Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ ఇంట్లో రాగి పాత్రలున్నాయా? వాస్తు ప్రకారం వాటిని ఎలా వాడాలో తెలుసా?
రాగి పాత్రల ఉపయోగం ఆరోగ్యంగా మంచిదే అయినా వాటిని ఎలా వాడాలి, ఎక్కడ ఉంచాలి, ఎలా నిర్వహించాలో వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. మీ ఇంట్లో రాగి పాత్రలు ఉంటే వాటిని ఎలా నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధునిక కాలంలో వంటగదిలో స్టీల్, గాజు, నాన్ స్టిక్ వంట సామాన్ల వాడకం ఎక్కువై పోయింది. ఈ మధ్య కుండలు, మట్టిపాత్రల్లో వండటం మొదలైంది. అయితే ఆయుర్వేదం ప్రకారం రాగి పాత్రలు చాలా మంచివని అంటారు. రాగి పాత్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు. అందుకే రాగి పాత్రలను జ్యూవెల్లరీ ఆఫ్ కిచెన్ అని పిలుస్తుంటారు. రాగి పాత్రల్లో ఉంచి నీరు కాలేయం, మూత్రపిండాలకు మంచిదని అంటారు.

రాగి పాత్రల ఉపయోగం ఆరోగ్యంగా మంచిదే అయినా వాటిని ఎలా వాడాలి, ఎక్కడ ఉంచాలి, ఎలా నిర్వహించాలో వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. మీ ఇంట్లో రాగి పాత్రలు ఉంటే వాటిని ఎలా నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి సూర్యుడిని సూచిస్తుంది. అందుకే రాగి పాత్రలు వాడితే జాతకంలో సూర్యుడు బలపడతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం రాగి పాత్రలను సరైన దిశలో ఉంచి, వాటిని సరిగ్గా నిర్వహిస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

వంటగదిలో రాగి పాత్రలు ఎక్కడ ఉండాలి?:
వంట గదిలో రాగి పాత్రలను ఎప్పుడూ తూర్పు దిశలో ఉంచాలి. వాటిని ఎప్పుడూ ఐరన్, స్టీల్ పాత్రలతో కలిపి ఉంచకూడదు. ఐరన్, స్టీల్ రెండూ శనిని సూచిస్తాయి. శని, సూర్యుడి కలయిక మంచిది కాదు. దీని వల్ల ఇంట్లో సమస్యలు రావొచ్చు. జాతకంలో సూర్యుడు, శని ఇద్దరూ బలహీనంగా మారవచ్చు.

రాగి పాత్ర నుండి సూర్యునిడి అర్ఘ్ను సమర్పించాలి:
సూర్యునికి నీటిని సమర్పించినప్పుడు రాగి పాత్రను మాత్రమే ఉపయోగించాలి. అంతే కాదు, పూర్వీకులకు నీరు సమర్పించేటప్పుడు కూడా రాగి పాత్రను మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల సూర్య దోషం, పితృ దోషం రెండింటి ప్రభావం తగ్గుతుంది.

ఈ చోట్ల రాగి పాత్రలు ఉంచొద్దు:
పడకగదిలో రాగి పాత్రలు ఉంచొద్దు. అది సూర్యుని వలె ప్రకాశవంతంగా ప్రసరిస్తుంది. రాగి సంబంధాలను పాడు చేస్తుంది. దంపతుల మధ్య తగాదాలు, కలహాలు రేకెత్తిస్తుంది. తరచూ గొడవల వల్ల ప్రశాంతత దూరమవుతుంది. అటువంటి పరిస్థితిలో పడుకునే ప్రదేశంలో ఎప్పుడూ రాగి పాత్రలను ఉంచకూడదు.

ఆయుర్వేదంలో రాగి ప్రాధాన్యత:
ఆయుర్వేదం ప్రకారం రాగికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే రాగితో తయారు చేసిన వంటసామాను, పాత్రలను వాడాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఆరోగ్య సంరక్షణ, జీవిత శాస్త్రం యొక్క పురాతన, విశ్వసనీయ రూపమైన ఆయుర్వేదం ద్వారా రాగి వినియోగానికి విస్తృతంగా మద్దతు ఉంది. రాగి సూర్యుడు, అగ్నితో సంబంధం కలిగి ఉన్నందున ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. రాగి వాడకం జీవక్రియ రేటును పెంచుతుంది. బియ్యాన్ని తాజాగా ఉండేలా నిల్వ చేయడానికి రాగి పాత్రలు చక్కగా ఉంటాయి.
రాత్రి వేళ రాగి పాత్రలో నీరు పోసి వాటిని ఉదయం తాగితే ఆరోగ్యానికి మంచిది. రాగి పాత్రల్లోని నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడైంది. అయితే రాగి పాత్రలు వాడుతున్నప్పుడు వాటిని తరచూ కడగడం మాత్రం మర్చిపోకూడదు. పీతాంబరం వేసి కడగడం వల్ల రాగికి పట్టుకుని మురికి తొలగిపోతుంది.
ఇలా తరచూ రాగి పాత్రలను కడిగాలి. లేకపోతే ఆ మురికి పేరుకుపోతుంది. అలాగే రాగి పాత్రలో పోసిన నీటిని వెంటనే తాగితే ప్రయోజనం ఉండదు. కొత్త సేపటి వరకు ఆగిన తర్వాతే రాగి పాత్రలోని నీటిని తాగాలి.



Click it and Unblock the Notifications