిపుచ్చుకునే వారు. మంచి అందమైన కార్డులో తమ భావాలు తెలిపేలా ప్రియమైన వారికి ఇచ్చేవారు. ఈసాంప్రదాయం ఫ్రాన్స్ లో 1415 నాటి నుండి మొదలైందని చెబుతారు. ఫ్రాన్స్ లో వాలెంటైన్ అనే గ్రామం ఫిబ్రవరి 12 నుండి 14వ తేదీ వరకు రొమాన్స్‌కు కేంద్రంగా మారుతుంది. ఈ మూడు రోజులు వాలెంటైన్ గ్రామం చూడముచ్చటగా ఉంటుంది. ప్రత్యేకంగా అలంకరించిన ఈ ప్రదేశాన్ని తప్పక చూడాల్సిందే.

3. దక్షిణ కొరియా
(image:TheIndependent)
దక్షిణ కొరియాలో ప్రతి నెల 14వ తేదీని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 14 - వాలెంటైన్స్ డై, మే 14- రోజ్ డే, జూన్ 14 - కిస్ డే, డిసెంబర్ 14- హగ్ డే ఇలా ప్రతి నెలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఏప్రిల్ 14వ తేదీని సింగిల్స్ అంటే ఎవరితోనూ సంబంధంలోలేని వారు బ్లాక్ నూడుల్స్ తినడం ద్వారా బ్లాక్ డే జరుపుకుంటారు.

4. ఫిలిప్పీన్స్
(image:FNP)
వాలెంటైన్స్ డే రోజు ఫిలిప్పీన్స్ లో గాలా ఈవెంట్ జరుగుతుంది. చర్చిలు, ప్రభుత్వ సంస్థలు భారీ ఎత్తున ఉచితంగా పెళ్లిళ్లు జరిపిస్తాయి. అలాగే వేలాది మంది ప్రేమికులు మనీలా బే తీరంలో ఆడి పాడతారు, అర్ధరాత్రి వేళ అందరూ ఒక్కసారిగా తమ ప్రియమైన వారిని కిస్ చేస్తారు.

5. ఘనా
ఘనాలో ఫిబ్రవరి 14ని నేషనల్ చాక్లెట్ డేగా జరుపుకుంటారు. ప్రేమికుల రోజు థీమ్ మెనులు, ప్రత్యేక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు ఉంటాయి. దేశంలో పర్యాటకాన్ని పెంచేందుకు 2007 నుండి అక్కడి ప్రభుత్వం ఈ వేడుక నిర్వహిస్తుంది.

6. బల్గేరియా
బల్గేరియాలో వాలెంటైన్స్ డే రోజు వైన్ లో మునిగి తేలుతారు. ఇక్కడ ఫిబ్రవరి 14ను డే ఆఫ్ వైన్ మేకర్స్‌గా జరుపుకుంటారు.

7. వేల్స్
(image:WelshLoveSpoons)
వేల్స్ లో ప్రేమికుల దినోత్సవాన్ని జనవరి 25వ తేదీన జరుపుకుంటారు. దీనిని డే ఆఫ్ శాన్ డ్విన్వెన్ అని పిలుస్తారు. ఈ రోజు ప్రేమికులు ఒకరికొకరు చేతితో తయారు చేసిన చెక్క స్పూన్లను పంచుకుంటారు. ఈ సాంప్రదాయం 16వ శతాబ్దం నుండి వస్తోంది.

8. స్పెయిన్
(image:OdysseysUnlimited)
స్పెయిన్‌లోని వాలెన్సియాలో ప్రేమికుల రోజున అక్టోబర్ 9న జరుపుకుంటారు. దీనిని ఇక్కడి ప్రజలు సెయింట్ డియోనిసస్ ఫీస్ట్ అని పిలుచుకుంటారు. ఈ రోజు స్పెయిన్‌లోని చాలా ప్రాంతాల్లో మకాడోరా, మార్జిపాన్ బొమ్మలను తయారు చేసి ప్రేమికులు ఇచ్చిపుచ్చుకుంటారు.

9. సౌత్ వెస్ట్ చైనా
(image:ChinaEducationalTours)
సౌత్ వెస్ట్ చైనాలోని మియావోలో సిస్టర్స్ మీల్ ఫెస్టివల్‌ను మార్చి 15న జరుపుకుంటారు. ఈ రోజు వెండి ఉపకరణాలు, దుస్తులు ధరిస్తారు. రంగుల అన్నం వండుతారు. రైస్ బౌల్స్ ను ఓ పట్టు వస్త్రంలో ఉంచి యువకులకు ఇస్తారు. అందులో చాప్‌స్టిక్‌లు, గార్లిక్ ఉంచుతారు. ఎంచుకున్న రైస్ బౌల్‌లో ఉండే వస్తువును, పదార్థాన్ని బట్టి ప్రేమను చూస్తారు.



Click it and Unblock the Notifications